సబ్ ఫీచర్

టీచర్లే భయాన్ని పోగొట్టారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె మాటల్లో నిండైన ఆత్మవిశ్వాసం.. చూపుల్లో స్నేహ స్వభావం.. హృదయాలను కట్టిపడేసే మాటలు.. ఇవన్నీ మానుషీ చిల్లార్ సొంతం. మన దేశానికి ప్రపంచ సుందరి కిరీటం తెచ్చిపెట్టిన ఈ హరియాణా యువతి ఈ రోజు నిర్భయంగా తన మనోభావాలను పదుగురి ఎదుట చెప్పగలుగుతుందంటే అది పాఠశాలలో పడిన బీజాలే అని చెబుతుంది. ‘‘నేను చదివిన పాఠశాల నాకెంతో నేర్పింది. వివిధ రకాల పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించింది. ముఖ్యంగా టీచర్లు నాలో ఉండే స్టేజీ ఫియర్‌ను పోగొట్టి ననే్నంతో ప్రోత్సహించారు’’ అని చెబుతోంది. అందుకే ఏ స్టేజీ మీద అయిన నా మనసులోని మాటలను అందరూ ఆకట్టుకునేలా చెప్పగలుగుతున్నాను అని మానుషి అంటోంది. లింగ వివక్షతకు మారుపేరుగా నిలిచే హరియాణాకు చెందిన ఈ వైద్య విద్యార్థినికి పదిహేడేళ్ల తరువాత ప్రపంచ కిరీటం దక్కటం వెనుక ఆమె కృషి ఎంతో దాగివుంది. ఆహార నియమాలతో పాటు కూచిపూడి డ్యాన్స్ నేర్చుకోవటం, జిమ్‌కు వెళ్లటం, క్రమం తప్పకుండా యోగా చేయటం ఆమె దినచర్యలలో భాగం. మానుషి ప్రముఖ న్యూట్రీషియన్ అగర్వాల్ సలహాలు, సూచనలు పాటిస్తోంది.
నిక్కచ్చిగా ఆహార నియమాలు..
ఫిట్‌పాస్ ఫౌండర్ ఆరుషీ వర్మ, ప్రముఖ న్యూట్రీషియన్ అగర్వాల్ సలహాలు, సూచనలు పాటిస్తోంది.
అల్పాహారం మానివేయవద్దు అని చెబుతుంది. అల్పాహారం తీసుకోకపోవటం వల్ల ఆకలి బాధ తెలుస్తుంది.
ప్రతిరోజూ భోజనం చేయండి. ఏ రోజూ కూడా మానవద్దు. అయితే చిన్న ప్టేట్‌లో భోజనం చేయండి. చిన్న ప్లేట్‌లో తినటం వల్ల ఫ్యాట్. సుగర్ పదార్థాలను ఎక్కువగా తీసుకోకుండా జాగ్రత్త పడగలం అని సందేశం ఇస్తోంది.
ఆహారంలో సుగర్ కంటెంట్ లేకుండా చూసుకుంటుంది. పరగడపున మూడు గ్లాసుల గోరువెచ్చటి నీళ్లు తాగుతుంది.
బ్రేక్‌ఫాస్ట్‌లో పెరుగుతో ఓట్స్, తాజాపండ్లు, మొలకెత్తిన విత్తనాలు, మూడు కోడిగుడ్ల తెల్లసొనను అవకాడోతో తీసుకుంటుంది. క్యారెట్, బీట్‌రూట్, స్వీట్ పొటాటో బ్రేక్‌ఫాస్ట్‌లో ఉండేలా చూసుకుంటుంది.
మధ్యాహ్నాం కొబ్బరి నీళ్లు, పళ్లు.
లంచ్‌లో రైస్ లేదా చపాతీ, చికెన్ , ఒక బౌల్ కాయగూర ముక్కలు తీసుకుంటుంది.
సాయంత్రం ఉప్పు లేకుండా నట్స్, అరటి పండు లేదా ఏదైనా పండు తింటుంది.
రాత్రి వేళలో డిన్నర్‌లో కాల్చిన చికెన్ లేదా చేప, కాయగూరలు తీసుకుంటుంది.