సబ్ ఫీచర్

గోదాపాశుర సారం.. కృష్ణ విభవమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరాశరభట్టరు అను భాగతోత్తముడు ‘‘నీళాదేవి వక్షస్థలముపై పరున్న శ్రీకృష్ణుని లేపి, వేదములందు చెప్పబడిన అతని మహత్త్వమును చెప్పి ఆత్మ పరతంత్ర భావన బోధించి , తాను ధరించి విడిచినపూల మాలలో బంధించి పారవశ్యము చెందిన గోదాదేవికి మాటిమాటికి నమస్కరిస్తున్నాను’’ అని చెప్పిన శ్లోకాన్ని చదివి గోదాదేవి రచించి పాడిన తిరుప్పావై రచించిన పాశురాలను అనుసంధానిస్తూ నేటి జనులు గోదాదేవి రంగనాథులను పూజిస్తారు.
ఆనాడు అన్ని మాసాల్లోకెల్లా మార్గశీర్షమే నేను అన్న శ్రీకృష్ణుని మాటను తలచి గోదాదేవి మార్గశీర్షమాసంలో ద్వాపరయుగంలో గోపికలు చేసిన కాత్యాయని వ్రతంలాగా తాను మార్గళి వ్రతం ఆచరించింది. కావేరీ నదీ నీటిస్నానం ఈ వ్రతానికి ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉందని చెబుతూ తన్ను తాను గోపికగా సంభావించుకుని, తన స్నేహితురాండ్రను ఆనాటి గోపికలుగా భావించి వ్రతానికి రమ్మని పిలిచింది. ఈవ్రతాన్ని నియమనిష్టలతో చేద్దామంటూ నెయ్యి, పాలు వంటి కొవ్వు పదార్థాలను స్వీకరించకుండా ఈ ఋతువులో పూసిన పువ్వులన్నింటినీ కేవలం కృష్ణుని ఆరాధనకే వినియోగించాలని తలచివారికి చెప్పింది. కృష్ణుని బాల్యక్రీడావిన్యాసాలను మరీ మరీ తలుచుకుంటూ పాటలు పాడింది. గురువు అనే కాగాడాను పట్టుకొని దారిని శుభ్రపరుచుకుంటూ దైవసన్నిధికి చేరాలని ఆమె భావించి అందరూ కూడా గురువును ఆశ్రయించమని గురువు యొక్క గొప్పతనాన్ని విడమర్చి చెప్పింది.
కృష్ణుని వైభవాన్ని విభవాన్ని తరిచి తరిచి తన చెలులకు వివరిస్తూ తన్ను తాను మైమరిచి పోతుంటుంది. అటువంటి గోదాదేవి తాను పూలు, తులసి సేకరించి మాలలు తయారుచేసి తాను ధరించి చూసి వటపత్రశాయికి తన తండ్రియైన విష్ణుచిత్తుని చేత విష్ణుకైంకర్యానికి పంపింది. అలా పంపే క్రమంలో ఓనాడు భగవానునికి మాలాకైంకర్యం చేస్తుండగా ఆలయ అర్చకులకు పూమాలలో కేశమొకటి కనిపించింది. మాలలు అపవిత్రం అయిపోయాయి అంటూ వారు విష్ణుచిత్తునకు వెనక్కు పంపించారు. ఆ చర్యకు ఖిన్నుడైన విష్ణుచిత్తుడు దిగులు చెందుతున్నపుడు తాను అల్లారుముద్దుగా పెంచుకునే గోదానే మాలలు అపవిత్రం కావడానికి కారకురాలని తెలుసుకొంటాడు. ఎంతో దుఃఖపడుతాడు. కాని, విష్ణుచిత్తునికి శ్రీహరియే స్వప్నదర్శనిమిచి ‘అయ్యా! నాకు నీ కూతురు ధరించి ఇచ్చిన మాలలే ఇష్టమని వాటినే తాను ధరిస్తానని ’చెప్పాడు. అంతేకాక విష్ణుచిత్తుని కుమార్తె గోదాదేవిని తాను పరిణయమాడుతానని కూడా మాటిచ్చాడు. ఆనందతన్మయుడైన విష్ణుచిత్తుడు శ్రీహరి కోరిక మేరకు గోదారంగనాథుల వివాహాన్ని జరిపించాడు. మానవజన్మనెత్తిన నాకు ఇంతకన్నా భాగ్యమేమి కావాలని ఎంతో విష్ణుచిత్తుడు ఆనందచిత్తుడయ్యాడు. ఆ గోదాదేవి పాశురాలనుమనమూ అనుసంధానించుకొంటూ ఆ శ్రీహరిని స్తుతించి మనమూ ఆనందమనస్కులం అవుదాం.

- దాసరి రాణి