సబ్ ఫీచర్

అంతటా ఉన్నది హరియే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే
శ్రీపతి పదారవిందే భవ భయ ఖేదచ్చిదే వనే్ద॥
శ్రీపతి పదారవిందముల సేవనము సమస్త లోకములను పునీతమొనరించు గంగానది సజల ధారయని భావించడం.మకరందము స్రవించు పరిమళము వలె శ్రీవారి చరణములను పోల్చుట. అంతేగాక దుఃఖ భాజనమైన జీవితాన్ని ఎదుర్కొనే సాధకులు, భగవంతుని పాదాన్ని ఆశ్రయించడమే తరుణోపాయమని, అదే దివ్యౌషధమని, మకరంద సువాసనలు వెదజల్లు శ్రీవారి పాద చరణములే తన అభీష్టసిద్ధిని ఈడేర్చగలవని చెప్పే షట్పదీ స్తోత్రాన్ని పఠిస్తే ఆ శ్రీహరి పాదపద్మములను ఆశ్రయిస్తే చాలు ఈలోకంలోని ఇడుములన్నీ దూరమవుతాయి. జ్ఞానాగ్ని రాజుకుంటుంది. ఆ జ్ఞానామృతాన్ని గ్రోలిన ఏ మనుజుడైనా శ్రీహరి పాదపద్మాలనే అనుక్షణం స్మరించకుండా ఉండలేడు. శివ, విష్ణు, లక్ష్మి ఇత్యాది వివిధ స్తోత్ర రాజాలను రచించి అద్వైత, ద్వైత అభేదత్త్వాన్ని ప్రబోధించిన ఆది శంకరులే చిత్తవృత్తిని నిలుపలేని వారికి సులువుగాను,సుబోధకంగాను ఉండేవిధంగా షట్పధీసోత్రతరాజాన్ని అందించారు. నాలో వున్న అవినయాన్ని పారద్రోలమని, భూతదయను పెంపొందించమని, సంసార భయ దుఃఖములనుండి ఉపశమనము చేకూర్చమని, నేను నీవాడనని, బీజ ప్రాయుడనని, నీవో అవతారమూర్తియు నన్ను ఉద్ధరించడానికి నీవే సమర్థుడవని కొనియాడుతూ ఆత్మ పరిశీలనమార్గదర్శనం ఛేయంచేవానివి నీవే, ఆత్మసాక్షాత్కారానికి కారకుడవూ నీవే నని సంభావిస్తుంది ఈ సోత్రతం. దనుజల కులామిత్ర అనుటలో దుష్టులను సంహరించడానికి అవతారాలు ఎత్తినవాడవని చెబుతూ నేను నిన్ను నమ్మి కొలుస్తున్నాను ఆవిధంగా నేను చేయడానికి కూడా నీవే కారణం,
దామోదర! గుణమందిర! సుందర వదనారవింద! గోవింద!
భవజలధి మథన మందర! పరమందర మపనయత్వంమే!!
శ్రీకృష్ణా! ముగ్ధ మనోహర సుందర రూప లావణ్యా సౌందర్యంతో విరాజిల్లువాడా! నాపరమ భీతిని తొలగింపుము. సంసార ఝంఝాటనలో కొట్టుమిట్టాడే నన్ను రక్షించవయ్యా అన్న శరణాగతి తత్త్వం చెప్పే స్తోత్రం గోవింద దామోదర శబ్ద ప్రయోగాలలో సమర్ధుడైన భగవంతుని లీలలు ఆయన ఘటనా ఘట సమర్ధతను వెల్లడిస్తుంది. సమస్తమూ నీవే అయ ఉన్నావు, అంతేకాదు నేనునూనీలోని వానిగా నేను జ్ఞప్తి చేసుకొంటున్నాను అంటే సర్వమూ శ్రీకృష్ణుడేనని భక్తుడు భావించాలనే బోధను ఈ షట్పదీ సోత్రతం చెబుతున్నది.

- సి. విజయలక్ష్మి