సబ్ ఫీచర్

తెలుగు జాతికి పండుగ వేళ.. (ప్రపంచ తెలుగు మహాసభలు )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మా తెలుగు తల్లికి మల్లెపూదండ..’’ కవి శంకరంబాడి సుందరాచారి 1972-73 సంవత్సరాలలో జరిగిన తొలి ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొనడం గొప్ప సంఘటన. అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు హయాంలో ప్రపంచ తెలుగు మహాసభలకు అంకురార్పణ జరిగింది. ఇక రెండు, మూడు ప్రపంచ తెలుగు మహాసభలు (1981, 1990) తెలంగాణకు చెందిన నాటి రాష్ట్ర ముఖ్యమంత్రులు టి.అంజయ్య, డా.మర్రి చెన్నారెడ్డి ఆధ్వర్యంలో జయప్రదంగా జరిగాయి. అదీ విదేశీగడ్డలైన మలేసియా, మారిషస్‌లలో ఎలాంటి అవాంతరాలు, ఇబ్బందులు లేకుండా నిర్వహించడం విశేషం. 1981లో నాటి అంజయ్య ప్రభుత్వంలో, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రిగా వ్యవహరించిన, రచయత, పాత్రికేయులు సీమాంధ్రకు చెందిన భాట్టం శ్రీరామమూర్తి కార్యదీక్షను, ఆనాటి సభలలో పాల్గొన్న భాషాభిమానులు ఈనాటికీ గుర్తుంచుకుంటారు. కానీ 2012లో (ఒకవైపు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు, మరోవైపు సమైక్యాంధ్ర ఉద్యమాల వేళ) నాలగవ ప్రపంచ తెలుగు మహాసభలు ఎంత పేలవంగా జరిగాయో చెప్పనక్కరలేదు. నాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, తన సొంత జిల్లా ప్రధాన కేంద్రం తిరుపతిలో ఆ సభలను జయప్రదం చేయలేకపోయారు. అసలు ఆ సందర్భమే వివాదాస్పదమైంది.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ప్రపంచ తెలుగు మహాసభలు, రాష్ట్ర చరిత్రలో తొలివి. వరుసక్రమంలోనైతే అయిదవది. నవ తెలంగాణ భౌగోళిక, సామాజిక, పారిశ్రామికాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి ఎంతో శ్రద్ధ వహిస్తున్నందుకు తెలుగు జాతి యావత్తు అభినందించవలసిందే. ప్రాంతీయ అస్తిత్వ కాంక్షతో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి, తెలుగు ప్రజల భాషా, సంస్కృతుల ప్రేమికులుగా, విశ్వాసులుగా సీమాంధ్రకు చెందిన పాత్రికేయులు, కవులు, రచయితలు కొందరు తమ కలాలు, గళాలు వినియోగించిన అంశం ఈ సందర్భంగా గుర్తించడం ఎంతో అవశ్యం. రాష్ట్రాలుగా విడిపోయినా, తెలుగువారిగా కలసి ఉండవచ్చునని, కొన్ని సమస్యలున్నా, రాష్ట్ర విభజన వలన తెలుగుజాతిగా పెద్దగా నష్టపోయేది ఏమీ ఉండదని తెలంగాణ ఉద్యమకాలంలో సీమాంధ్రులను ఆలోచింపచేయడానికి వారుపడ్డ తపన మరువలేనిది. తెలుగు భాష, సంస్కృతుల సంరక్షణకు వారు చేసిన కృషిని గౌరవించడం ద్వారా, భావోద్వేగాలకు అతీతంగా వారు పడిన శ్రమను చరిత్రలో నిక్షిప్తం చేసినట్లవుతుంది.
రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో ముందడుగు వేస్తున్నాయి. ప్రవాసాంధ్రులు, ప్రవాస భారతీయులైన తెలుగువారు కూడా ఎంతో ఆనందించే పరిణామం ఇది. ఈ మహాసభల స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాషా సంస్కృతులు పరిఢవిల్లాలని ఆకాంక్షిద్దాం.

బి.వి. అప్పారావు, 9347039294