సబ్ ఫీచర్

అశాంతి దూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతంలో నోబెల్ కమిటీ అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామాకు ప్రపంచ శాంతి బహుమతి ఇచ్చింది. అంతర్జాతీయ అశాంతి బహుమతిలాంటిదేదైనా ఉంటే అది ఖచ్చితంగా నేటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి వచ్చి తీరుతుంది. ప్రపంచవ్యాప్తంగా వివాదాలు పెరగడానికి ఆయన తనవంతుగా కృషి చేస్తున్నారు. తాజాగా జెరూసలెం నగరాన్ని ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం ఆ కోవలోనిదే. ఆ మేరకు ఆయన తన ఎన్నికల హామీని నెరవేర్చడమే కావొచ్చు. కానీ విస్తృత పరిధిలో ఈ నిర్ణయం దుస్సాహసం. మూడు ప్రముఖ మతాలకు పుణ్యక్షేత్రమైన జెరూసలేం అతి పురాతన పట్టణం. సంపూర్ణంగా దానిపై ఎవరి పెత్తనం లేదు. కొంత భాగం ఇజ్రాయెల్, మరికొంత భాగం పాలస్తీనా అధీనంలో ఉంది. ఆ పట్టణాన్ని ఇజ్రాయెల్ తమదిగా ప్రకటించుకుంటున్నా ఐక్యరాజ్య సమితి గానీ, ప్రపంచదేశాలు గానీ ఆచితూచి అడుగులేస్తున్నాయి. శాంతియుత ఒప్పందాలపై ప్రయత్నిస్తున్నాయి. అమెరికాలో బలమైన లాబీగా ఉన్న యూదుల కాంక్షల మేరకు ఆపట్టణాన్ని యూదుల రాజధానిగా గుర్తించడానికి అమెరికా సూత్రబద్ధంగా అంగీకరిస్తూ చట్టం చేసినా, ఆ మేరకు ముందుకు వెళ్లడానికి దశాబ్దాలుగా అమెరికా వెనుకడుగు వేస్తూనే ఉంది. సున్నితమైన జాతుల సమస్యని మరింత ఎగదోయకుండా ఇంతవరకూ పూర్వ అధ్యక్షులు వౌనం పాటించారు. నేటి అధ్యక్షుడు తన ఎన్నికల హామీ మేరకు ఆ ప్రాంతానికి శాంతిసాధన కమిటీని నియమించాడు. ఆ కమిటీకి నాయకత్వం తన స్వంత అల్లుడు. ఆయనది యూదు మతం. ఆ కమిటీలో అధికశాతం యూదు మతస్థులే. ఇంకా ఆ శాంతి సాధన కమిటీ సాధించిన ముందడుగు ఏమిటో తెలియకముందే అధ్యక్షుడు చక్కగా జెరూసలెం ఇజ్రాయెల్ రాజధాని కావున తమ కార్యాలయాలు అక్కడే తెరుస్తామంటూ ప్రకటించేశారు. పాలస్తీనా, అరబ్బు దేశాల న్యాయమైన ఆందోళనల్ని పెడచెవిన పెడుతున్నారు. ఇది ప్రపంచశాంతికి స్ఫూర్తికి పూర్తివ్యతిరేకత నిర్ణయం. దుందుడుకువాదం. ‘ప్రపంచం ఏమైపోయినా ఫర్వాలేదు, నా కోడీ, కుంపటీ చల్లగా ఉంటే చాలు’ తరహా అమెరికా వాదానికి ఇది మంచి ఉదాహరణ.

-డా.డి.వి.జి.శంకరరావు