సబ్ ఫీచర్

అపురూప కళారూపాలు! (ప్రపంచ తెలుగు మహాసభలు )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తె లంగాణ బంగారు చరిత్ర సంస్కృతి కలది. ఇక్కడ అన్ని కుల, మత, వర్ణ, వర్గ ప్రజలు సమైక్యంగా ఉంటూ కళలకు ఎంతో సేవ చేస్తున్నారు. కోహినూరు వజ్రం మన తెలంగాణ. నృత్యం, సంగీతం, సాహిత్యం అన్నింటిలో ఎంతో వైభవాన్ని సంతరించుకుంది తెలంగాణ. కొన్ని ముఖ్యమైన విషయాలు పరిశీలిస్తే తెలంగాణ కళారూపాల గొప్పదనం తెలుస్తుంది.
జాయప: గణపతి దేవుడు నారమ్మ, పేరమ్మ అక్క చెల్లెళ్లను వివాహమాడాడు. వారి తమ్ముడే జాయప. గజపతిగా ఉంటూ, దేశి కళలను తను రాసిన నృత్త రత్నావళిలో సంక్షిప్తపరిచాడు. క్రీ.శ. 1235 చేబ్రోలు శాసనం ప్రకారం, అక్కడి గుడికి దేవదాసీల కోసం రెండస్థుల ఇళ్లు కట్టించినట్లు తెలుస్తోంది. నృత్త రత్నావళిని తెలుగులోకి శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మగారు అనువదించారు.
బతుకమ్మ: బతుకునిచ్చే అమ్మ బతుకమ్మ. దసరా పండుగలో గౌరీదేవికి పూజ చేస్తూ స్ర్తిలు ఆడి, పాడి పండుగ చేసుకుంటారు. ఇది పుష్పోత్సవం. తాంబాళంలో పూలను అందంగా అలంకరించి, దానిచుట్టూ ఆడి, పాడి, తరువాత దగ్గరలో చెరువు లేదా సరస్సులో దీపాలతో సమర్పిస్తారు. ఇది కన్నులపండువగా ఉంటుంది.
బోనాలు: మహంకాళి అమ్మవారిని పూజిస్తూ స్ర్తిలు పెద్ద గినె్నలు, లేదా కుండలలో బోనాలు పెట్టుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. పోతరాజులు కూడా కొరడాలతో కనిపిస్తారు. క్రీ.శ. 1869లో జంట నగరాలలో ప్లేగు వ్యాధి వచ్చినపుడు ఈ బోనాలు సంప్రదాయం ప్రారంభమైందని అంటారు. అమ్మవారికి పాయసం వండి, కుండకు తెలుపు, పసుపు, ఎరుపు (పసుపు కుంకుమలతో) బొట్లు పెట్టి నైవేద్యం పెడతారు. మహంకాళి, గుండమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ దేవతలను ఈ సందర్భంగా పూజిస్తారు.
చిందు భాగవతం: నిజామాబాద్, బోధన్‌వద్ద ఇది ఎక్కువగా ప్రాముఖ్యత చెందినది. అందమైన దుస్తులు దరించి, తబలా, హార్మోనియం, తాళాలు వంటి వాయిద్యాలతో ముఖానికి రంగులు వేసుకుని చేస్తారు. ఇది పల్లెలలో ఎంతో ప్రాచుర్యం పొందింది.
డప్పు: కష్టాలకు సుఖాలకు డప్పు నృత్యం ఉండవలసిందే. కాళ్లకు గజ్జెలు కట్టుకుని, పండుగలు, జాతరలు, ఊరేగింపు, ఉత్సవాలకు డప్పులతో నృత్యం చేస్తారు కళాకారులు.
గొబ్బెమ్మ: సంక్రాంతి సందర్భంగా ఇంటి ముందు కళ్లాపి చల్లి, ఆవుపేడతో గొబ్బెమ్మలు చేసి రంగవల్లుల మీద పెడతారు. ఈ గొబ్బెమ్మలకు పసుపు, కుంకమ, పూలు పెట్టి అలంకరిస్తారు. దాని చుట్టూ స్ర్తిలు ఆడిపాడుతుంటారు.
లంబాడీ నృత్యం: రంగురంగుల దుస్తులు ధరించి అద్దాలతో వాటిని అలంకరించి, ఎన్నో గాజులు, గొలుసులు, గజ్జెలు వేసుకుని పరవశంగా ఆడిపాడతారు. ముఖ్యంగా దసరా, దీపావళి, హోలీ సందర్భంగా ఈ ఆటపాటలు ప్రాముఖ్యం చెందినవి.
