సబ్ ఫీచర్

చరిత్ర అబద్ధం చెప్పదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన వైయుక్తిక ప్రయోజనాల దృష్ట్యా, అజ్ఞానం దృష్ట్యా చరిత్రను వక్రీకరించవచ్చు. కాని వాస్తవాలు, తేదీలు, సంఘటనలు మారవు. నేతాజీ సుభాష్‌చంద్రబోస్ 1939 తర్వాత ఫార్వర్డ్‌బ్లాక్ అనే పార్టీని ఎందుకు స్థాపించవలసి వచ్చింది? ఆతను కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షునిగా పోటీ చేస్తే మహాత్మాగాంధీ స్వయంగా భోగరాజు పట్ట్భా సీతారామయ్యను పోటీకి నిలబెట్టాడు. బోసుబాబు గెలిచి పట్ట్భా ఓడిపోతే ‘ఇది వ్యక్తిగతంగా నా ఓటమి’ అని గాంధీజీ ప్రకటించాడు. ‘‘పొమ్మనలేక పొగపెట్టారు’’ అని ఒక నానుడి ఉంది. ‘‘నా జీవితంలో నెహ్రూ పెట్టినన్ని బాధలు మరెవరూ పెట్టలేదు’’ అని స్వయంగా సుభాష్ బాబు ప్రకటించి పార్టీ వదిలి బయటకు వచ్చాడు. ఇదీ చరిత్ర. సుభాష్‌బాబును, భగత్‌సింగ్‌ను ఉగ్రవాదులు అన్నాడు గాంధీజీ. కనీసం భగత్‌సింగ్‌ను ఉరి నుండి కాపాడడానికి కూడా ప్రయత్నించ లేదు. 1945 తర్వాత భారత దేశ చరిత్రలో సుభాష్‌బాబు మరణం ఒక మిస్టరీగా మారింది. ఆయన ఒక విమాన ప్రమాదంలో మరణించాడు అని కథలల్లారు. 1947 నుండి 2014 వరకు నెహ్రూ కుటుంబం ఏకఛత్రాధిపత్యంగా భారతదేశాన్ని నిరంకుశంగా పరిపాలించింది. సుభాష్ బాబు పేరుమీద ఒక్క ప్రభుత్వ రంగ సంస్థకు కూడా పెరు పెట్టలేదు. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ, జవహర్ బాలభవన్, ఇందరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ రాజీవ్ రహదారి- ఇలా భారతదేశ చరిత్ర నడిచింది. త్యాగధనులైన సర్దార్ వల్లభ్‌భాయి పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, గోపాలకృష్ణ గోఖలే, లాల్ బాల్ పాల్, టంగుటూరి ప్రకాశం పంతులు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, చక్రవర్తుల రాజగోపాలాచారి...ఏమైనారు ఈ మహాపురుషులు? ఊరూపేరు లేకుండా మట్టిలో కలిసిపోయారు. ఖశ ఒఖశ ఘశజూ ఖశతీళఔఆ అన్నట్టు అనాధృతంగా విస్మరింపబడ్డారు. ఇవ్వాళ గుజరాత్‌లో సర్దార్ వల్లభ్‌భాయి పటేల్ కాదు హార్దిక్ పటేల్ మహానాయకుడు. ‘‘పటేల్‌కు భారతరత్న రాకుండా నెహ్రూ కుటుంబం చేసిందికదా’’ అని ఒక టీవీ షోలో ఒకరు ప్రశ్నిస్తే ‘రాకపోతే ఏమిటిట?’’ అని గత అక్టోబర్ 31న ఈ పిల్లవాడు ప్రవచించాడు. వీళ్లూ మన నాయకులు? భారతదేశంలో ఐదువందలకు పైగా ఉన్న స్వదేశీ సంస్థానాలను రద్దు చేసి భారతీయ సమైక్యతకు దోహదం చేసినవాడు సర్దార్ వల్లభ్‌భాయి పటేల్. 1952 తరువాత మళ్లీ భాషాప్రయుక్త రాష్ట్రాల పేరుతో ముక్కలు చేసినవాడు జవహర్‌లాల్ నెహ్రూ. భారత జాతికి ఎవరు ప్రాతినిధ్యం వహించే నాయకుడో మీరే నిర్ణయించండి.
