సబ్ ఫీచర్

విమానయానంలో లగేజీ గల్లంతయితే?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణంగా రెండు వారాల్లో గల్లంతయిన లగేజీని భద్రంగా ఇంటికి చేరుస్తారు. ఇందుకోసం ఎలాంటి రుసుము వసూలు చేయరు. అయితే మొత్తానికి కనిపించకుండా పోయిన లగేజీ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికి ఇచ్చే నష్టపరిహారం కొంత విమర్శలకు గురవుతోంది. అందరికీ ఒకే నష్టపరిహారాన్ని ప్రకటించడంవల్ల విలువైన వస్తువులు వున్నవారు అసంతృప్తికి లోనవుతున్నారు. అదనపు నష్టపరిహారం కోసం కేసులు పెడితే సంవత్సరాల తరబడి తీర్పులు రావడంలేదు. ఈ కారణంగా ఇచ్చిందే మహాభాగ్యం అనుకుంటూ తీసేసుకుంటున్నారు. అయితే మన దేశానికి చెందిన అహ్మదాబాద్ వాస్తవ్యులు అనీల్‌బాయ్ పటేల్ వినియోగదారుల ఫోరంలో గల్ఫ్ ఎయిర్‌వేస్‌పై కేసు వేసి పదేళ్లు పోరాడి గత ఏడాది 72వేల రూ.ల నష్టపరిహారం పొందారు.
సాధారణ నష్టపరిహారంగా అమెరికా 3,300 డాలర్లు, ఎయిర్‌ఫ్రాన్స్ 1,130 యూరోలు, మిగిలిన అన్ని దేశాల విమాన సంస్థలు 1,663 అమెరికా డాలర్లకు సరిపడా నష్టపరిహారం ఇస్తున్నాయి. ఈ కారణంగా విలువైన వస్తువులు లేదా నగదుతో ప్రయాణించేవారు నష్టపోతున్నారు. కాబట్టి విలువైన నగలు, నగదు వెంట ఉంచుకోవడం మంచిది. మహిళా ప్రయాణికులకు చిన్న హేండ్‌బ్యాగ్‌ను కూడా అనుమతిస్తున్నారు. అయితే ఇది రెండు కిలోలకు మించకూడదు.

