సబ్ ఫీచర్

మన మేధావులకు ఈ దమ్ముందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుదీర్ఘకాలం వాదోపవాదాలు జరిగిన తరువాత ఎట్టకేలకు ముస్లిం మహిళలు బురఖా ధరించడాన్ని నిషేధించే విషయమై డెన్మార్క్ పార్లమెంట్‌లో అన్ని పార్టీలు ఒక్క త్రాటిపైకి వచ్చాయి. అయితే ఈ నిషేధం మహిళలకు పరదా మాటున ఉంచేయడాన్ని వ్యతిరేకించడానికే గాని సంప్రదాయ వస్తధ్రారణను వ్యతిరేకించడం కాదని డెన్మార్క్ లిబరల్ పార్టీ అధికార ప్రతినిధి జాకోబ్ ఎల్లేమాన్ జెనే్సన్ అంటారు. డెన్మార్క్ సంకీర్ణ ప్రభుత్వంలో లిబరల్ పార్టీ అతి పెద్ద భాగస్వామి పార్టీ.

ముస్లిం స్ర్తిల బురఖాధారణను నిషేధించిన డెన్మార్క్ నుండి మనం నేర్చుకోవలసింది చాలా ఉంది. వ్యక్తి స్వేచ్ఛ, వివేకము అనేవి మతపరమైన మూఢ విశ్వాసాల కంటే ఎంతో ఉన్నతమైనవి. వ్యక్తి స్వేచ్ఛను దేనికోసమూ పణంగా పెట్టరాదు. భారతీయ స్వేచ్ఛావాదులు తెలిసికోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎప్పుడూ ఒక వర్గాన్నీ లక్ష్యంగా చేసుకుని వారినే విమర్శిస్తూ ఇతరులని వెనకేసుకురావడం, వాస్తవాలను విస్మరించి ఊహాలోకాలలో విహరించడం స్వేచ్ఛావాదం ఎన్నటికీ కానేరదు. స్వేచ్ఛావాదులు సమాజంలో రావలసిన మార్పులకు ప్రతినిధులుగా ఉండాలే గాని మతవ్ఢ్యలను కొమ్ముకాసేవారిగా ఉండిపోరాదు. ఈ విషయంలో ప్రపంచంలోని ఇతర దేశాల ముందు డెన్మార్క్ ఒక ఆచరణాత్మక ఆదర్శాన్ని ఉంచింది.