మాధురీ నృత్యం: ఇది ఆదిలాబాద్ జిల్లాలో బాగా ప్రాచుర్యం చెందింది. శ్రావణమాసంలో ఆడ, మగవారు పెద్ద నగాడాలకు వలయం, అర్ధవలయాకారంలో చేరి చప్పట్లు కొడుతూ నృత్యం చేస్తారు.
ఒగ్గుకథ: మల్లన్న, వీరప్ప, ఎల్లమ్మ మొదలగు దేవతల కథలు చెప్పే జానపద కళారూపం ఇది. మల్లికార్జునుడి కథలు ఆడిపాడుతారు కూడా! పరమ శివుడి డమరుకమే జగ్గు. జగ్గు పదం ఒగ్గు పదంగా మారింది. ఒగ్గుతో చెప్పే కథ ఒగ్గు కథ. ఇవి మంజరీ ద్విపదలో ఉంటాయి. సాధారణంగా 4 లేదా ఆరు కళాకారులు రణభేరి, తాళాలు, కంజీర, నఫీరతో చెబుతారు. దోతి కట్టుకుని రంగుచొక్కా, తలపై రంగుబట్ట, కాళ్లకు గజ్జెలు వేసుకుంటారు. ప్రధాన కథకుడు ‘‘గవ్వల దర్శనం’’ వేసుకుంటాడు. మల్లన్న భ్రమరాంబను పెళ్లి చేసుకుంటున్నప్పుడు, మల్లన్న ఆవడి ఏడుగురు అన్నదమ్ములను ఓడించాడట. ఆ తరువాత వారిని కుక్కలుగా మారమని శపించాడుట.కానీ భ్రమరంబ బతిమాలితే, వారని ఒగ్గులుగా మారి తన (మల్లన్న) కథలు చెప్పమని అన్నాడుట. ఈ ఏడు గవ్వలు ఏడుగురు అన్నదమ్ములకు సంకేతం. చుక్కా సత్తయ్య ఒగ్గు కథలను బాగా ప్రచారం చేశారు.
మేడారం జాతర: ప్రతి రెండేళ్లకు మేడారంలో జరిగే జాతర ఇది. వనచర, గిరిజనుల అతిపెద్ద జాతర. వరంగల్ నుంచి దాదాపు 100 కి.మి. దూరంలో ఉన్న మేడారంలో సమ్మక్క సారక్క జాతరకు దేశం నలువైపుల నుంచి భక్తులు వస్తారు. ఇది మాఘమాసంలో పౌర్ణమినాడు చేస్తారు. సమ్మక్కతల్లి, ఆవిడబిడ్డ సారక్కకు నిలువెత్తు బంగారం (బంగారం అంటే బెల్లం) సమర్పిస్తారు. ఆ తరువాత జంపన్నవాగులో పవిత్రస్నానం చేసి పవిత్రులవుతారు. జంపన్న కాకతీయ సైన్యంతో పోరాడుతూ ఆ వాగులో పడి చనిపోయాడు. జంపన్న రక్తంతో వాగు ఎర్రగా అయిపోయింది. అప్పటి నుండి ఆ వాగుకి జంపన్నవాగు అని పేరు వచ్చింది.
పేరిణి: కాకతీయ వైభవానికి తార్కాణం పేరిణి నృత్యం. దీనికి మళ్లీ జీవం పోశారు. పద్మశ్రీ డా. నటరాజ రామకృష్ణ. పేరిణి శివతాండవం వీరి ప్రధానమైన నృత్యం. పేరిణి అంటే ప్రేరణ. నాట్యశాస్త్రంలోని కరణాలపై ఆధారపడిన నృత్యం పేరిణి శివతాండవం. ఈ భంగిమలు రామప్ప గుడిలో కనిపిస్తాయి. మళ్లీ నేడు పేరిణి లాస్యం కూడా స్ర్తిలు చేస్తున్నారు. పేరిణి నృత్యం చేసేవారికి చూసే వారికి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది.
ఇలా ఎన్నో అసంఖ్యాకమైన కళారూపాలు తెలంగాణలో జీవనదులుగా ఉన్నాయి. కళలను గౌరవించడం మన సంస్కృతి. అందులోనే మన ముక్తి ముడిపడి ఉంది.

-డా. శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి