సబ్ ఫీచర్

నంధుల సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈసారి నవ్యాంధ్రలో అంతా నందుల సందడి. వరుసగా మూడేళ్లకి సంబంధించిన ప్రభుత్వ సినీ అవార్డులన్నీ ఒకేసారి ప్రకటించేసరికి ఎటు చూసినా నందులే నందులు. నందులు పొందినవారికి అభినందనలు. పొందని కళాకారులకు ముందుముందు పొందాలని ఆల్ ది బెస్టులు. బహుమతి గ్రహీతలు కొందరిని పలకరిస్తే ఆ సరదా కబుర్లు ఇలా ఉండొచ్చు.
ముందుగా బాలయ్యని అడిగితే..
‘‘బాలయ్యా, ఈసారి నందుల్ని మందలు మందలుగా మీ చిత్రం పొందినందుకు ఆనందం మాకు. అయితే వాటిపై కొందరు నిందలు వేస్తున్నారు. దానిపై మీ అభిప్రాయం?’’
‘‘ఎవరది, బ్లడీ ఫూల్స్. నందులు పెంచాలన్నా మేమే. నందులు పంచాలన్నా మేమే. నో కామెంట్స్’’
రజనీగారిని పలకరిస్తే ఆయన జవాబు..
‘‘నాన్నా, నందులే గుంపులుగా వస్తాయి. ఆస్కార్... అప్పుడే రాదు.’’
పాలబుగ్గల మహేష్‌బాబు ఏమంటాడో...
‘‘నేనీ పరిశ్రమను దత్తత తీసుకున్నాను...
నిన్ను.. నిన్ను.. నందిని.. ఫిలింఫేర్‌ని...’’
బాహుబలి యూనిట్‌లోకి తొంగి చూస్తే..
వాళ్లింకా ఆ సినిమా ప్రభావం నుండి తేరుకున్నట్లు లేరు.
మాటలు మాత్రం వినపడుతున్నాయి ఇలా...
శివగామి అంటోంది...
‘‘కట్టప్పా, భల్లాల దేవుడు ఆడుకోవడానికి అడవి దున్నలు సరిపోవడం లేదు. వేరే ఏమైనా తీసుకురా!
ఇది నా ఆజ్ఞ. నా మాటే నా శాసనం’’
కట్టప్ప ఇలా అన్నాడు...
‘‘అంతంత పెద్దమాటలు ఎందుకులే తల్లీ.
మంచి మేలైన ఒంగోలు జాతి నందులు ఓ పదమూడు తెస్తా.. చిత్తగించండి...
శుభం.

-డా. డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం