సబ్ ఫీచర్

కొత్త సంవత్సరం వేడుకలు వద్దా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయులమైన మనం ఉగాది పండగ చేసుకుంటున్నా, జనవరి ఒకటిన కొత్త గ్రేగోరియన్ క్యాలెండర్ ప్రారంభంరోజు ‘హ్యాపీ న్యూ ఇయర్’ జరుపుకోవడం దశాబ్దాలుగా పాటిస్తూనే ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో కోట్లాది మంది ప్రజలు జనవరి 1 వ తేదీని కొత్తసంవత్సరంగా జరుపుకుంటున్నారు. సౌదీ అరేబియా, ఇజ్రాయిల్, ఇరాన్‌తో సహా. సౌదీ అరేబియాలో కొత్త సంవత్సరం వేడుకలపై నిషేధం విధించారు. ఏకంగా న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం విధిస్తూ, ఫత్వా జారీ చేసి వేడుకలు జరుపుకోవద్దంటూ విదేశీయులను కూడా హెచ్చరించారు. చైనాలో జనవరి 1న గ్రేగోరియన్ నూతన సంవత్సరం మరియు సాంప్రదాయ చాంద్రమాన నూతన సంవత్సరం కూడా జరుపుకుంటున్నారు. దేశం ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలంటే, విదేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేయాలంటే పాశ్చాత్యీకరణ తప్పదని గ్రహించిన జపాన్ ‚19వ శతాబ్దంలో సౌర క్యాలెండర్‌ని అనుసరించింది. వైవిధ్యమైన సంస్కృతులు, సాంప్రదాయాలు, మతాలు, కులాలు కలిగి ఉన్నా, ‘్భన్నత్వంలో ఏకత్వం’ భారతదేశం ప్రత్యేకత. భారతదేశం కూడా సౌదీ అరేబియా లాంటి మత ఛాందస వైఖరిని అవలంభించడం సమంజసమా? ప్రపంచీకరణతో సాంకేతిక అభివృద్ధి సాధించి, సోషల్ మీడియా, డిజిటల్ ప్రపంచ యుగంలో గూగుల్ ఒక దేశం, ఫెస్‌బుక్, ట్విట్టర్ మొదలైనవి మతాలు. వాట్సాప్ ఒక కులంగా ఏర్పడ్డ ఈ ఆధునిక యుగంలో ఇంకా మతవ్ఢ్యౌల ముసుగులో చాదస్తం భ్రమలో మనిషిగా, మానసికంగా వెనక్కు వెళ్లిపోతున్నామా అని అనిపిస్తోంది.
జనవరి ఒకటిన న్యూ ఇయర్ మన సంప్రదాయం కాదు కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేకమైన అలంకరణలు, వేడుకలు జరపరాదని హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్, దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేశాయి. అదనపు ఖర్చు తగ్గించుకునే కోణంలో ఈ ఉత్తర్వులు బాగానే ఉన్నాయి. కాని న్యూ ఇయర్ మన పండగ కాదు, ఉగాది మాత్రమే మనకు కొత్త సంవత్సరం అంటూ ఒక వైపు చెబుతున్న టిటిడి దేవస్థానం వారు మరోవైపు 2018 క్యాలెండర్, డైరీలు ప్రచురించడం గమనార్హం. 2018 సంవత్సరం డైరీలు, క్యాలెండర్‌ల స్థానంలో చాంద్రమాన ప్రకారం చైత్రమాసం ఉగాది నుండే ఉపయోగపడే విధంగా డైరీలు, క్యాలెండర్‌లు ఎందుకు ముద్రించడం లేదు? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇలా ఉండగా చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు మరికాస్త ముందుకు వెళ్లి, కొన్ని ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘హ్యాపీ న్యూ ఇయర్’ అన్న వారిని గుంజీలు తీయిస్తామని ప్రకటించారు. ఈ తరహా ప్రకటన సమంజసం కాదేమో అనిపిస్తోంది. వాస్తవంగా చిలుకూరి బాలాజీ దేవుడిని ‘వీసా’ల దేవుడిగా మొక్కుతుంటారు. వీసాలు వచ్చేవారు సప్తసముద్రాలు దాటి విదేశాలకు వెళ్లవచ్చు, ఉద్యోగాలు చేయవచ్చు, డాలర్లు సంపాదించి ఆలయాలకు విరాళాలు ఇవ్వవచ్చు, కానీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పుకోకూడదనడం ద్వంద్వ వైఖరిని సూచిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రముఖుల జన్మదినోత్సవాలు, దివంగత నేతల వర్ధంతులను ఆంగ్లసంవత్సరం తేదీల ప్రకారమే జరుపుతున్నారు కదా!