ఐరోపా దేశాలలో ముస్లిం మహిళలు బురఖా ధరించడాన్ని నిషేధించిన మొదటి దేశం ప్రాన్స్. ఇది 2011లో బురఖా ధరించడాన్ని నిషేధించింది. ఆ తరువాత ఆస్ట్రియా, బెల్జియంలు కూడా బురఖాను నిషేధించాయి. స్విట్జర్లాండ్ త్వరలో బురఖాను నిషేధించబోతోంది.
బురఖా నిషేధాన్ని వ్యతిరేకిస్తున్నవారు మాత్రం డెన్మార్క్ పార్లమెంట్ నిర్ణయాన్ని ముస్లిం సంస్కృతినే లక్ష్యంగా పెట్టుకుని ఒక క్రమపద్ధతిలో జరుపుతున్న దాడిలో భాగంగా పేర్కొంటున్నారు. యూదులు సంప్రదాయకంగా ధరిస్తున్న టోపీని (కిప్పా) లేదా తలపాగాను ఎందుకు నిషేధించలేదని వీరు అంటున్నారు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న సభ్య సమాజం ముందున్నది. అదేమిటంటే, ఒక్క అంగుళం శరీరం కూడా కనిపించకుండా స్ర్తిలచే బురఖా ధరింపజేయడం ఏ విధంగా సాంస్కృతిక వస్తధ్రారణ అవుతుంది అని. ఇది ఎలా ఉందంటే ఆడవాళ్ళు ఏ వస్త్రాలు ధరించాలో మగవాళ్ళే నిర్ణయించడమన్నమాట.
ప్రతి వ్యక్తికీ భావోద్వేగాలు ఉంటాయి. వాటిని వ్యక్తం చేసే స్వాతంత్య్రం కూడా ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఇందులో లింగ వివక్షతకు తావులేదు. కానీ ‘బురఖా’ వల్ల ముస్లిం మహిళలు బాహ్య సమాజంలో తమ భోవోద్వేగాలు వ్యక్తం చేసే అవకాశాన్ని కోల్పోతారు. ఇది నిజంగా అమానుషం, అనాగరికం అయినది. ప్రపంచంలో ఒక్క ఇస్లాంలోనే ఈ వికృతి కొనసాగుతోంది.
‘‘మరి క్రైస్తవ సన్యాసినులు కూడా పైనించి క్రిందిదాకా బురఖా లాంటి వస్తధ్రారణ చేస్తారు కదా?’’ అని కొందరు అడుగుతుంటారు. కానీ వారొక విషయాన్ని గమనించాలి. క్రైస్తవ మతంలో సన్యాసినులు అవుదామని నిర్ణయించుకున్న స్ర్తిలకు మాత్రమే బురఖా వంటి వస్తధ్రారణ ఉంటుంది. మిగిలిన క్రైస్తవ స్ర్తిలు ఆ వస్తధ్రారణ చేయరు. కానీ ఇస్లాంలో స్ర్తిగా పుడితే చాలు, బురఖా తప్పనిసరి. ఇక్కడ ఎవరి ఇష్టాయిష్టాలతో పనిలేదు.
ఈ బురఖా వ్యవహారాన్ని డెన్మార్క్ రాజకీయ కోణంలోంచి కనుక చూసినట్లయితే మనకు ఒక విషయం అవగతవౌతుంది. డానిష్ పార్లమెంట్‌లోని అన్ని పార్టీలూ ముస్లిం మహిళలు బురఖా ధరించడాన్ని వ్యతిరేకించాయి. మూడు పార్టీల మైనారిటీ సంకీర్ణ ప్రభుత్వం దాని భాగస్వామ్య పక్షమైన డానిష్ పీపుల్స్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షమైన సోషల్ డెమోక్రాట్స్ వీరంతా బురఖా నిషేధంపై ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే డెన్మార్క్‌లోని వివిధ శాసనసభలలో మాత్రం ఈ నిషేధంపై చర్చలు జరుగుతున్నాయి.
‘‘బురఖా అనేది మహిళల స్వాతంత్య్రం అణచివేతకు నిదర్శనం. ప్రాచీన మత గ్రంథాలకు కొందరు స్వార్థపరులు చేసిన అమానుష వ్యాఖ్యానాలని గుడ్డిగా ఆమోదించడమే ఇలాంటి అణచివేత ధోరణులకు కారణవౌతాయి. మహిళల స్వాతంత్య్రాన్ని హరించే ఇలాంటి ధోరణులపై ప్రతి ఒక్కరూ పోరాడాలి’’ అని ఆండ్రూస్ శామ్యూల్‌సెన్ అంటారు. ఈయన డెన్మార్క్ విదేశీ వ్యవహారాల మంత్రి.
స్వేచ్ఛా విఫణి, లైంగిక సమానత్వం వంటి వాటిని సమర్థించే డెన్మార్క్ లిబరల్ పార్టీకూడా ముస్లిం మహిళా బురఖాధారణని వ్యతిరేకిస్తోంది.
మరి మన భారతదేశంలో స్వేచ్ఛావాదులు, సెక్యులరిస్టులుగా చెలామణీ అయ్యే మేధావులు ఉన్నారు. వాళ్ళెప్పుడూ ఇస్లాంలోని కాలం చెల్లిన ఛాందస ధోరణుల జోలికి వెళ్ళే సాహసం చెయ్యరు. అలా చేస్తే పవిత్రమైన వారి ‘సెక్యులర్ మడి’ మంటకలిసిపోతుంది కదా!
భారతదేశంలోనే కాదు దక్షిణాసియా దేశాలలో కూడా సెక్యులర్ పండితులు ఇస్లాంలోని కాలం చెల్లిన ధోరణుల గురించి ప్రస్తావించరు. వాటి గురించిన చర్చలలో పాల్గొనడానికి కూడా సుముఖత చూపారు. ఒకవేళ ఎవరైనా ఇస్లాం మతంలోని ఛాందస ధోరణులను ప్రశ్నిస్తే మాత్రం ఈ సెక్యులర్ పెద్దలు అంతెత్తున విరుచుకపడతారు. పైగా ఈ సెక్యులర్ మేధావులు రాజకీయాలను శాసించే స్థితిలో ఉన్నారు కూడా.
ప్రతిదానినీ మతపరమైన దృష్టితో చూడడం, ఆ మేరకు నిర్ణయాలు చేయడం కాకుండా ఆధునిక దృక్పథంతో, వివేకంతో మసలుకోవాలన్నది ప్రపంచానికి డెన్మార్క్ చెప్పిన పాఠం.

-దుగ్గిరాల రాజకిశోర్ సెల్: 80082 64690