సబ్ ఫీచర్

కోరిక లేకపోతే కోపమే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోపాన్ని జయంచడం చెప్పినంత తేలిక కాదు. కాని, కోరిక లేకపోతే కోపం రాదు. గౌతమబుద్ధుడు కోరికలే దుఃఖానికి హేతువులు అన్నాడు. కోపం రావడం మనిషికి సహజం. కాని వచ్చిన కోపాన్ని అదుపులో పెట్టుకోవడమే మనిషిచేయాల్సిన ధర్మం. ఈ ధర్మం ఆచరించడం కష్టమైనా పురాణ కథలు వింటూ ఉంటే కోపాన్ని అదుపులో పెట్టుకోవచ్చు. వచ్చిన కోపాన్ని నిగ్రహించుకున్న వారే ఉత్తములుగా పేర్గాంచుతారు. రామాయణం లో రాముడు శాంత స్వభావుడు. కాని లక్ష్మణుడు మాత్రం కోపస్వభావి. కాని రాముడు ఎప్పటికప్పుడు లక్ష్మన్న కోపాన్ని తగ్గించేవాడు. భరతుడు రాముడిని వనవాసం నుంచి తిరిగి అయోధ్యాపట్నానికి తీసుకొని రావాలని అనుకొన్నాడు. మంత్రి పురోహితులతో మాట్లాడాడు. పురజనులు, మంత్రులు, సామంతులు, పురోహితులు, బ్రాహ్మణులు, కౌసల్యసుమిత్రాకైకేయ వీరు ముగ్గురు అమ్మలు ఇలా అయోధ్య అంతా తరలి వెళ్తుందా అన్నట్టుగా అందరినీ వెంటబెట్టుకుని రాముని దగ్గరకు భరతుడు బయలుదేరి వెళ్లాడు. అతడిని దూరం నుంచే చూసి లక్ష్మణుడు మనపైకి భరతుడు యుద్ధానికి బయలు దేరి వస్తున్నట్టు ఉంది. వానిని నేను ఇక్కడనుంచే వెనక్కు మళ్లిస్తాను. నీవు కూడాఆయుధ పాణివై ఉండు. భరతుని అంతు చూడాలి అంటూ రౌద్రాకారుడై రామునితో లక్ష్మణుడు మాట్లాడాడు. రాముడు ప్రశాంతంగా లక్ష్మణా భరతుడు శాంతస్వభావుడు. అతడు మనపైకి సమరానికి రాడు. అతడు ఒకవేళ రాజ్యంకోసం వస్తే దాన్ని మనమే ఇచ్చేసి వచ్చాం కదా. మరలా ఇంక ఎందుకు యుద్ధానికి వస్తాడు. ఆలోచించు రాజ్యంపై నీకు ఆశఉంటే చెప్పు. భరతునితో చెప్పి ఆ రాజ్యాధికారం నీకు ఇప్పిస్తాను భరతుడు నామాట వింటాడులే అంటాడు రాముడు. కనుక నీవు కోపం వీడి, భరతుని గురించి మంచిగా ఆలోచించు అని చెప్పాడు. అంతే లక్ష్మణుడు రాముని మాటలను విన్నా కూడా భుజాన విల్లంబులను పెట్టుకునే ఉన్నాడు. అల్లంత దూరంనుంచే భరతుడు అన్నా రామా లక్ష్మణా అంటూ అరుస్తూ కన్నీరు కారుస్తూ వచ్చాడు. రాముని పై పాదాలపై పడి నేను మిమ్మల్ను వదిలి అయోధ్యలో ఎలా ఉండగలను. నేను మీతోటి వస్తాను. ఈ సంఘటనలన్నీ నాకు తెలియకుండా జరిగిపోయాయ. వాటిని నా తప్పుగా భావించి నన్ను క్షమించి నీవు తిరిగి అయోధ్యకు వచ్చి పట్ట్భాషేకం చేసుకొని రాజు కమ్ము. నేను సదా నీ సేవకుడినై మెలుగుతాను అని చెప్పాడు. రాముడు అపుడు లక్ష్మణుని వైపు చూశాడు. తనతప్పును లక్ష్మణుడు తెలుసుకొన్నాడు. కనుక కోపాన్ని నిగ్రహించుకోవాలి. జరుగుతున్నదేమిటో పూర్తిగా తెఋకొని లాభనష్టాలను బేరీజు వేసుకోవాలి అపుడు నిర్ణయం సరైనదిగా ఉంటుంది.

- గున్న కృష్ణమూర్తి