సబ్ ఫీచర్

అవిశ్రాంత చారిత్రక పరిశోధకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిత్యసత్యానే్వహణే జీవితపరమావధిగా ఎంచి, తన సర్వస్వాన్ని అందుకోసం ధారవోసి, సిద్ధి పొందిన తాపసి ప్రముఖ చారిత్రక పరిశోధకుడు సంగనభట్ల నరహరిశర్మ. కరీంనగర్ జిల్లాచరిత్రతో, ధర్మపురికి చెందిన నరహరి శర్మకు విడదీయజాలని అనుబంధం ఉంది. శాతవాహన చక్రవర్తుల తొలి రాజధానిగా గుర్తింపునొందిన కోటిలింగాల చరిత్ర వెలికితీతకు సంబంధించి నరహరి చేసిన అవిశ్రాంత కృషి అనన్య సామాన్యం.
బాల్యంనుండే చారిత్రక పరిశోధనపై మక్కువ కలిగి, తంతితపాలా శాఖలో అధికారిగా ఉంటూ లక్షలాది రూపాయలను తృణప్రాయంగా ఖర్చుచేసి, మరుగున పడిన ఎన్నో చారిత్రక సత్యాలను వెలికి తీశారాయన. నాటి రాష్ట్ర రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర పురావస్తుశాఖ డైరక్టర్ డాక్టర్ ఎన్.రమేశన్, మాజీ డైరక్టర్లు వి.వి.కృష్ణశాస్ర్తీ, పి.వి.పరబ్రహ్మశాస్ర్తీల ఆహ్వానంపై పురావస్తుశాఖలో ఎపిగ్రాఫిక్ అసిస్టెంట్ (ఉప శాసనాధికారి)గా, విధుల్లో చేరి తన కార్య క్షేత్రాన్ని రాష్ట్రంలో విస్తరింపజేశారు. ధర్మపురికి అగ్నేయదిశలో 19 కిలోమీటర్ల దూరాన, గోదావరి తీరాన గల కోటిలింగాల, ఆంధ్రదేశాన్ని ఏలిన శాతవాహనుల తొలి రాజధానిగా రుజువుపరచడానికి నరహరి కృషే మూలాధారం. అంధ్రుల తొలి రాజుగా పురాణాల్లో వర్ణించే శ్రీముఖ శాతవాహనుని నాణేలను నరహరి సేకరించిన నేపథ్యంలోనే కోటిలింగాల చరిత్ర పుటలకెక్కింది. శాతవాహన అనంతర కాలం నాటి ఉద్యోగ వర్గానికి చెందిన ‘‘మహాతలవర’’, ‘‘మహాసేనాపతిస’’ అనే నాణేలు ఇక్కడ ఆయనకు లభించాయ. విదిశా నగరాన్ని కేంద్రంగా పాలించినట్లు చరిత్రకారులు భావించే చివరి శుంగరాజుల నాణేలు కూడా ఇక్కడ లభించాయ. నాణెములపై బ్రహ్మీలిపిలో ‘‘రఙగోభదస’’, ‘‘రఙసమగోపస’’ అని లిఖించి ఉన్నాయ. వీటితోపాటు శుంగరాజుల అనంతరం మగధ నేలారని పురాణాల్లో పేర్కొన బడిన కాణ్వరాజుల నాణేలను నరహరి సేకరించారు. వీరిలో కంవాయసిరి (కణ్వాయశ్రీ), నారంనస (నారాయణస్య) అని వ్రాసి ఉంది. పునర్ముద్రితాలైన శాతవాహనుల నాణేలపై సమగోపుని నాణేలలోని చిహ్నాలున్నాయి. ఇవన్నీ పురాణాల్లో పేర్కొన్నట్టు మగధరాజ్యాన్ని వౌర్యుల అనంతరం శుంగులు, కాణ్వులు పిదప అంధ్రరాజులు వరుసగా పాలించినట్లు తార్కా ణమని రాష్ట్ర పురావస్తుశాఖ మాజీ డైరక్టర్ పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్ర్తీ సోదాహరణంగా నిరూపించారు.
శాతవాహనుల కాలంనాటి బ్రహ్మీలిపిలోని శిలాఫలకాలను కోటిలింగాల పొలాలలో శర్మ కనుగొన్నారు. ఇక్కడ లభించిన అపురూప నాణేలు వేరెక్కడా లభింపని కారణంగా, కోటిలింగాల శాతవాహనుల తొలి రాజధానియని, ధర్మపురి మహాత్మ్య గ్రంథంలో పేర్కొన్న, ధర్మపురీ సమీపస్థ అంధ్ర రాజధాని కోటిలింగాలేనని నరహరిశర్మ పరిశోధనల ఫలితంగా స్పష్టమైంది. అంతేకాక మరికొన్ని అపూర్వ నాణేలను నరహరి సేకరించి పురావస్తు శాఖకు అందజేశారు. వీటిపై ‘‘రఙసిరిశాతవాహ’’, ‘‘రఙసాతకంనిస’’ అని బ్రహ్మీలిపిలో లిఖించి ఉంది. లిపి ప్రకారము ఇవి శ్రీముఖునికన్నా ప్రాచీనమైనవి. వీటిల్లో సహజంగా ఉండవలసిన ఉజ్జయిని చిహ్నం, ఏనుగు చిహ్నంలేవు. వీనివలననే శ్రీముఖుని పూర్వం శాతవాహనుడు, శాతకర్ణి అనే ఇరువురు రాజ్యమేలారని, అశోకుడు శ్రీముఖునికన్నా పూర్వము వారని, అశోకుని 13వ శాసనంలో ఆంధ్రుల ప్రశంస ఉన్నదని అపూర్వ పరిశోధన ద్వారా నరహరిశర్మ తేల్చి చెప్పారు. 1988లో నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీరామారావుకు, వేటూరి ప్రభాకరశాస్ర్తీ వర్ధంతి సందర్భంగా, కరీంనగర్ జిల్లాలోని కురిక్యాల శాసనం గురించి తెలిపి, 9వశతాబ్దిలోనే కరీంనగర్ జిల్లాలో కందపద్యాల రచన జరిగినట్లు, నరహరి వివరించిన సందర్భంలో, ఎన్టీఆర్, నరహరి శర్మ కృషిని ప్రశంసించారు.

- ఎస్. రామకృష్ణయ్య