సబ్ ఫీచర్

ప్రసాదంగా మందు పోసే మందిరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజధాని ఢిల్లీ నగరం పాత కోట దగ్గర ‘ప్రగతి మైదాన్’కి సమీపంలో ప్రాచీన భైరాన్ బాబా మందిర్ అని ఒక పెద్ద ఆలయం వుంది. ఈ దేవుడికి సారా, బ్రాందీ, విస్కీ విదేశీ స్వదేశీ ఏది అయినా సరే, కేవలం మద్యమే నైవేద్యంగా పెట్టాలి, అదే మొక్కుబడిగా చెల్లించాలి. టెంకాయ కొడితే సగం ఇచ్చి - మిగతాది ఉంచేసుకున్నట్లు సగం వుంచేసుకుని (బాటిల్స్) పూజార్లు మిగతాది కొంత భక్తులకి ముష్టివాళ్లకి పోస్తారు. శని ఆదివారాల్లో చిన్న చిన్న పిల్లలతో సహా ముష్టివాళ్లు ఎక్కువగా స్ర్తిలు బెగ్గర్స్ వేషంలో మందుభారుూలు వందల సంఖ్యలో కాగితం గ్లాసులు, చిప్పలు చేత పట్టుకుని ఇంచుమించు క్రిక్కిరిసిపోయి గుడి పరిసరాలను ఆక్రమించుకుంటారు. ఈ భైరాన్ బాబా అసలు ఒక రాక్షసుడట. తపస్సు చేసినవాడే కాని దుష్టుడట. దుర్గామాత ఆ దుష్టున్ని చంపేసేముందు- పశ్చాత్తాపంతో కాళ్ళమద పడ్డ భైరవ్‌ని కనికరించి కొన్ని శక్తులు ముఖ్యంగా, మద్యం పెట్టే భక్తుల కోరికలు తీర్చే శక్తిని ఇచ్చిందిట. అక్కడ చిన్న పిల్లలు ఆడాళ్ళు ఎక్కువగా ప్రసాదం సేవించి రోడ్లమీద దొర్లుతూ ఉంటారుట- ఎటు చూసినా మర్నాడు ఉదయం గుడి వెలుపల సీసాలు, ముంతలే. గవర్నమెంటు ఎన్నో ఆంక్షలు పెట్టింది, బోర్డులు కూడా పెట్టారు కాని బెగ్గర్స్‌కి చదువురాదుట. బోర్డ్స్‌ని కేర్ చెయ్యరు. పోలీసులు వున్నారు. ప్రసాదం పంచవద్దని వాళ్లు మాత్రం అనగలరా? దేవుడే ఇచ్చాడు మందు బుడ్డీ ఒక్కటి తమ్ముడూ అంటూ పాడుతూ పడుతూ లేస్తూ నానా యాగీ చేస్తూ వుంటారు జనాలు. రామానంద్ అనే స్థానిక ఫిలిం నిర్మాత ఒకడు హోం మంత్రిత్వ శాఖకి ఫిర్యాదు చేశాడు. వాళ్ళు తాపీగా ‘విచారిస్తున్నారు’!

-వీరాజీ