సబ్ ఫీచర్

చుంబనాలతో ప్రేమ చిగురిస్తుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొన్నిసార్లు ‘వేలంవెర్రి’ ఎక్కడకు దారితస్తుందో ఎవరూ చెప్పలేం. కనీసం ఊహకందదు కూడా. వెనకటికో టెక్నికల్ కాలేజీ అధ్యాపకుడొకరు తమ విద్యార్థులకు ప్రేమలేఖల పోటీ పెట్టి ఎవరెంత కవితాత్మకంగా రాశారో పరిశీలించి యువతలో ప్రేమభావాల్ని మేల్కొలిపిన విషయం అప్పట్లో విశేషంగా చెప్పుకునేవారు.
తాజాగా జార్కండ్‌లో ఓ కుగ్రామంలో ‘జంటల ముద్దుల పోటీ’ పెట్టి నిర్వాహకులు విజేతలకు బహుమతులను కూడా అందించారు. ఆనక అదంతా భార్యాభర్తలమధ్య ప్రేమాప్యాయతలు చిగురింపజేయడం కోసమేనని సర్దిచెప్పుకొచ్చారు. రాంచీకి 300 కిలోమీటర్ల దూరంలోని ‘డుమారియా’ గ్రామమంతా ఇప్పుడీ వింత గురించే చెప్పుకుంటున్నారు.
జెఎంఎం ఎమ్మెల్యే సిమాన్ మారాండి నేతృత్వంలో ఆదివాసి జంటల మధ్య ‘చుంబనాల’ పోటీ నిర్వహించారు. పోటీలో ఎవరు ఎంతసేపు ముద్దుపెట్టుకోగలిగితే వారిమధ్య అంత ప్రేమ ఉన్నట్లు పరిగణిస్తారు. ఏ కారణ చేతనైనా వారా పోటీల్లో పాల్గొనలేకపోయినట్లయితే, ఎక్కవసేపు ముద్దాడలేకపోతే వాళ్ళమధ్య ప్రేమ లేనట్లేనా? అదీ ఏ మాత్రం నాగరికత ఎరుగని ఆదివాసీ భార్యాభర్తలమధ్య ఇలాంటి భావన రేకెత్తిస్తే వారి మధ్య ప్రేమలు మటుమాయమైపోతాయేమోనని సభ్య సమాజం ముక్కున వేలేసుకుంటోంది.
నిరక్షరాస్యులలో అనుబంధాలు, కట్టుబాట్లు ఇంకా బలోపేతం కాలేదు. ఆధునిక సమాజ పోకడలను ఇంకా పుణికి పుచ్చుకునే స్థితి కూడా వారికి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం ‘ముద్దుల పోటీ’లో సామర్థ్యాన్నీ, ప్రేమకూ ముడిపెట్టడమంటే బోడి గుండుకూ మోకాలికీ ముడిపెట్టినట్లే!
కొన్ని దేశాలు ముద్దులు పెట్టుకునేందుకు ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యేక స్థలాన్ని కేటాయించడం వింటున్నాం. తన వారిని ఆత్మీయులను వీడ్కోలు చెప్పటానికి వచ్చిన వారిమధ్య భావోద్వేగం తెంచుకుని వచ్చి ‘ఆఖరి ముద్దు’కు తెగపడుతుంటారు. అందుకేనేమో ఇలాంటివారికోసం డెన్మార్క్, సింగపూర్, హాంగ్‌కాంగ్, రోమ్, పారిస్, లాస్‌ఏంజెల్స్, సాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయాల్లో కిస్సింగ్ జోన్లున్నాయి. అదీ మూడు నిమిషాలకు మించి ముద్దుపెట్టుకునేందుకు లేదు. భారత్‌లో అలాంటివాటికి అవకాశమిమ్వడంలేదు. జార్ఖండ్‌లోని డుమారియా మేళాలు మరి ఏ కోవలోకి వస్తాయో!
37 ఏళ్ళుగా ‘డుమారియా మేళా’ పేరిట నిర్వహించే గిరిజన నృత్యాలు, పరుగు పందాలు, ఇతరత్రా కార్యక్రమాల్లో భాగంగా ఈసారి ముద్దుల పోటీ కూడా చొప్పించారు. ఐతే ఈ పోటీలను ఎవరూ హర్షించట్లేదు. పైగా కేవలం పదిమంది సమక్షంలో బహిరంగ ముద్దుల ద్వారా కాపురాలు కలిసి ఉంటాయంటే హాస్యాస్పదమే. ఈ గ్రామంలో జనగణన బట్టి 333మందిలో 169 పురుషులు, 164మంది స్ర్తిలున్నారు. వారిలో అక్షరాస్యత 25 శాతమే. ఆధునిక ప్రపంచం ఎంతో ఎదుగుతున్నా ఆదివాసీల్లో అక్షరాస్యత కల్పించడం, భార్యాభర్తల అనుబంధంపై అవగాహన కల్పించడం మాని అధర చుంబనాలతో అప్రతిష్ఠపాలు చేయడం ఈ సభ్యసమాజానికి తగునా? ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి సభ్య సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నామో ఆలోచన చెయ్యాల్సిందే.ఇవన్నీ ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలను భ్రష్టుపట్టించే ప్రయత్నాలుగా నాగరిక సమాజమూ గగ్గోలు పెడుతోంది. డుహారియా తెగకు చెందిన 18 మంది జంటలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు అంచనా. వీరికే కాదు, గ్రామం మొత్తానికే కాదు, ఆ చుట్టుప్రక్కల గిరిజన ప్రాంతాల్లోని ఆదివాసీ యువతీ యువకులందరికీ ఇలాంటి పోటీల్లోకి రావద్దని అవగాహన కల్పించే బాధ్యత ప్రభుత్వంపై ఉంది. నిర్వాహకుల చెడు అభిరుచిని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందే!

-వరిగొండ కాశీ విశే్వశ్వరరావు