సబ్ ఫీచర్

చలికాలం నులివెచ్చగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చలికాలం వచ్చేసింది. రాత్రి ఉష్ణోగ్రతలు సైతం పడిపోయాయి. కాలంతో పాటు బట్టల ఎంపికలోనూ వైవిధ్యం కనిపించాలి. శీతాకాలంలో ఎలాంటి దుస్తులు, ఏ కలర్‌లో వేసుకుంటే బాగుంటుందోఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. వెచ్చదనం కోసం స్వెట్టర్లు, జాకెట్స్ కోసం వెతుకులాట కూడా ఆరంభమైంది. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా మన దుస్తులు ఆహార్యానికి తగ్గట్టు ఎంపిక చేసుకోవాలి. బాలీవుడ్ నటులు అమితాబ్, రాణీ ముఖర్జీ, అలియాభట్, షారుక్‌ఖాన్, రణబీర్ కపూర్ వంటివారు చలి ప్రాంతాల్లో షూటింగ్స్‌కు వెళితే వీరు జాకెట్స్‌నే ఎంపిక చేసుకుంటారు. ఫ్యాషన్ డిజైనర్లు సైతం వీటినే సూచిస్తున్నారు. మార్కెట్లో సిల్హాట్ జాకెట్ విరివిరిగా లభిస్తూ సరికొత్త ట్రెండ్‌గా నిలిచిందని ఇరవై మూడేళ్ల యువ ఫ్యాషన్ డిజైనర్ కుష్బూ కౌర్ చెబుతున్నారు. ఈ జాకెట్స్ ఎల్లప్పుడు ఫ్యాషన్‌గా యువతకు నప్పుతున్నాయని అంటున్నారు. చాలామంది వీటినే ఇష్టపడుతున్నారు. చలికాలంలో ఈ రకమైన జాకెట్స్‌కు ఆదరణ కూడా బాగానే ఉంది. హాలీవుడ్ వర్థమాన నటుడు అలేసియా కారా అమెరికన్ మ్యూజిక్ అవార్డ్ ఫంక్షన్‌కు సిల్హాట్ జాకెట్‌ను ధరించ వచ్చారు. ఆ వేడుకలో ఆయన సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ఈ జాకెట్ అన్ని వేళల్లోనూ, అన్ని ఫంక్షన్లలోనూ అందరికీ ఇష్టమైన శైలిగా మారిపోయింది. వీటిని ధరించి ఆఫీసు, షాపింగ్ ఇలా ఎక్కడికైనా యువతీ యువకుల నుంచి పెద్ద వయసువారు వరకు వెళ్లేందుకు వీలుగా ఉంటుంది. ఫ్యాంట్ మీద జాకెట్స్‌తో పాటు హైహిల్స్ చెప్పులు వేసుకున్నా అందంగా కనిపిస్తారు. రకరకాల డిజైన్లలో, రంగుల్లో ఫ్యాషన్ టచ్‌తో మార్కెట్లో సందడి చేస్తున్న జాకెట్స్ ఇవి కొన్ని.