సబ్ ఫీచర్

బీసీలపై సమగ్ర సర్వే అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన కులాలు (బీసీ)లో కొన్నింటికి రిజర్వేషన్ ఫలాలు అందడంలో ఆర్థికంగానూ, ఉద్యోగపరంగానూ బయటపడ్డాయి. మరికొన్ని కులాలు ఇంకా వెనుక బాటలోనే ఉన్నాయి. ఎప్పటికపుడు కొత్తకులాలు జాబితాలోకి చేరుతుండటంతో బీసీ జాబితా చాంతాడంత రూపుదిద్దుకొంది. ఉత్తరాంధ్రలో వ్యాపారమే ప్రధాన వృత్తిగా నడిపే వైశ్యకులాల్ని బీసీ జాబితాలో చేర్చారు. తూర్పు, పశ్చిమ గోదావరుల్లోనూ, కృష్ణా జిల్లాలోనూ ఉన్న కాపులు ఎప్పటినుండో బీసీలుగా చేర్చాలని పోరాడుతూనే ఉన్నారు. రాష్ట్రంలో ఎటొచ్చి దురదృష్టవంతులెవరైనా ఉన్నారంటే వారు బ్రాహ్మణులే కావచ్చు. పేదరికంతోనూ, అగ్రవర్ణ ముద్రతోనూ అత్యధికంగా ఆలయాల అర్చకత్వమే ఆధారంగా జీవనం కొనసాగిస్తున్నారు. రిజర్వేషన్ ఫలాలకు అందనంత దూరంలో మిగిలిపోయారు. బిసి జాబితాలోని కులాలకు చెందిన కుటుంబాలు రిజర్వేషన్ ఫలాలతో ఉద్యోగాలు పొంది ఆర్థికంగా స్థిరపడ్డాయి. మరికొన్ని కులాలు మాత్రం ఎదుగు బొదుగూ లేక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు మిగిలిపోయాయి.
బీసీలలో గ్రూపు ‘ఎ’ జాబితాలో ఆదిమ, విముక్త, సంచార, అర్థ సంచార తెగలను చేర్చారు. స్వాతంత్య్రం వచ్చి ఆరు శతాబ్దాలు దాటినా వారిలో వెలుగు కానరావటం లేదు. వాడ బలిజ, బెస్త, జాలరి, గంగ, గంగపుత్ర, గోండ్లు, నెయ్యి పట్టపు, బహురూపి, బుడబుక్కల, రజక, దాసరి, దొమ్మర, గంగిరెద్దువారు, జంగం, జోగి, కాటికాపల, కర్చ, మేదరి, పిచ్చిగుంట్ల, పాముల, వాల్మీకబోయి, కంజరబట్టు, మందుల, కూనపులి, ఒడ్డెర తదితర కులాల వారు అల్ప సంఖ్యలోనే ఉన్నప్పటికీ విద్యా, ఉద్యోగపరంగా మిగ తా బిసి కులాలతోపాటు పోటీ పడలేకపోతున్నారు. ఇప్పటికే వారి పిల్లలు బడులకు దూరంగా ఉంటున్నారు. వలసలతోను, యాచక వృత్తిలోనే ఉన్నా రు. ఇటువంటి పరిస్థితులలో వారికి ఎన్ని సంవత్సరాలు రిజర్వేషన్లు కల్పించినా వారి తలరాత మారడం లేదు. ఉపాధి హామీ పథకాలు సైతం వారి జీవితానికి ఆర్థిక హామీలను ఇవ్వలేకపోతున్నాయి.
మనిషి పుట్టిన నుండి మరణించినంత దాకా అవసరముండే రజకులు దయనీయ పరిస్థితుల నుండి బయటపడటంలేదు. ఇతర రాష్ట్రాలలో ఎస్సీ జాబితాలో ఉన్నా ఈ కులం ఏ మాత్రం బిసి జాబితాలో లబ్ధి పొందలేకపోతోంది. జాలర్లకు, రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాగే బిసి ‘బి’లోని అచ్చుకట్లవారు, దూదేకుల, కుమ్మరి, కంచరి, ఈడిగవారు, గ్రూపు ‘డి’లోగల సాతాని, భూమి పనులే ప్రధానంగాగల ఉప్పర్లు, అరికటి, జక్కల, కళావంతులు, నాగవంశజులు తదితర కులాలు ఉద్యోగ, ఆర్థికవృద్ధి సాధించలేకపోతున్నారు. ఇక ఇటీవల చేర్చిన పొందర్లు, కూరకులు, సాంజీలు వంటి భాషా మైనార్టీలకు ఆలస్యంగానైనా చేర్చడం ముదావహం. బిసి జాబితాలోని చాలా కులాలు సమగ్రాభివృద్ధికి నోచుకోవటం లేదు. మరికొన్ని కులాలు రిజర్వేషన్లవల్ల కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు సభ్యులు ఉద్యోగాలు పొందటంతో వారి పరిస్థితి మెరుగుపడింది.
బిసిల ఆర్థిక స్థితిగతులపై పకడ్బందీగా సర్వే నిర్వహించి తగిన దీర్ఘకాలిక కార్యాచరణ రూపొందించి, ఆయా కులాల జనాభా మెరుగైన పరిస్థితులకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బిసిల కార్యాచరణలో తాత్కాలిక పథకాలు, ఉపాధికి ప్రాధాన్యత తగ్గించి విద్య, ఉద్యోగ కల్పనకు కృషిచేసి, వారి సంప్రదాయ యోచన తదితరాల నుండి దూరం చేయాల్సిన అవసరముంది.

-గున్న గంగాధరరావు, సెల్: 9440974103