నేతాజీ సుభాష్‌చంద్రబోసును ఉగ్రవాది అన్నారు. హిట్లరు బూట్లు నాకే కుక్క అన్నారు. సావర్కార్‌ను మతతత్వవాది అన్నారు. లాల్ బహదూర్ శాస్ర్తీని యుద్ధోన్మాది అన్నారు. ఇదంతా దేనికోసం? నెహ్రూ కుటుంబ అనువంశిక పాలనను స్థిరీకరించడం కోసం. ఇవ్వాళ అమితాబ్ బచ్చన్‌లు జయసుధలు రాజకీయ అరంగేట్రం చేసి ప్రజలచేత ఆరాధింపబడుతున్నారు. రజనీకాంత్ కమలహాసన్ చేసిన త్యాగాలేమిటి? రాజకీయ పరిజ్ఞానం ఎంత? న్యూస్‌పేపర్ చదవడానికి కూడా ఇష్టపడనివారు దేశ నాయకులు. తెలంగాణలో ఆడబిడ్డలను బట్టలు విప్పించి బతుకమ్మలు ఆడించినవాడు కాశిం రజ్వీ. మా నిజాము తరతరాల బూజు అన్నాడు మహాకవి దాశరథి కృష్ణమాచార్య. కాని ఇవాళ ఏమయింది? ‘మా నిజాం చాలా మంచోడు’ అంటున్నారు పాలకులు. మంచోడు అయితే అప్పటి స్వాతంత్య్ర పోరాటం 1947-48లో స్వామి రామానంద తీర్థ - ఎందుకు చేసినట్లు?? ఆనాటి దీన్‌దార్, అంజుమన్ ఇత్తెహాదుల్ మజ్లీస్ - ఉగ్రవాద మత సంస్థలకు వారుసులైనవారికి 2017లో మళ్లీ మాన్యత ఎలావచ్చింది??
భారతదేశంలో నేడు 130 కోట్లమంది ప్రజలున్నారు. వీరిలో ఒక్కడైనా ప్రశ్నించాడా, సికిందరాబాదులో సోనియా ఇటాలియాకు గుడి కట్టడం ఏమిటి? - అని!! ఆనాటి విక్టోరియా రాణివలె ఈనాడు సిగ్నోరా గాంధీ భారత్‌ను దోచుకొని సంపదలను తరలించడానికి వచ్చింది. ఆమెను నాయకురాలిగా అంగీకరించిన వారు ఇంకా చాలామంది ఉన్నారు. మనీష్ తివారీలు, ఆనందశర్మలు, సందీప్ దీక్షిత్‌లు ఉన్నారు. వీరంతా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవారు! 2019 నాటికి బ్రహ్మపుత్ర మీద చైనా నిర్మిస్తున్న డ్యాం పూర్తి అవుతుంది. ఆ తరువాత భారత ఈశాన్య రాష్ట్రాలకు ఒక్క చుక్క నీరు అందదు. ఒకవేళ యుద్ధం వస్తే చైనావారు డ్యాం గేటుల ఎత్తివేస్తే చాలు ఈశాన్య భారతంలోని బ్రహ్మపుత్ర ప్రాంత పరీవాహక ప్రాంతాలు నీటిలో మునిగిపోతాయి. ఈ వ్యూహం ఇవ్వాళ అందరికీ తెలుసు. ఐనాసరే రాహుల్‌గాంధీ రహస్యంగా వెళ్లి చైనా రాయబారితో మొన్న ఏమి మాట్లాడి వచ్చాడు. ఆ విషయాలపై నరేంద్రమోదీ ఎందుకు విచారణ జరిపించలేదు.
స్వాతంత్య్రం వచ్చిన తరువాత మన పాఠ్య గ్రంథాలు మార్చబడతాయని ఆశించినవారికి నిరాశ ఎదురయింది. బ్రిటీషువారు రూపొందించిన చరిత్రను కాస్త మెరుగుపెట్టి ఎర్రరంగు అద్ది మళ్లీ అబద్ధాలు వార్చి వడ్డించారు. టిప్పుసుల్తాను గొప్పవాడు, అక్బరు మతసామరస్యం కలవాడు, ఔరంగజేబు కాశీవిశే్వశ్వరునికి దానాలు చేశాడు, చిత్తోడ్ రాణి పద్మిని అల్లాఉద్దీన్ ఖిల్జీని ప్రేమించింది... ఇవా మన చరిత్రలు? ‘షాజహాను తాజ్‌మహల్‌ను నిర్మించెను’ ఇంతకన్నా భయంకరమైన అబద్ధం మరొకటి ఉందా? షాజహాను పుట్టడానికి మూడు వందల సంవత్సరాలకు మునుపే అక్కడ ఒక దేవాలయం ఉంది అని అమెరికాలోని న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో విపుల పరిశోధన చేసిన ప్రొఫెసర్ మార్విన్ ముల్లర్ తన కార్బన్ సెర్చి భూపరీక్షల ద్వారా నిర్ధారి‚చాడు. ముంతాజ్ బేగం పేరు అంజుమయ్‌బాను బేగం. ఆమె మనం