సబ్ ఫీచర్

నిరీక్షణ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భార్యలను వదలిపెడుతున్న భర్తలు
పదిమందిలో ఒకరు బాధితురాలే
వారి రాకకోసం ఎదురుచూపులు

ధనుష్కోటి.. ఇది ఒకప్పుడు అందమైన దీవి. చుట్టూ నీరు.. మధ్యలో ఎత్తయిన ఇసుకతో నిండిన ప్రాంతం. ఇక్కడ మట్టి అనేది మచ్చుకైనా కనిపించదంటే ఆశ్చర్యం వేస్తుంది. అంతా ఇసుకే. ఆ ఇసుకలోనే వేసుకున్న చిన్న చిన్న గుడిసెలు. తమిళనాడులోని రామేశ్వరం జిల్లాలో ఉండే ఓ చిన్నపాటి ద్వీపకల్పం అని అనవచ్చు. 1964లో వచ్చిన తుఫాను వల్ల ఈ దీవి చెల్లాచెదురైంది. అప్పటి నుంచి దీనికి దెయ్యాలదిబ్బగా పేరు వచ్చింది. ఇక్కడి అందమైన దృశ్యాలు చూడటానికి వచ్చే టూరిస్టులు భయంతో సాయంత్రానికి తిరుగు ప్రయాణమవుతారు. స్కూలు, చర్చి వంటివి ఉండేవి. కాని వాటి స్థానంలో ఇపుడు మొండి గోడలు కనిపిస్తుంటాయి. ఆరు వందల గడప ఉండే ధనుష్కోటిలో ఇప్పటికీ జనాభా ఎక్కువ ఉండదు. చేపలు పట్టుకుని వాటిని ఎండబెట్టి అమ్ముకోవటమే జీవనాధారం. ఇపుడిపుడే టూరిస్ట్ ప్రాంతంగా అభివృద్ధిచెందుతున్న క్రమంలో ఇక్కడ మహిళల జీవనంలో మాత్రం అంగుళమంత ముందడుగు పడలేదంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ నివశించే మహిళల్లో ఎక్కువ మంది భర్తలు వదిలేసినవారే. పదిమంది మహిళలు ఉంటే ఇందులో ఒకామె భర్త వదిలేసిన బాధితురాలే. ఎలాంటి చట్టబద్దమైన విడాకులు ఉండవు. పిల్లలు పుట్టగానే భార్యను కాదని వెళ్లిపోవటం ఇక్కడ పరిపాటి. రెక్కలు ముక్కలు చేసుకుని చేపలు అమ్ముకుని జీవనం సాగించే ఈ కుటుంబాల జీవన చిత్రం పరిశీలిస్తే ఎంతో దయనీయంగా ఉంటుంది. చేపలు ఎండబెట్టుకుని వాటిని అమ్ముకుని రూపాయి..రూపాయి కూడబెట్టుకుని కన్నవారు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేస్తారు. కాని కొన్ని నెలలే కాపురం చేసి భార్యలను వాళ్ల మానాన వాళ్లను వదిలేసి భర్తలు వెళ్లిపోతుంటారు. చట్టబద్ధమైన విడాకులేమి తీసుకోరు. ఎప్పటికైనా తన భర్త రాకపోడా.. అని భర్త కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తూ గడుపుతుంటారు.

ఒక్కొక్కరిది ఒక్కొక్క విషాదగాథ..
ముతుకరైపాయి వయసు 52 ఏళ్లు. ఇరవై నాలుగేళ్ల క్రితం భర్త చట్టబద్ధమైన విడాకులు ఇవ్వకుండానే వెళ్లిపోయాడు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. వీరిని పోషించటం కోసం చిన్నప్పటి నుంచి అలవాటైనా చేపలు పట్టడమే వృత్తిగా చేసుకుని బతుకుతోంది. ఆమె ఇద్దరు కుమార్తెలు అముధ (26), సెల్వీ (29)లకు ఐదేళ్లు వయసు ఉన్నపుడు నాన్న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తండ్రి లేకపోవటంతో ఈ ఇద్దరు కూడా చేపలు పట్టుకుని బతుకుతున్నారు. వీళ్లకు స్కూలు ఎలా ఉంటుందో కూడా తెలియదు.

చిన్న వయసులోనే పెళ్లిళ్లు..

ఈ దీవిలో ఆడపిల్లలకు చిన్నవయసులోనే పెళ్లిళ్లు జరుగుతాయి. సెల్వీకి కూడా 14 ఏళ్లలోపే పెళ్లి చేశారు. పెళ్లయిన కొద్దిరోజులకే భర్త ఇంటి నుంచి వెళ్లిపోయాడు. సెల్వీ కొడుకు వయసు ఇపుడు 14 ఏళ్లు. మరో అమ్మాయి అముదకు చిన్న వయసులోనే
పెళ్లి జరిగింది. ఈమెకు కూడా ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత భర్త వెళ్లిపోయాడు. ఇలా ఇక్కడ ఉండే అమ్మాయిలు చాలా మంది భర్తలు వదిలేసినవారే. ఎలాంటి చట్టబద్ధమైన విడాకులు ఇవ్వకుండా రెండు మూడేళ్లు కాపురం చేయటం, వెళ్లిపోవటం ఇక్కడ సర్వసాధారణమైంది. ఇలా పదిమంది అమ్మాయిల్లో ఒకరు భర్త కోసం నిరీక్షించేవారే. భర్త ఉన్నాడో..లేడో తెలియని సందిగ్ధావస్థలో జీవితాలను వెళ్లదీస్తున్నారు.