సబ్ ఫీచర్

నిదురించు హాయగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషిలో జబ్బులు పెరగటానికి ప్రధాన కారణం వ్యాధినిరోధక శక్త లేకపోవటం. వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే ఆహారంతో పాటు నిద్ర కూడా అవసరం. ప్రస్తుత జీవన పరిస్థితులు మనిషికి నిద్రను దూరం చేస్తోంది. హాయిగా నిద్రించటానికి మానసిక ప్రశాంతతో పాటు మనం తినే ఆహారంలో కొద్దిపాటి మార్పులు చేసుకుంటే కమ్మటి నిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అవేమిటో చూద్దాం.

మంచి నిద్రకు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు
ఓట్స్
ఓట్స్‌లో ఉండే కాల్షియం, మెగ్నీషియం, ప్రాస్పరస్, సిలికాన్, పొటాషియం మంచి నిద్ర రావటానికి దోహదం చేస్తాయి. ఓట్స్‌కు పంచదార ఎక్కువ కలపకుండా తినాలి.
చెర్రీ జ్యూస్
చెర్రీ పండ్లు తినటం వల్ల మెలటోనిన్ అనే హార్మోన్ సక్రమంగా పనిచేయటానికి దోహదం చేస్తోంది. ఈ హార్మోన్ నిద్రపై ప్రభావం చూపుతుంది. కాస్తంత వయసు మళ్లినవారు నిద్రలేమితో బాధపడుతుంటారు. వీరు ప్రతిరోజూ రెండుసార్లు చెర్రీ జ్యూస్ తాగితే ఈ జబ్బు నుంచి బయటపడటమే కాదు. ప్రశాంతంగా నిద్రపోతారు.
అరటిపండ్లు
అరటిపండ్లలో ఉండే మెగ్నీషియం, పోటాషియం కండరాలు రిలాక్స్‌గా ఉండేలా పనిచేస్తాయి. దీంతోపాటు ట్రిప్ట్ఫొన్ అనేది కూడా ఈ అరటిపండులో ఉంటుంది. దీంతో చక్కగా నిద్రపడుతుంది.
గ్రీన్ టీ
కెఫిన్ లేకుండా గ్రీన్ టీ తీసుకుంటే కమ్మటి నిద్ర పడుతుందట.

వీటిని తినవద్దు..
రాత్రి వేళల్లో మనం తినే ఆహారంలో స్పైసీ ఫుడ్ లేకుండా చూసుకోండి. ఘాటైన పదార్థాలు తినటం వల్ల రాత్రంతా కమ్మగా నిద్రపోవచ్చనే భ్రమలో ఉంటాం. అందుకే యువకులు రాత్రిపూట బిర్యానీ వంటివాటిని ఎక్కువగా లాగించేస్తుటారు. ఆస్ట్రేలియాలో జరిపిన అధ్యయనాల్లో గాఢ నిద్ర పట్టక బాధపడుతున్నట్లు వెల్లడైంది. కారం, ఘాటైన మసాలాలు లేని పదార్థాలు తిననివారు కమ్మగా నిద్రపోయినట్లు గుర్తించారు.
కొవ్వు పదార్థాలు
బర్గర్ తింటే కడుపు నిండిపోతుంది. దీంతో హాయిగా నిద్రపోవచ్చనుకుంటారు. తిని బెడ్ ఎక్కగానే మగత ప్రారంభమవుతుందే తప్ప కమ్మటి నిద్ర కరువవుతుంది. కొవ్వు అధికంగా ఉండే భోజనం రాత్రివేళ తీసుకుంటే యాసిడ్ ఫామ్ అవ్వటం మినహాయించి నిద్ర మాత్రం పట్టదని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
ఆల్కాహాల్
రాత్రిపూట ఒక గ్లాసు లేదా రెండు ఔన్సుల వైన్ తీసుకుంటే కమ్మటి నిద్రపోవచ్చని అనుకుంటారు. కాని అది కూడా మగత నిద్రే.
భోజనం తరువాత అరగంట సేపు నడక లేదా వ్యాయామం చేస్తే మంచి నిద్రపడుతుంది. సాయంత్రం పూట వ్యాయామం చేస్తే మరీ మంచది. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యవంతంగా ఉండాలంటే నిద్ర తప్పనిసరి అని గుర్తించండి.