ఊహించుకున్నంత అందగత్తె కూడా కాదు. షాజహాన్ జీవిత చరిత్రను రచించిన ఇనాయత్ ఖాన్ తాజమహల్ షాజహాను కట్టించెను - అని ఒక్క ముక్క కూడా వ్రాయలేదు. తాజమహల్, రాజపుత్రులు నిర్మించిన తేజమహాలయ అని చరిత్రలో ఉంది. సంగీత్‌సోమ్ అనే యూపీ నాయకుడు ఇటీవల తాజమహల్ నిర్మాణం అంశాన్ని తెరమీదకి తీసుకుని వచ్చాడు. దానితో గొడవ మొదలయింది. ప్రకాశ్‌రాజ్ అనే సినీనటుడు మాట్లాడుతూ ‘తాజ్‌మహల్ కూల్చివేయబడకముందే మా పిల్లలకు తాజ్ అందాలు చూపించి వస్తాను’ అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరాడు. ఈయనకు నటన తెలుసు - కానీ చరిత్ర తెలియదు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన డెబ్బయి ఏళ్ల తరువాత కూడా రొమిల్లా థాపర్, విపిన్‌చంద్ర, రాహుల్ సాంకృత్యాయన్‌ల చరిత్రలు పిల్లలు చదువుకోవడం జాతి చేసుకున్న మహాపాపం. తెలుగులో కోట వెంకటాచలం, మల్లంపల్లి సోమశేఖర శర్మ, మారేమండ రామారావు వంటి తొలితరం చరిత్రకారులున్నారు పుచ్ఛా పరబ్రహ్మశాస్ర్తీ వంటి మలితరం వారున్నారు. ఆదిరాజు వీరభద్రరావు, కొమర్రాజు లక్ష్మణరావు పేరు నేడు తెలంగాణ ప్రజలలో ఎందరికి తెలుసు? మహామహులు చాలామంది ఉండగా పుర్రచేతి కుర్ర రచయితల పాత్రలు పాఠ్యాంశాలుగా ఉంచడం ఏమిటి?
ఆర్యులు విదేశముల నుండి వచ్చిరి - టిప్పు సుల్తాను గొప్ప వాడు అంటూ గిద్వానీ అనే పెద్దమనిషి రెండు పుస్తకాలు వ్రాశాడు. అందులో టిప్పు సుల్తాను కథ టెలీ సీరియల్‌గా కూడా వచ్చింది. బతికి ఉన్నప్పుడు టిప్పు కన్నతండ్రికి తిండి పెట్టనివాడు, తండ్రి చచ్చాక ఘనంగా శ్రాద్ధ కర్మలు చేశాడని ఓ సామెత. పీవీ నరసింహాను బ్రతికి ఉన్నన్నినాళ్లు అవమానించారు. పోయిన రోజున ఆయన దహన సంస్కారాలు కూడా సరిగ్గా జరపకుండా సోనియాగాంధీ చేసింది. ఇప్పుడు పి.వి.కి భారతరత్న ఇవ్వాలి అంటూ పల్లవి అందుకున్నారు. మొగల్ -ఎ- అజామ్, అనార్కలి, చిత్తోడ్ పద్మావతి వంటి చిత్రాల్లో చరిత్ర వక్రీకరిస్తే మనం అభ్యంతరం చెప్పలేదు. 2017లో సర్దార్ పటేల్ జయంతి ఉత్సవాలు చేస్తుంటే దీనిని ఎలక్షన్ స్టంట్ అన్నారు.
కోశాంబి సూడో సెక్యులరిస్టులకు పరమ ప్రాణాణికుడు. ఆయన వేదాలకు వ్యాఖ్యానం చేయడానికి సిద్ధపడ్డాడు. ఋగ్వేదంలో ఇంద్రుని పేరు ప్రధానంగా వస్తుంది. శివుడు విష్ణువు రుద్రుడు సూర్యుడు... ఇలా ఆయా అర్ధాలలో చెప్పబడింది. ఇంద్ర - వృత్త యుద్ధం - తేజస్సుకు, తమస్సుకు సూర్యుడు - మేఘమునకు - మధ్య జరిగిన సంవాదం - దీనిని కోశాంభి ఇంద్రుడు అంటే ఆర్యుడు వృత్తుడు అంటే ద్రావిడుడు - వీరిద్దరూ నీటి పంపకాల కోసం తాటిచెట్లతో యుద్ధం చేసుకున్నారు - అని వ్రాశాడు. మధ్యలో ఈ తాటిచెట్లు ఎందుకు వచ్చాయి? ఇలాంటి మిడిమిడి జ్ఞానం కలవారి చేతిలో మన పాఠ్య గ్రంథాలు పడిపోవడం దుర్మార్గం. నినే్న ఒక సెక్యులరిస్టు దర్శకుడు, నిర్మాత సంజయ్‌లీలా బన్సాలీని సమర్థిస్తూ అసలు పద్మావతి )(మేవాడ్ రాణి) కథ కల్పితం (్ఫక్షన్) అన్నాడు. ఇదీ సంగతి!!

-ప్రొ.ముదిగొండ శివప్రసాద్