సబ్ ఫీచర్

భద్రతకు ప్రాధాన్యం.. ఉగ్రవాదానికి కళ్లెం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ జనతా పార్టీ 2014లో అధికారంలోకి రాకముందు దేశంలో ఎటుచూసినా అరాచకత్వం, తీవ్రవాదం, అవినీతి, తాండవం చేస్తుండేవి. 2004-2014 మధ్య నాటి యూపీఏ 1, 2 ప్రభుత్వాలు తీవ్రవాదం విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించాయి. మైనారిటీ ఓట్ల రాజకీయంలో పడి దేశభద్రతను గాలికొదిలేసింది. నాటి ప్రభుత్వం, గత మూడు సంవత్సరాల కాలంలో రాజ్‌నాథ్‌సింగ్ హోంమంత్రిత్వశాఖను అప్రమత్తం చేసి వ్యూహాత్మకంగా దేశభద్రత విషయమై అనేక చర్యలకు ఉపక్రమించారు. జూన్ 2017నాడు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరిగిన విలేఖరుల సమావేశంలో సహచర మంత్రులతో కలిసి ఆయన గృహమంత్రిత్వశాఖ చేసిన కృషి విషయమై ఓ పుస్తకం వెలువరించారు. ఈశాన్య సరిహద్దు రాష్ట్రాలలో శాంతికై జరిపిన చర్చలు ఫలించాయన్నారు. గత 20 ఏళ్లతో పోలిస్తే 2016లో అతి తక్కువ తీవ్రవాద ఘటనలు జరిగాయి. 2014లో 824 ఘటనలు జరిగితే 2016లో 484 జరిగాయి. వామపక్ష మావోల తీవ్రవాదం 25 శాతం తగ్గిందని, హింసలో భద్రతాదళాలకు చెందినవారి మరణాల సంఖ్య 42 శాతం తగ్గిందని, వామపక్ష తీవ్రవాద దళాలు 65 శాతం తగ్గి, పోలీసులకు లొంగిపోతున్నవారి సంఖ్య 185 శాతం పెరిగిందని అందులో పేర్కొన్నారు. 2016 సెప్టెంబరులో సర్జికల్ దాడుల తరువాత చొరబాట్లు 45 శాతం తగ్గాయి. వివిధ రాష్ట్రాలలో కలసి మావోయిస్టులకు వ్యతిరేకంగా జరిపిన ఆపరేషన్ సమాధాన్ సత్ఫలితాలను ఇచ్చింది. కశ్మీరులో ప్రధానమంత్రి అభివృద్ధి ప్యాకేజీకింద కేటాయించిన 80061 కోట్లకు గాను 61112 కోట్లు విడుదల అయ్యాయి. 63 పెద్ద అభివృద్ధి ప్రాజెక్టులకు రూప మిచ్చారు. స్పెషల్ పోలీసులు ఆఫీసర్లకు ఇచ్చే మొత్తాన్ని 3వేల నుంచి 6వేలకు పెంచారు. కొత్తగా పదివేల మంది స్పెషల్ పోలీసు ఆఫీసర్లను నియమించారు. 2014 మార్చిలో సున్నగా ఉన్న ఎఫ్‌ఐఆర్ గణాంకాలు 32 శాతం పెరిగాయి. నేరగాళ్లు గుర్తింపు పెరిగింది. ఇండియా-పాకిస్తాన్, ఇండియా-చైనా, ఇండియా-బంగ్లాదేశ్ సరిహద్దులో రహదార్ల నిర్మాణం పుంజుకుంది. 200 కి.మి. మేర కంచె నిర్మాణం, 450 కి.మి మేర రోడ్లు, 647 కి.మీ. మేర ఫ్లడ్‌లైట్ల ఏర్పాటు, 110 సరిహద్దు పోస్టుల నిర్మాణం వంటివి కూడా పూర్తయ్యాయి. సరిహద్దుల్లోని ఏడు రాష్ట్రాల్లో 41 గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు. వీటిలో 24 గ్రామాలు జమ్ముకశ్మీర్‌లో ఉన్నాయి. మహిళాసాధికారత నేపథ్యంగా 33శాతం మహిళలకు కానిస్టేబుళ్ల నియామకానికి, 15 శాతం మహిళలకు సీఆర్‌పీఎప్, సీఐఎస్‌ఎఫ్‌లలో నియామకానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ‘్భరత్‌కి వీర’ పేర ఏప్రిర్ 9, 2017నాడు భారత ప్రభుత్వం ఒక వెబ్‌పోర్టల్‌ను ఆవిష్కరించింది. దేశ రక్షణలో అసువులుబాసిన అమరవీరులకు వదాన్యులైన దాతలు ఈ పోర్టల్ ద్వారా విరాళాలు