సబ్ ఫీచర్

కట్టుబాటు... దిద్దుబాటు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూ వివాహ చట్టం భార్యాభర్తలకు పవిత్ర బంధాన్ని కల్పించింది. కట్టుబాట్ల నీడలో తమ సంసారాలను అందమైన బృందావనాలుగా మార్చుకుంటారు. ఆప్యాయయతల మాటున నిండు నూరేళ్ల జీవితాన్ని సుఖమయం చేసుకుంటుంటారు. ఆనాడు చట్టాలు చేసే సమయంలో వైవాహిక అత్యాచారం కూడదంటూనే అలాంటి సందర్భాలు మంచివి కావనీ సూత్రీకరించారు. వాటిలో కూడా భారతీయ శిక్షాస్మృతిలో కొన్ని మినహాయింపులున్నాయి. భారతీయ కట్టుబాట్లు ప్రత్యేకించి ఇలాంటి అంశాల జోలికి వెళ్లవు. అందుకే భారతీయ కోర్టులో వైవాహిక అత్యాచారాల నమోదు స్వల్పమే.

ఇక్కడో ఉదంతం చెప్పుకోవాలి. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఉదంతానే్న చెప్పుకుందాం. మూడేళ్ల క్రితం వదిలేసిన భార్యను పెద్దల సంప్రదింపులతో కాపురానికి తెచ్చుకున్నాడు. భార్యను శృంగారానికి ఆహ్వానిస్తే ఆరోగ్యం బాగాలేనందున రాలేనంది. అది నిజమో కాదో తేల్చుకునేందుకు డాక్టర్‌ని కలిసి పరీక్షలు చేయిస్తే ఆమెకు అనారోగ్యం నిజమేనని తేలింది. దాంతో ఆ రిపోర్టులతో పోలీసు స్టేషన్‌కెళ్లి తన భర్త వైవాహిక అత్యాచారానికి తెగబడ్డాడని కేసు పెట్టింది. ఔను.. పెళ్లినాటి ప్రమాణాలను మరిచిపోయి, అనుమానించి, అగౌరవపరిచి అతను చేసింది అమానవీయమే. ముమ్మాటికీ లైంగిక హింసే. ఎక్కడో గృహహింస కేసుల్లో ఇలాంటి వాదలుండడం సహజం? సాధారణంగానైతే ఇలాంటి అంశాల్లో సర్దుకుపొమ్మని చెబుతారు తప్ప పెద్దలెవరూ నోరుమెదపరు. నాలుగు గోడలమధ్య ఏం జరిగిందన్నదీ బయటకు వినపడనీయరు. భార్యాభర్తలు వారిలో వారే రాజీపడతారు. ఈ విషయంలో భర్తలు తమ పప్పులుడకనపుడు భార్యలను విడాకుల వరకు తీసుకెళతారు. అంతకుమించి రచ్చకెక్కిన సందర్భాలు బహు అరుదు. అయితే భార్యాభర్తల బంధాలకు చెదలు పట్టడం, కోర్టులనాశ్రయించటానికి కారణం ఇదొక్కటేనని చెప్పలేం. డిఫెన్స్‌కోసం కూడా ఇలాంటి వాదన ఎవరూ పెట్టరు. పాశ్చాత్య దేశాల్లో కట్టుబాట్లు ఏమీ ఉండవు. కనుక భార్య అంగీకారం లేకుండా బలవంతంగా భర్త శృంగారంలో పాల్గొనడమే వైవాహిక అత్యాచారమని కోర్టులకెక్కుతారు. అది అక్కడ మామూలే. అలాంటి సందర్భాల్లో వారు పునస్సంధానం కోరుకోరు కనుకనే కేసులు నడుస్తాయి. చివరికి ఎవరికివారే యమునా తీరే. మన దేశంలో కూడా అదే భాష్యం చెప్పుకున్నా కాపురాలు కూల్చుకునే ధైర్యం చేయరు. అందుకే భారతదేశంలో వ్యవహరించే తీరు వేరుగా ఉంటుంది. ఇక్కడి సాంప్రదాయాలకు ఇదే సబబు. తాజాగా వైవాహిక అత్యాచారంను నేరంగా పరిగణించాలంటూ ఢిల్లీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లో దేశంలో అసలు వైవాహిక అత్యాచారాలే లేవని, ఒకవేళ ఉన్నా అలాంటి అంశాన్ని నేరంగా పరిణించవద్దని కోరింది. భార్య అంగీకారం లేకుండా భర్త ఆమెతో శృంగారంలో పాల్గొనడాన్ని నేరంగా ఎందుకు పరిగణించకూడదో ఢిల్లీ హైకోర్టు ప్రశ్నిస్తే అందుకు బదులుగా కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా జవాబిచ్చింది. చట్టంలో ఉన్న అంశాలపై ఎంతో తేలికగా పరిగణించి ప్రభుత్వం కేవలం తన అభిప్రాయాన్ని తేల్చి చెప్పేయడం ప్రజాస్వామ్యబద్ధంగా భావించలేం. ఇందులో ఇమిడి వున్న ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణిస్తూ వివాహ వ్యవస్థే అస్థిరపడుతుందని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు తన వాదనను వినిపించింది.
ఎంతో సున్నితమైన అంశమైనా భారతీయ శిక్షాస్మతి 498ఎ దుర్వినియోగమవుతున్నకొద్దీ తలెత్తే అనేక ప్రశ్నలకి ప్రభుత్వమే జవాబు చెప్పాల్సి ఉంది. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణిస్తే బెడిసికొట్టే వైవాహిక సంబంధాలను ఏ రకమైన కౌన్సిలింగులూ నిలబెట్టలేవు. ఎన్నో గృహహింస కేసులకు దారితీసి, ఎన్నో కుటుంబాలు రోడ్డునపడే అవకాశముంటుంది. నిండూ నూరేళ్లు కలిసి ఇద్దరొకటై జీవించమని దీవించిన సమాజమే కట్టుబాట్లను తెంచుకునే అవకాశమిస్తే కాపురాలు కూలిపోతాయి. అయితే వైవాహిక అత్యాచారాన్ని చట్టంలో నిర్వచించనందునే సమాజంలో విస్తృత ఏకాభిప్రాయానికి రావాల్సిన ఆవశ్యకత ఉందని కోర్టు సూచించింది. ఇదిలా వుంటే ఈ అంశాలపై న్యాయకోవిదుల స్పందన కూడా తీసుకోవాల్సి వుంది. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణిస్తే భర్తలంతా జైల్లోనే ఉంటారని మాజీ గవర్నర్, సుప్రీంకోర్టు న్యాయవాది, కేంద్ర మంత్రిణి సుష్మాస్వరాజ్ భర్త సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా వుంటే ఈ అంశాలపై న్యాయకోవిదుల స్పందన కూడా తీసుకోవాల్సి వుంది. ఇందులో నిజమెంత? వాస్తవిక పరిస్థితులేమిటి? అనే అంశాలపై తర్జన భర్జన పడేకన్నా వివిధ వర్గాలనుంచి అభిప్రాయ సేకరణ జరిపిన తర్వాతే తగు నిర్ణయం తీసుకోవడం సముచితం.

