సబ్ ఫీచర్

నాయకుల్లో సంయమనం అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మార్చి నెల చాలా విచిత్రంగా జరిగింది. ఫిబ్రవరి మాసం మధ్యలో, జెఎన్‌యు తరహాలోనే పశ్చిమ బెంగాల్ లోని జాదవ పూర్ యూనివర్సిటీ విద్యార్థులు దక్షిణ కలకత్తాలోని గన్‌పార్కు వరకు వూరేగింపు జరిపారు. కన్హయ్యకుమార్ అరెస్టుకు నిరసనగా వీరు ఈ చర్యకు దిగారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ నుంచి విముక్తి, మోదీ సర్కార్ నుంచి విముక్తి, ‘జబ్ కాశ్మీర్‌నే మాంగీ ఆజాదీ, మణిపూర్ భీ బోలే ఆజాదీ’ అంటూ నినాదాలు చేశారు. ఇవిచూసి ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భాగవత్, నేటి కొత్త తరానికి భారతమాతను స్తుతిస్తూ ‘్భరత్ మాతా కీ జై’ అని నినదించడం నేర్పించాలని అన్నారు. దీనికి అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ ‘గొంతుపై కత్తి పెట్టినా భారత్ మాతాకీ జై’ అనను అన్నాడు. ఇంతకూ ఆయన మహారాష్టల్రోని లాతూర్ జిల్లా, ఉద్గిర్ తాలూకాలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ అన్న మాటలివి. అలా అనాలని రాజ్యాంగంలో ఎక్కడైనా ఉన్నదా? అనికూడా ప్రశ్నించారు.
ఇక్కడ విచిత్రమేమంటే, రాజ్యాంగంలో ఎక్కడ ఏ నినాదం ఇవ్వాలో, ఏది ఇవ్వకూడదో ఉంటుందా? మన రాజకీయ నాయకులకు రాజ్యాంగం పట్ల ఉన్న అవగాహన ఇదా అని ఆశ్చర్యపోవడం తప్ప మనమేం చేయలేం. అయతే రాజ్యసభలో బాలివుడ్ రచయత ఒకరు మాట్లాడుతూ ‘‘ అది నాకర్తవ్యమా కాదా అన్నది పట్టించుకోను. అయతే అలా అనడాన్ని నా హక్కుగా భావిస్తా’’మన్నారు. ఇదిలావుండగా, మార్చి 29న మరో విశేషం కనిపించింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్-1లో ఒక అభిమాని ‘హిందుస్థాన్ జిందాబాద్’ అంటూ అన్న బ్యానర్‌పై అసదుద్దీన్ అక్బరు ద్దీన్‌ల ఫోటోలను ఉంచాడు. తర్వాతి పరిణామాల్లో మోహన్ భాగవత్ లక్నోలో మాట్లాడుతూ ‘్భరత మాతా కీ జై’ అనమంటూ ఎవరిపైనా ఒత్తిడి లేదని ప్రకటించారు. ఆ మరుసటి రోజు ఇంకా కొన్ని విశేషాలు ప్రతికల్లో ప్రచురితమయ్యాయ. ‘ ఈ దేశంలో మేం రక్తాన్ని ధరబోశాం. జాతీయత, దేశభక్తి విషయంలో మాకు ఎవరూ సర్టిఫికెట్లు ఇవ్వ లసని పని లేదన్నాడు. ఇప్పుడు మా దేశభక్తిని ప్రశ్నిస్తున్న వారు, తాము స్వాతంత్య్రం కోసం పోరాడుతున్నప్పుడు వీరు ఎక్కడున్నారు’ అంటూ అసదుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిటిషర్లు తమని ఉరికొయ్యలకు వ్రేలాదీయడం, జైళ్లలో కుక్కడం ఎన్నడూ మరచిపోలే మన్నారు. మాతృదేశానికి కట్టుబడి ఉండే భారతీయుడిగానే ఉంటానన్నారు. లక్నోలో జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడుతూ, తమ పార్టీ కేవలం ముస్లింలకు మాత్రమే పరిమితమైంది కాదన్నారు. ఇది భారతీయులకు చెందిందన్నారు.
ఇక మొన్నీమధ్యన గొంతుపై కత్తి పెట్టినా భారత్‌మాతా కీ జై అని నినదించనని ఒవైసీ, ఢిల్లీలో ఉమ్మడి భవన్‌కు వచ్చిన సందర్భంగా, బ్యానర్ల సంగతిని విలేకర్లు ఆయన్ను తన దృష్టి తీసుకొని రాగా, ‘బాగున్నాయ కదా’ అని చమత్కరించడం విశేషం. ఇంకా ముందు, ముందు ఈ వివాద రాజకీయాలు ఏ రూపాన్ని పొందుతాయో చెప్పలేం. కాగా దారుల్ ఉరూల్ దియోబంద్ ఒక ఫత్వాను జారీ చేసింది. దాని సారాంశమేంటే ‘‘ముస్లింలు భరతమాతను ప్రేమిస్తారు. కానీ వారు మదరే హితన్‌ను ఆరాధించరు.’’
ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏమంటే ఏదో ఒక అనవసర వివాదాన్ని రేపి ప్రాచుర్యంలో ఉండటమే రాజకీయ నేతల లక్ష్యంగా కనిపిస్తున్నది. ఈ ప్రక్రియలో తాము చేస్తున్న వ్యాఖ్యలు ఎంతటి ప్రమాదకరంగా ఉంటు న్నాయన్నది వారు పట్టించుకోకపోవడం విషాదం. విభిన్న మతాలు, సంస్కృతుల సమారోహమైన భారత సమాజంలో ఆనాలోచిత వ్యాఖ్యలు అనుకోని ప్రమాదాలు తెచ్చిపెడతాయ. నాయకులు సంయమనం పాటించాలి.

- చాణక్య