సబ్ ఫీచర్

ఆలోచనా సరళిని పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉపాధ్యాయుడు తరగతి గదికి వెళ్లేముందు జ్ఞాన వ్యవస్థలోనే ఉంటాడు. ఉపాధ్యాయుని మెదడులో విద్యార్థి చెప్పవలసిన అంశం ఆవరించి ఉంటాయి. కొత్తగా వచ్చిన టీచర్ పాఠ్యాంశం పైననే కేంద్రీకరిస్తాడు. అనుభవంగల టీచర్ దృష్టి విద్యార్థి వయసు, విద్యార్థి నేపథ్యం, సమాజం, ఆనాటి సంఘంలో విషయాలపై జరుగుతున్న చర్చపై ఉంటుంది. ఉపాధ్యాయుని ప్రిపరేషన్ అనుభవంపై ఆధారపడి అభివృద్ధి చెందుతుంది. పిల్లలతో ఉండే వాత్సల్యంతో ఉపాధ్యాయుడు పాఠాన్ని పేరెంట్‌గానే చెప్పే ప్రయత్నం చేస్తాడు. పాఠాన్ని ఉయ్యాల్లోపెట్టి విద్యార్థికి అందించే ప్రయత్నం చేస్తాడు. దీంతో పాఠం లక్ష్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. పేరెంట్ వేరు, టీచర్ వేరు. పేరెంట్‌కు పిల్లల ఉల్లాసమే ప్రధానం. టీచర్‌కు విద్యార్థియొక్క నైపుణ్యం, భవిష్యత్తుకూడా ప్రధానం. కొన్నిసార్లు గుట్టలపైన, రాళ్లపైన కూడా నడిపించవలసి ఉంటుంది. కొన్ని సవాళ్లను పిల్లల ముందుకు వస్తాయి. పిల్లలు ఎక్కువగా శ్రమపడటాన్ని తల్లిదండ్రులు భరించలేరు. ఉపాధ్యాయుని లక్ష్యంతోపాటు పిల్లలను జీవినిలదొక్కుకునే విధంగా తయారుచేయాలి. కొన్నిసార్లు తల్లిదండ్రులు వచ్చి ఈ లెక్క మీరు చేస్తారా? అని నన్ను అడిగారు.
ఈ లెక్క నావల్లకాదు, నేను చేయలేను అన్నాను.
ఈ లెక్క మా పిల్లవాడికిస్తే ఏం చేస్తాడు సార్ అన్నారు.
అదే మీకు నాకు ఉన్న తేడా అని ఆ తల్లిదండ్రులకు చెప్పాను.
రేపు నీ కొడుకు ఏదో ఒక నూతన విషయాన్ని ఆవిష్కరిస్తే మీరు, నేను ఉభయులం కూడా సంతోషిస్తాం. తండ్రి ఫలితానే్న ప్రేమిస్తాడు.
ఉపాధ్యాయుడు మాత్రం విద్యార్థి ఆలోచించే పద్ధతిని ప్రేమిస్తాడు.
ఆలోచన అన్నది ఒక్కరోజుతో వచ్చేది కాదు. అది ఒక భగీరథ కృషి. కొన్నిసార్లు ఉపాధ్యాయుణ్ణి కూడా తల్లిదండ్రులు తప్పుగా అర్థం చేసుకుంటారు. ఉపాధ్యాయుని వాత్సల్యత భవిష్యత్ లక్ష్యంతో కూడుకొని ఉంటుంది. తండ్రి వాత్సల్యత వర్తమానపు సంతోషంతో ముడిపడి ఉంటుంది. పాఠం చెప్పేటప్పుడు అన్ని విషయాలు విడమరిచి చెప్పడు. పిల్లవాడు ఆ విషయాల ముడి విప్పితే ఉపాధ్యాయుడు ఆనందపడతాడు. ఉపాధ్యాయుడు పాఠం చెప్పేటప్పుడు తండ్రిగా ఆలోచించకూడదు. ఒక వూహించని ప్రపంచాన్ని ఎదుర్కొనేటువంటి సామర్థ్యం తన నైపుణ్యంతో కలిగిస్తాడు.
ఉపాధ్యాయుడు పాఠం చెప్పే పద్ధతి రకరకాలుగా ఉంటుంది. కొత్త ఉపాధ్యాయుడైతే సిలబస్ పూర్తిచేశానని ఠక్కున అకడమిక్ రిపోర్టు ఇస్తారు. సిలబస్ పూర్తిచేయటం ఒక్కటే ఉపాధ్యాయుని లక్ష్యం కాకూడదు. జీవితానికి కావల్సినటువంటి ఆయుధాలన్నీ విద్యార్థియొక్క పోదిలోకి చేకూర్చామా లేదా అన్నది ప్రధానం. కాబట్టే విద్యార్థి ఎక్కడికన్నాపోతే చాలామంది ఎప్పుడు ఒకే ప్రశ్న అడుగుతారు.
మీకు పాఠాలు చెప్పిన టీచర్ ఎవరు అని అడుగుతారు.
దాంతో ఆ విద్యార్థి ఆలోచనాసరళి అర్థం అవుతుంది.
విషయ పరిజ్ఞానంకన్నా పిల్లల్లో ఆలోచనా సరళిని పెంచటం ఉపాధ్యాయుని యొక్క లక్ష్యం.
పిల్లలు పరీక్షల్లో మార్కులు పెంచటమే ప్రధానం కాదు. వారికి పాఠంతోపాటు జీవితం, జీవన విధానాన్ని కూడా బోధించాలి. ఓ ముప్పయేళ్ల తరువాత మా పిల్లలు సమస్యలను ఎలా ఎదుర్కోవాలో ఉపాధ్యాయుడు ఆలోచిస్తాడు. అందుకనుగుణమైన సమస్యలనే ఇచ్చి విద్యార్థులనుంచి పరిష్కారం ఏవిధంగా వస్తున్నదో పరిశీలిస్తాడు. ఆవిధంగా వారిని జీవితపు ఒడుదుడుకులను ఎదుర్కొనే సామర్ధ్యాన్ని కలిగిస్తాడు. అందుకనే విద్యార్థిని మలచడంలో ఉపాధ్యాయుని పాత్ర కీలకం.

- చుక్కా రామయ్య