సబ్ ఫీచర్

అన్ని శాస్త్రాల సారమొక్కటే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకోదేవో దేవకీ పుత్రయేవ
ఏకో మంత్రస్తస్య నామాని యాని,కర్మాప్యేకం తస్సదేవస్యసేవ॥
దేవకీదేవీ పుత్రుని నోటినుంచి వెలువడిన గీత ఒక్కటే శాస్త్రం.తానే భగవంతుడని నుడివిన శ్రీకృష్ణపరమాత్మనే ఈశ్వరుడు. వాసుదేవ మంత్రమే మహామంత్రం.శ్రీకృష్ణుని సేవించుటయే ఉత్తమమైన కర్మ.- గీతలోమొదటి ఆరు అధ్యాయములు కర్మయోగమునకు సంబంధించినవి, రెండవ ఆరు అధ్యాయములు జ్ఞానయోగానికి సంబంధించినవి మిగిలిన ఆరు అధ్యాయములు భక్తియోగానికి చెందినవి. ఇలా గీతలోనే నిత్యము సత్యమూ అయిన భగవంతుని పొందుటకు మార్గాలు సూచించి ఉన్నాయి. వాటిని అనుసరిస్తే వాటిని తెలుసుకొంటే వాటిని క్షుణ్ణంగా అభ్యసిస్తే ఇహలోక కడలి ఈది పరలోకాన్ని సునాయాసంగా చేరుకోవచ్చు.
శ్రీరామ, శ్రీకృష్ణ అవతారాలురెండూ మహావిష్ణువే సృజియించుకున్నప్పటికీ శ్రీరామవతారమందు భగవచ్ఛక్తి గర్భితమై ఉంది,శ్రీకృష్ణ అవతారమందు పువ్వుపుట్టగానే పరిమళించినట్లుగా శ్రీకృష్ణుడు పుట్టీపుట్టగానే శంఖచక్రగదాహస్తుండై దేవకీవసుదేవులు చేయాల్సిన పనులను నిర్ధేశించడం ద్వారా దైవత్వాన్ని బహిర్గతం చేశాడు. ఇక అప్పటినుంచి పరమాత్మ కృష్ణుడు చేసిన పనులన్నింటిలోను పరమార్థసహితంగా అంతరార్థయుక్తంగానే నడిచాయి.
ఆకాశమునుండి వివిధ ప్రదేశాలలో పడిన వర్షపు నీరు కాలువలు, నదులు ద్వారా సముద్రమును చేరినట్లుగానే సర్వదేవతలకు చేయు నమస్కారాలన్నీ దేవాదిదేవుడైన శ్రీకృష్ణ పరమాత్మకే చెందుతాయి. సర్వ పాపములను పోగొట్టి దుఃఖ ఉపశమనమును కలిగంచునది పరాత్పరుడై న శ్రీహరి నామసంకీర్తనయే.
మార్గశుద్ధ ఏకాదశి తిథిన భగవద్గీతను పఠించడమన్న నియమానుసారంగా పఠించినా ఆ గీతను తమ తమ జీవితాలను సదా అన్వయించుకున్న యెడల సర్వసౌభాగ్యాలకునిలయాలుగా మారుతారు అన్నది నిత్యసత్యమై వర్థిల్లుతున్నది.

- రామానుజ దాస స్వామి