సబ్ ఫీచర్

ఇవి తింటే ఆరోగ్యం పదిలం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యాన్ని పదికాలల పాటు పదిలంగా ఉంచాలి. అన్నపానీయాల విషయంలో సమయ నియమాలు ఎంతో అవసరం. నిజానికి మనం తీసుకున్న ఆహారం జీర్ణవ్యవస్థలో సాఫీగా అరిగిపోయే విషయంలో ఎన్నో అంశాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఆయా పదార్థాల్లో వున్న గుణాలు, పోషకాలు, ఘనాహారం, ద్రవాహారం, రసాయనాలు, జీర్ణ వ్యవస్థలో చేరిన తర్వాత వాటి కారణంగా విడుదలయ్యే రసాలు, జరిగే క్రియలు. వాటి కారణంగా శరీరంలో జరిగే హార్మోన్ల మార్పులు ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. కొన్ని అధిక శక్తినిచ్చేవి కూడా ఉంటాయి. వీటివల్ల పలు రకాల మార్పులకు దారితీయవచ్చు. పోషకార నిపుణులు సూచించిన ఈ పదార్ధాలను తీసుకుంటే మంచిది.

పెరుగు
పెరుగు జీర్ణ ప్రక్రియ సాఫీగా జరిగేందుకు సాయపడుతుంది. సాధారణంగా పగటిపూట పెరుగు తీసుకోవడం మంచిది. రాత్రి తినకుండా వుంటే బెటర్. ఆయుర్వేదం కూడా పెరుగును రాత్రి తీసుకోవద్దనే చెబుతుంది. ముఖ్యంగా జలుబు, దగ్గు వంటి వాటికి తరచుగా గురయ్యేవారు అలర్జీ సమస్యలు వున్నవారు రాత్రిళ్లు పెరుగు తీసుకోరాదు. ఎందుకంటే ఊపిరి తిత్తుల్లో మ్యూకస్ ఏర్పడేందుకు ఇది కారణమవుతుంది. దాంతో దగ్గు, జలుబు సమస్యలు పెరిగిపోతాయి.
తీపి పదార్ధాలు
ఉదయమే అనుకూలం. సాయంత్రం తర్వాత తీపి పదార్ధాల జోలికి పోరాదు. ఉదయం వేళల్లో మన శరీరంలోని ఇన్సులిన్ చక్కెరలపై పోరాడే విషయంలో చాలా చురుగ్గా వుంటుంది. పైగా పగటిపూట పనుల వల్ల వంట్లోని చక్కెరలు కరిగిపోతుంటాయి. కానీ రాత్రి పరిస్థితి వేరు. శరీరానికి చక్కెరలు ఎక్కువ అవసరం లేదు. ఈసమయంలో ఎక్కువ చక్కెర పదార్ధాలను తీసుకోవడం వల్ల కొవ్వుగా మారి శరీర బరువు పెరుగుతుంది. జీర్ణ వ్యవస్థకు కూడా ఆటంకం.
జున్ను
ఉదయం తీసుకోవడం మంచిది. శాకాహారులకు ఇది మంచి బలవర్ధకమైన ఆహారం. మోస్తరుగా తింటే బరువును నియంత్రిస్తుంది. కడుపుబ్బరాన్ని కంట్రోల్ చేస్తుంది. రాత్రి తింటే మాత్రం అరగడం కష్టం. బరువు పెరుగుతారు.
పాలు
శారీరక శ్రమ ఎక్కువగా వుంటేనే పగటిపూట పాలు తాగాలి. లేదంటే పగటిపూట పాలు తీసుకోవడంవల్ల కడుపు నిండుగాఅనిపిస్తుంది. దంతో అన్నం తినాలనిపించదు. ఫలితంగా భోజన వేళలు మారిపోతాయి. రాత్రి వెచ్చని పాలు తాగడంవల్ల శరీరానికి ఉపశమనం కలుగుతుంది. మంచి నిద్ర పడుతుంది.
రైస్
మన దేశంలో మరీ ముఖ్యంగా దక్షిణాది వారికి అన్నం ప్రధాన ఆహారం. మధ్యాహ్నం, రాత్రి భోజనంలో భాగంగా రైస్ తీసుకుంటుంటారు. బియ్యంలో కార్పొహైడ్రేట్లు అధిక స్థాయిలో ఉంటాయి. ఇవి తక్షణ శక్తినిస్తాయి. కార్బోహైడ్రేట్లు మన శరీరానికి అవసరమే. కానీ అచ్చం అన్నానే్న తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అనే్నసి కార్బోహైడ్రేట్లను శరీరం ఖర్చు చేయలేదు దాంతో అవి కొవ్వుగా మారతాయి. దాంతో బ రువు పెరుగుతారు.అందుకే జీవ క్రియలు అధికంగా వుండే పగటిపూట రైస్ తీసుకోవాలి.బరువు తగ్గాలనుకునేవారు కచ్చితంగా రోజులో ఒక పూట అన్నాన్ని పరిమితంగానే తీసుకుంటే ఫలితం వుంటుందని నిపుణులు చెబుతున్నారు.
మాంసం
మాంసం ప్రోటీన్ల సమాహారం. ఇది జీర్ణం అయ్యేందుకు కనీసం నాలుగునుంచి ఆరు గంటల సమయం పడుతుంది. అందుకే రాత్రిళ్లు మంసాహారాన్ని తీసుకోరాదు. ఎందుకంటే మాంసం ద్వారా వచ్చే అధిక కేలరీలు ఖర్చు కావు. దాంతో అవి కొవ్వుగా మారిపోతాయి. రాత్రికి బదులు మాంసాన్ని ఉదయం, మధ్యాహ్నం వేళల్లో తినడమే నయం. గ్రిల్డ్, బేక్డ్‌వైట్, లీస్‌మీట్ అయితే తేలిగ్గా జీర్ణమవుతాయి.