అందచేయవచ్చు. కేంద్ర సైనిక బలగాల ఫిర్యాదులు పరిష్కరించేందుకు రాజ్‌నాథ్ గృహమంత్రిత్వ శాఖ నుంచి ఒక యాప్‌ను మే 11, 2017న ఆవిష్కరించారు. గత సంవత్సరం భారతసైన్యం పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో జరిపిన సర్జికల్ దాడి తరువాత అక్రమ చొరబాట్లు తగ్గాయని రాజ్‌నాథ్ భావన. స్వరంతో గాంభీర్యత, స్పష్టత, సమరశీలత రాజ్‌నాథ్ సింగ్ సొత్తు. గోరఖ్‌పూర్ విశ్వవిద్యాలయం నుంచి ఎమ్‌ఎమ్‌సి ఫిజిక్స్‌లో పట్టాపొందిన రాజ్‌నాథ్ కొంతకాలం మిర్జాపూర్‌లో లెక్చరర్‌గా పనిచేశారు. 1964లోనే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ పరిచయంతో జనసంఘ్ రాజకీయాలలోకి వచ్చిన రాజ్‌నాథ్ మూలతః వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. 2003-04లో వాజ్‌పేయి మంత్రివర్గంలో వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేశారు. అంతకుముందు 2000-02లో యూపీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2005-09 మధ్య, 2013-14 మధ్య బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. దేశ సమస్యలపట్ల చక్కని అవగాహన వున్న రాజ్‌నాథ్‌సింగ్ ఏనాడూ పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించలేదు. తాను నిర్ణయం చేసి మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ, మోదీనీ ఏనాడూ ఆయన నియంత్రించే ప్రయత్నం చేయలేదు. మోదీపట్ల అత్యంత విధేయమంత్రిగా ఆయన పనిచేస్తారు. ఇషత్ జహాన్ విషయమై పూర్వప్రభుత్వం రాజకీయం చేసి కొన్ని కాగితాలు మాయం చేసిన విషయమై ఆయన కమిటీ వేశారు. ఈ విషయంలో కాంగ్రెస్, వామపక్షాలు, కుహానా మేధావులను, ఎన్‌జీఓలను కట్టడి చేశారు. దేశ సైనికులంటే ఆయనకు ఎంతో గౌరవం. దివ్యాంగుడై సరిహద్దుల్లో ధైర్యసాహసాలు ప్రదర్శించిన ఓ జవానుడికి గౌరవపత్రం ఇస్తూ ఆయన ప్రోటోకాల్‌ను పక్కకుపెట్టి హృదయానికి హత్తుకున్నారు. తీవ్రవాదుల చేతుల్లో అనేక బుల్లెట్లు తగిలి గోద్రాజ్ దివ్యాంగుడయ్యాడు. 2014లో ఉదయ్‌పూర్‌లో జరిగిన సంఘటన ఇది. ఆయన కొడుకు పంకజ్‌సింగ్ గత యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో నోయిడా నుంచి పోటీ చేశారు. కానీ యూపీ ఎన్నికల ప్రచారంలో కొడుకు తరపున రాజ్‌నాథ్‌సింగ్ ప్రచారం చేయకూడదని భావించి నోయిడా వెళ్లలేదు. తన కొడుకు సహజంగా అతనికున్న ప్రజాభిమానం, మంచితనంతోనే ఎన్నికల్లో గెలవాలని ఆయన భావించారు. ఆయన కుమారుడు, కుటుంబాలపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఆయన వాటిని ఖండించారు. ఆరోపణల్లో ఏ మాత్రం నిజం వున్నా, రాజకీయాలను వదిలిపెడతానని అన్నారాయన. దేశంలో సాంఘిక సామాజిక సమరసతను చెడగొట్టేందుకు విదేశీ నిధులు తెచ్చుకుంటున్న సుమారు 20 వేల ఎన్‌జీఓల లైసెన్సులను ఆయన రద్దు చేయించారు. దేశ రక్షణే ఆయనకు ప్రముఖ కర్తవ్యమైంది. ఆ బాధ్యతను ఆయన చక్కగా, చిత్తశుద్ధితో నిర్వహిస్తున్నారు.

-తాడేపల్లి హనుమత్‌ప్రసాద్