సబ్ ఫీచర్

సదా స్మరామి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాస్ర్తియ సంగీత స్వరఝరి డాక్టర్ గిరిజాదేవి. అలనాటి మీరాబాయి ఎలా పాడారో మనకు తెలియదు కానీ అలాంటి భక్తి సంగీతాన్ని ఆమె ఎల్లలు దాటించారు. సంగీతానికి శాస్ర్తియతను జోడించి తుమ్రి క్వీన్‌గా ప్రసిద్ధిచెందిన లెజెండరీ సంగీత విద్వాంసురాలు డాక్టర్ గిరిజాదేవి. ఈ అమర గాయకురాలి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ఆమె అడుగుజాడల్లో నడిచే సంగీత కళాకారులు ఎందరో ఉన్నారు. ఎల్లలు లేని ఆమె గానామృతాన్ని రాబోయే తరానికి అందించే బృహత్తర కార్యక్రమాన్ని భుజానికెత్తుకున్నారు అమిత్ బరారియా, ఆరాధన కర్హాడే శాస్ర్తీ. సంగీత ఉపాధ్యాయురాలిగా గత ఇరవై మూడేళ్ల నుంచి సేవలందిస్తున్న ఆరాధనకు ఆమె పేరుకు తగ్గట్లే డాక్టర్ గిరిజాదేవి అంటే ఎనలేని ఆరాధనాభావం. ఆ సంగీత విద్వాంసురాలిని సదా చిరస్మరణీయురాలుగా సంగీత కళాకారుల స్మృతిపథంపై నిలిపేందుకు ఉపక్రమించారు. ఈ సంగీత సరస్వతిపై డాక్యుమెంటరీని రూపొందించే పనిలో పడ్డారు. భక్తి సంగీత సేవలో తరించిన ధన్యజీవి ఆమె. అలాంటి అపర సంగీత సరస్వతి గురించి ఎక్కువ మందికి తెలియదు. హిందుస్థానీ శాస్ర్తియ సంగీతానికి ఆమె అందించిన సేవలు సజీవంగా భావితరానికి అందించేందుకు, భావి సంగీత కళాకారులు ఆమెను అనుసరించేందుకు ఈ డాక్యుమెంటరీ దోహదం చేస్తుందనే నమ్మకంతో ఆమె ఈ పనికి ఉపక్రమించారు.

తుమ్రి రాణీకి మరణం లేద

డాక్టర్ గిరిజాదేవి వంటి సంగీత సామ్రాజ్ఞి మళ్లీ జన్మించారు. వారు వదలి వెళ్లిన సంగీత సౌరభాలను భావితరాలు సైతం ఆస్వాదించాలనే సదాశయంతో ఈ డాక్యుమెంటరీని ఆరంభించాను. డాక్టర్ గిరిజాదేవి సంగీత కచ్చేరీని ప్రత్యక్షంగా చూసే భాగ్యం కలిగిందని ఆరాధన, అమిత్ పేర్కొంటూ.. ఆమెతో మెలిగిన సాన్నిహిత్యాన్ని మరోసారి గుర్తుచేసుకున్నారు. వేదికపై ఎంతో నిరాడంబరంగా ఉంటారో.. నిజ జీవితంలోనూ ఆమె ఎలాంటి అహంకారం లేకుండా తోటి కళాకారులతో మసలుకుంటారు. ఖాయల్స్ పాడటం డాక్టర్ గిరిజాదేవి సంగీత విశిష్టతకు నిదర్శనం. కాని కొంతమందికి మాత్రమే తెలుసు ఖాయల్స్ పాడతారని, 87 ఏళ్ల వయసులో ఆమె అనితర సాధ్యమైన తుమ్రి, ఖాయల్స్ స్వరాలను భావితరాలకు అందించారు. గొప్ప ధనవంతుల కటుంబంలో పుట్టినా చ్ని వయసు నుంచే ఆమె సంగీత శిక్షణ ఆరంభించారు. ఇలాంటి సంగీత సామ్రాజ్ఞిని ఇష్టపడనివారు ఉండరు అని అంటారు ఆరాధన. శాస్ర్తియ సంగీతంలో సరికొత్త సరిగమలు పలికిన ఈ సంగీత సరస్వతిని భావితరాల గుండెల్లో పదికాలాల పాటు పదిలంగా ఉండేందుకు ఈ ఇరువురు చేస్తున్న ప్రయత్నం సఫలం కావాలని ఆశిద్దాం.