బహుళజాతి సంస్థలు, విదేశీ సంస్థలు, తెలుగు రాష్ట్రాల్లో నెలకొల్పిన ఆఫీసులకు ఉగాదిరోజుతో పాటు భారతీయ పండగల రోజుల్లో సెలవులు ప్రకటిస్తున్నాయి. ఈ పండగలు తమ పండగలు కాదంటూ తిరస్కరించడం లేదు. అమెరికాలో వైట్ హౌస్‌లో దేశాధ్యక్షుడు దీపావళి పండగను జరుపుకున్నారు. ఇతర మతాలు ప్రధానంగా ఉండే దేశాల్లో కూడా భారతీయ పండగలు జరుపుకుంటున్నారు. మన పిల్లలు విదేశాల్లో చదువుకుని మైక్రోసాఫ్ట్, అమెజాన్ తదితర సంస్థల్లో ఉద్యోగం చేసి డాలర్లు సంపాదించాలి. విదేశీ పెట్టుబడులు వచ్చి మన దేశం ఆర్థికంగా పురోభివృద్ధి సాధించాలి. మన వ్యాపారం ఉత్పత్తి, సేవలు ఇతర దేశాలు కొనుగోలు చేసేలా బహుళజాతి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలి. మనకు ఆరోగ్యం బాగా లేకపోతే విదేశీ సంస్థల ఔషధాలు, స్టెంట్లే గతి. విదేశీ టెక్నాలజీని మనం పూర్తిగా ఉపయోగించుకోవాలి. గూగుల్, ఫేస్‌బుక్, ఐఫోన్, ఇంటర్నెట్ మనం నిత్యం వాడుతూ, మనోరంజనం పొందాలి. కాని విదేశీయుల న్యూ ఇయర్ మాత్రం జరుపుకోకూడదనడంలో ఔచిత్యం ఏమిటో ఆలోచించాల్సిన తరుణమిది. ఆధునిక యుగంలో శాంతి, విజయం, అభివృద్ధి, మనుగడ ఉండాలంటే మతాచారాలని మంట కలపకుండా, అన్ని సంస్కృతులు, సాంప్రదాయాలను గౌరవించడం, భిన్న వర్గాలను కలుపుకుని పోవడం ముఖ్యం.
మన శాస్తవ్రేత్తలు 104 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపించి చరిత్ర సృష్టించారు. మరోవైపు డ్రైవర్ రహిత కారు నుండి మానవరహిత రోబోటిక్ శస్తచ్రికిత్స వరకు, డ్రోన్‌ల ద్వారా ప్యాకేజీలను రవాణా చేయడం తదితర విధానాల్లో సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నాం. సాంకేతిక పురోగతి కాలానుగుణ దృష్టిని ఆకర్షించినప్పటికీ, కుల మత సామరస్యం మరియు సామూహిక సామర్థ్యాలను పెంపొందించుకోవడంలో విఫలమవడమే కాకుండా రాను రాను వెనక్కు వెళ్లిపోతున్నామా అనిపిస్తోంది. భారతీయులు స్వేచ్ఛగా, శాంతియుతంగా వ్యవహరించే రీతి, వాతావరణాలను సృష్టించేందుకు ప్రభుత్వ, ప్రజా విధానాల్లో మార్పునకు ప్రయత్నాలు చేయాలి.
భారతీయులు విదేశాలకు వెళుతున్నారు. అక్కడ పుట్టిన పిల్లలు విదేశీ సంస్కృతికి అలవాటు పడుతున్నారు. వాళ్లతో పాటు విదేశీ సంస్కృతి కూడా మన దేశంలోకి దిగుమతి అవుతోంది. గతంలో లేని విధంగా వాలంటైన్స్ డే, అక్షయ తృతీయ అంటూ వ్యాపార సంస్థలు కొత్త పండగలను మనపై రుద్దుతున్నారు. ఇవన్నీ ప్రపంచీకరణలో భాగమే, ఆధునీకరణలో భాగమే.
ముఖ్యంగా ఈ జనరేషన్లో పుట్టిన వాళ్లు ఇంగ్లీషు క్యాలెండర్లు, పంచాంగాల మధ్య పాశ్చాత్య నాగరికత, సాంప్రదాయ నాగరికతల మధ్య నలిగిపోతున్నారు. బహుళజాతి సంస్థల్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు లేదా వాటితో వ్యాపారపరంగా క్లయింట్స్‌తో విందులు, వినోదాలకు హాజరు కావడం, పుట్టిన రోజులకి కార్యాలయాల్లో కేకులు కట్‌చేయడం పరిపాటిగా మారింది. పెద్దనగరాల్లో నివసిస్తున్నప్పుడు గ్రామీణ సంస్కృతి వారసత్వం మత సాంప్రదాయం కొనసాగించడానికి వీలుకాకపోవచ్చు. సంఘంలో నలుగురికీ ఆమోదయోగ్యంగా ఉండేట్టు మరో కులం, మరో మతస్తులకు ఇబ్బంది కలగకుండా తటస్థ వైఖరి అవలంబిస్తున్నాం.
అత్తరు దుకాణాల్లో పనిచేస్తున్నప్పుడు దుస్తులకు పరిమళం అంటకుండా, వ్యవసాయం చేస్తూ చేతికి మట్టి అంటకుండా ఎలా ఉండలేమో, అదేవిధంగా ప్రపంచీకరణలో మరొక సంస్కృతికి ఆమడ దూరంలో ఉండలేము.
మనం రోడ్ల కూడళ్లలో ‘్భగవద్గీత’ విక్రయించే విదేశీయులను చూస్తున్నాం కదా! లక్షలాది మంది విదేశీయులు ‘హరేరామ హరేరామ రామ రామ హరేహరే- హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే’ అంటూ ఇస్కాన్ దేవాలయాల్లో సేవ చేస్తున్నారు. హిమాలయాల నుండి కన్యాకుమారి వరకు, కాశీ, అరుణాచలం, పుష్కర్, కుంభమేళాతో సహా అనేక హిందూ ప్రార్థనా స్థలాలను విదేశీయులు దర్శిస్తుంటారు. విదేశీయుల పోప్ దానికి అభ్యంతరం వ్యక్తం చేశారా? లేదు కదా!
పూజలు, దేవాలయాల్లో న్యూఇయర్ వేడుకలు జరుపుకోవద్దనడం కన్నా, ఈ రోజు సారా, వైన్‌షాపుల దుకాణాలు మూసివేయించాలి అని డిమాండ్ చేయడం సమంజసంగా, శ్రేష్టంగా ఉంటుంది.

- సునీల్ ధవళ, 09741747700