సబ్ ఫీచర్

పరగడుపునే ఇవి తింటే ముప్పే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాత్రి పదిగంటలకు ఇంటిల్లిపాదీ కలసి కూర్చొని భోజనం చేస్తారు. ఆ ఆనందమే వేరు. తరువాత నిద్రకు ఉపక్రమిస్తారు. ఉదయం నిద్ర లేచింది మొదలు ఉరుకులు పరుగుల జీవనమే. పిల్లల్ని బడికి సిద్ధం చేసి, భర్తను ఆఫీసుకు పంపిన తరువాత టైమ్ చూసుకుంటే అపుడు గుర్తుకు వస్తుంది ఆకలి. దాదాపు పది గంటలు పొట్ట ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో ఆమ్లాలు విడుదలవుతూనే ఉంటాయి. ఇవి ఆసిడిటీ, ఇతర జీర్ణ సమస్యలకు దారితీస్తాయి. ఖాళీ కడుపుతో ఉన్నవారు అల్పాహారం కింద ఏదిపడితే అది నోట్లో కుక్కేసుకుని వెళితే జీర్ణాశయం పూర్తిగా నాశనం అవుతుంది. చాలా మంది అమ్మాయిలు, ఉద్యోగినులు ఉదయమే ఏమీ తినకుండానే కాలేజీలకు, ఆఫీసులకు వెళ్లిపోతుంటారు. కాని నిద్రలేచిన తరువాత రెండు గంటల తరువాత అల్పాహారం తీసుకుంటే జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. ఈ అల్పాహారంలో కొన్ని ఆహార పదార్థాల జోలికి అసలు వెళ్లవద్దని ఆహార నిపుణులు చెబుతున్నారు. అవేమిటో తెలుసుకుందాం..

కారంగా ఉండే పదార్థాలు
పచ్చిమిరపకాయలు, మసాలాలతో చేసిన పదార్థాలు అసలు తీసుకోవద్దు. దీనివల్ల ఆసిడిటీ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇవి అజీర్తిని కలిగిస్తాయి.
పంచదార కలిపిన రసాలు
పంచదార కలిపిన పండ్ల రసాలు ఉదయమే ఒక గ్లాసు తీసుకుంటే మంచిది అనుకుంటారు. కాని ఇందులోని షుగర్ క్లోమం మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. అలాగే పంచదార కాలేయంలో అధిక ఒత్తిడిని కలిగిస్తోంది. కాబట్టి అల్పాహారంలోనూ మితిమీరిన పంచదారను తీసుకోవద్దు.
కూల్ డ్రింక్‌లు అసలే వద్దు
ఉదయమే దాహం వేస్తుందని కూల్ డ్రింక్స్ అసలు తీసుకోవద్దు. వికారం కలుగుతుంది. గ్యాస్ సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతాయి. యాసిడ్స్ విడుదల చేసి కడుపు నొప్పికి దారితీస్తుంది. జీర్ణవ్యవస్థ అస్తవ్యస్తంగా తయారవుతోంది.
చల్లని పానియాలు
చల్లని పానియాలు అంటే కూల్‌డ్రింక్స్‌గా భావించవద్దు. ఎందుకంటే చాలామంది పరగడపునే మంచినీరు తాగుతారు. ఈ నీరు చల్లగా ఉండకూడదు. గోరువెచ్చగా ఉంటే బాగుంటుంది. చాలామంది తమ దినచర్యను గోరువెచ్చటి నీటిలో తేనె కలుపుకుని తాగటంతో ఆరంభిస్తారు. ఇది మంచిదే అయినప్పటికీ చల్లటి నీటి వల్ల జీర్ణప్రక్రియ దెబ్బతింటుంది.
పుల్లటి పండ్లు
పరగడుపునే పుల్లటి పండ్లు తిన్నా ముప్పే. దీనివల్ల యాసిడ్స్ ఉత్పన్నమవుతాయి. ఫైబర్ ఉండటం వల్ల జీర్ణం అవుతుందని అనుకుంటాం. కాని పరగడపునే పుల్లటి పండ్లు తినటం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. ముఖ్యంగా జామపండు, ఆరంజ్ వంటివాటిని తినకపోవటమే మంచిది.
ముడి కూరగాయలు
మంచిది కాదు
ముడి కూరగాయలు కూడా మంచిది కాదు అని ఆహార నిపుణులు చెబుతున్నారు. కూరగాయ ముక్కలతో సలాడ్ వంటివి తయారుచేసుకుని తీసుకున్నా మంచిది కాదు. ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతాయి. ఇందులో ఉండే ఫైబర్ అధిక భారంగా అనిపించి కడుపు నొప్పి రావచ్చు.
కాఫీ
ఒక కప్పు కాఫీతో ఆ రోజు దినచర్యను ప్రారంభించటం సర్వసాధారణం. ఇలాంటి తేనీరు సేవించటం వల్ల నిద్ర మత్తు వదులుతుంది. కాని ఖాళీ కడుపుతో కాఫీ సేవించటం వల్ల పొట్టలో ఆసిడిటీ ఉత్పన్నం అవుతుంది. అంతేకాదు హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి అయి గ్యాస్ట్రిక్ సమస్యకు కారణమవుతుంది.
ఆహారం విషయంలో జాగ్రత్తలు..
చలికాలంలో శరీరంలో ఎక్కువ తేమ ఉండదు. చర్మం పొడిబారి పోతుంది. కాబట్టి ఈ కాలంలో మంచినీరు నాలుగు లీటర్లు తీసుకుంటే మంచిది. వేరుశనగ నూనె వంటల్లో వాడటం వల్ల కూడా పొడిబారిన చర్మానికి మంచి ఉపయోగకరంగా ఉంటుంది. విటమిన్లు అధికంగా ఉండే ఖర్జూరం, ద్రాక్ష తీసుకుంటే మంచిది. ఎలర్జీ సమస్యలు అధికంగా ఉండేవారు నిమ్మరసం జోలికి పోవద్దు. దీనివల్ల జలుబు చేస్తుందనేది అపోహ మాత్రమే. దీనికి బదులుగా టమాటా సూప్ తీసుకోవచ్చు. బత్తాయ, ఉసిరి తీసుకోవటం ద్వారా విటమిన్ సి అందుతుంది.