ఆడదైనంత మాత్రాన తన శరీరంపై తనకు హక్కుండదా? అని ఆర్‌ఐటి ఫౌండేషన్, ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్‌లు ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశాయి. వారి వాదనలో వాస్తవం లేదని చెప్పలేం. అన్ని కేసులు అలాగే వుండవు. నిజమే అలాంటపుడు హిందూ వివాహ చట్టంలోను, భారతీయ శిక్షాస్మృతిలోను మార్పులు తెచ్చేందుకు విస్తృత చర్చకోసం ఎందుకు అవకాశమివ్వదు? అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఆ దిశగా ముందడుగు వేయడమే పాలకుల తక్షణ కర్తవ్యంగా భావించాలి.

వైవాహిక అత్యాచారాన్ని చట్టంలో నిర్వచించనందునే సమాజంలో విస్తృత ఏకాభిప్రాయానికి రావాల్సిన ఆవశ్యకత ఉందని కోర్టు సూచించింది. ఇదిలా వుంటే ఈ అంశాలపై న్యాయకోవిదుల స్పందన కూడా తీసుకోవాల్సి వుంది. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణిస్తే భర్తలంతా జైల్లోనే ఉంటారని మాజీ గవర్నర్, సుప్రీంకోర్టు న్యాయవాది, కేంద్ర మంత్రిణి సుష్మాస్వరాజ్ భర్త సంచలన వ్యాఖ్యలు చేశారు.

-వరికొండ కాశీ విశే్వశ్వరరావు