రైలు, బస్సు ప్రయాణాల్లో లగేజీ గల్లంతు సర్వ సాధారణం. అదే విమాన ప్రయాణంలో అయితే... నమ్మలేక పోతున్నారు కదూ? ప్రపంచవ్యాప్తంగా విమానయానంలో ఏటా లక్షల సంఖ్యలో లగేజీ సూట్‌కేసులు గల్లంతవుతున్నాయి. 2013 సం.లో 2 కోట్ల 60 లక్షల లగేజీ మిస్సింగ్ లేదా లగేజీ జాప్యం కేసులు నమోదయ్యాయి. అయితే వాటిలో 90 శాతం కాస్త ఆలస్యమైనా తిరిగి సురక్షితంగానే ప్రయాణికుల గూటికి చేరుకున్నాయి. దీనికి సంబంధించిన ఆసక్తికరమైన కథనం ఇది.
ఆ మధ్య మన కేంద్ర వాణిజ్య శాఖ ఉపమంత్రి శ్రీమతి నిర్మలా సీతారాం తన విదేశీ పర్యటనలో లగేజీ మాయం కావడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇది ఒక్క నిర్మలా సీతారామన్‌కే కాదు వేలాది మంది ప్రయాణికులు, సినీతారలు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలు లగేజీ కోల్పోయి అవస్థలు పడ్డవారే. అయితే విమాన ప్రయాణంలో నూటికి 90 శాతం తమ వెంట వుండే హేండ్ లగేజీని కాకుండా పెద్ద లగేజీ వుండే సూట్‌కేసులనే మిస్సవుతుంటారు. లగేజీ గల్లంతు విషయం విమానం దిగి లగేజీ తీసుకోవడానికి కనే్వయర్ బెల్ట్ దగ్గరకు వెళ్లినప్పుడుగాని బయటపడదు. నేరుగా ఒకే విమానంలో ప్రయాణించే వారికంటే విమానాలు మారి ప్రయాణించేవారి విషయంలో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.
విమానయానంలో రెండు పెద్ద సూట్‌కేసులు ఒక చిన్న సూట్‌కేసును అనుమతిస్తారు. ఇందులో పెద్ద సూట్‌కేసుల రవాణా బాధ్యత విమాన సంస్థ తీసుకుంటుంది. చిన్న సూట్‌కేసు (సామగ్రితో సూట్‌కేస్ బరువు 8 కిలోల లోపు వుండాలి). ప్రయాణికుని వెంటే వుంటుంది. ఈ కారణంగా పెద్ద సూట్‌కేసుల రవాణా బాధ్యత పూర్తిగా విమాన సంస్థమీదే వుంటుంది. విమానం దిగిన గంటలోపే మన లగేజీ భద్రంగా వచ్చింది లేనిది తెలిసిపోతుంది. కనే్వయర్ బెల్ట్ గిర్రున తిరుగుతున్నా సూట్‌కేసులు రాకపోతే ప్రయాణికుల గుండెల్లో రాళ్లు పడతాయి. ఇలాంటి బాధితులు నలుగురైదుగురు వుంటారు. వారంతా సంబంధిత ఎయిర్‌వేస్ సంస్థను కలిసి తమ లగేజీ గల్లంతు విషయాన్ని రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. ఇందుకోసం లగేజీకి సంబంధించిన కొన్ని ఆధారాలు చూపాలి. ఇలాంటి ఫిర్యాదుల కోసం కస్టమర్ సర్వీస్ కోసం విమానయాన సంస్థల సిబ్బంది సాధారణంగా దగ్గరగానే అందుబాటులో వుంటారు. బ్యాగ్‌ల వివరాలను వాటిలోని సామాగ్రి వివరాలను డాలర్లలో వాటి విలువను (అంచనా) తెలపాలి. ఈ వివరాలన్నీ ప్రోపర్టీ ఇరెగ్యులారిటీ రిపోర్ట్ (డిఐఆర్) అనే నిర్ణీత దరఖాస్తులో పేర్కొన్నారు. ముఖ్యంగా సామాగ్రి తిరిగి చేరవలసిన చిరునామాను జాగ్రత్తగా రాయాలి. కాంటాక్ట్ నెంబర్ తప్పనిసరి. సాధారణంగా 24 లేదా 48 గంటల్లోపే లగేజీ మిస్సింగ్ సమస్యను పరిష్కరిస్తారు. ఎందుకంటే ఇలాంటి మిస్సింగ్ లగేజీ నూటికి 90 శాతం కేసుల్లో తరువాత వచ్చే విమానంలో వచ్చేస్తుంది. ఈలోగా ప్రయాణికుల కోసం విమాన సంస్థలు కొన్ని ఏర్పాట్లు చేస్తాయి. ఒకటి రెండు రోజులు నిరీక్షణ కోసం బస ఏర్పాటు చేస్తాయి. ఖర్చులకోసం కొంత మొత్తాన్ని అందజేస్తాయి. అమెరికా సంస్థ రోజుకి 50 డాలర్లు ఇస్తే, ఎయిర్ ఇండియా రోజుకి 3వేల రూపాయలిస్తుంది. ఎయిర్ ఫ్రాన్స్ వంద యూరోలు ఇస్తుంది.
21రోజుల గడువు
విమాన లగేజీ మిస్సింగ్ కేసులకు నిబంధనల ప్రకారం 21 రోజుల్లో పరిష్కరించాలి. 21 రోజులు పూర్తయినా లగేజీని గుర్తించలేకపోతే నష్టపరిహారం చెల్లిస్తారు. ఎయిర్ ఆసియా విమాన సంస్థ మాత్రం ఈ గడువును 14 రోజులుగా ప్రకటించింది. ప్రతి 1000 మంది ప్రయాణికుల్లో 9 మంది లగేజీ మిస్సింగ్ లేదా జాప్యం బారిన పడుతున్నారు. కొన్ని వస్తువులు పాడైపోవడం లేదా చోరీకి గురికావడం కూడా జరుగుతుంది. 2003లో ప్రతి వెయ్యిమంది విమాన ప్రయాణికుల్లో 13 మంది ఈ సమస్యకు గురయ్యారు. ఇప్పుడు అది 9 శాతానికి తగ్గింది. అమెరికా లోకల్‌లో ఇది 6.7 శాతంగా వుంది.
దశ సూత్రాలు
విమాన ప్రయాణికులు ఈ దిగువ జాగ్రత్తలు పాటించడం మంచిది. చాలామంది ఒకేరకమైన రంగుల సూట్‌కేసులు వాడుతున్నారు. కనుక కాస్త భిన్నమైన రంగు సూట్‌కేసు వాడాలి. కనే్వయర్ బెల్ట్‌పై వెంటనే గుర్తించగలగాలి. సూట్‌కేస్‌కు అడ్రస్ ట్యాగ్‌ను జాగ్రత్తగా కట్టాలి. సమగ్ర చిరునామా టెలిఫోన్ నెంబర్ పేర్కొనాలి. లగేజీ బ్యాగ్‌ల లోపల కూడా ప్రయాణికుల సమగ్ర చిరునామా విధిగా వుంచాలి. బ్యాగ్‌లో నిషిద్ధ వస్తువులు వుంటే గల్లంతు కేసు నమోదు చేసేటపుడు ఇబ్బంది ఎదుర్కోవాల్సి వుంటుంది. లగేజీని అతిగా ప్యాక్ చేయడంవల్ల అదనపు తనిఖీ అధికారులు వాటిని పనిగట్టుకొని తనిఖీ చేయవచ్చు. నిబంధనల మేరకు లగేజీకి తాళం వేయడం మంచిది. వస్తువుల చోరీ నివారణకు ఇది ఉపకరిస్తుంది. విమానం దిగాక కనే్వయర్‌బెల్ట్ దగ్గరకు ఆలస్యం చేయకుండా వెళ్లడం మంచిది. ఎవరైనా ఆ లగేజీని పొరపాటున పట్టుకుపోవచ్చు. లగేజీకి సంబంధించిన సూట్‌కేసుల ఫొటోలను స్మార్ట్ఫోన్‌లో భద్రపరచుకోవాలి. సూట్‌కేసులకు వుండే పాత ప్రయాణాల టేగ్స్ అన్నీ తొలగించాలి. సూట్‌కేసులోని వస్తువుల జాబితాను దగ్గరుంచుకోవాలి.

-పుట్టా సోమన్నచౌదరి