సబ్ ఫీచర్

కిరాక్ స్టయిల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాజా అందాలతో.. న్యూలుక్‌తో కనిపించాలని సినీ తారలు తహతహలాడటం సహజం. ఫ్యాషన్ డిజైనర్లకు కాసులు వర్షం కురిపిస్తారు. మార్కెట్లోకి కొత్త డ్రెస్స్ వచ్చిందంటే అది వీరి మేనుపై మెరవాల్సిందే. ఫ్యాషన్ డిజైనర్లు డిజైన్ చేసిన దుస్తులను ధరించి సరికొత్త ట్రెండ్ సృష్టిస్తుంటారు. లేటెస్ట్ డిజైన్లతో వీరు ధరించిన ఫ్యాషన్ దుస్తులు కోసం ఎక్కడెక్కడో వెతకక్కర్లేదు. ఈ వారం అంతా ఎరుపు రంగుకే అందాల తారలు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తుంది కదూ! ఏదిఏమైనా అందుబాటు ధరల్లోనే, ఫ్యాబ్రిక్‌లోనే సరికొత్తగా కనిపించవచ్చని వీరు ధరించిన డ్రెస్స్‌లు నిరూపిస్తున్నాయి. సింపుల్‌గా, సూపర్‌గా కనిపించేందుకు ఫ్యాషన్ డిజైనర్లు రూపొందించిన దుస్తుల్లో మీరు కూడా మెరిసిపోవచ్చు.

ప్రియాంక చోప్రా: బాంబర్ జాకెట్, డెనిమ్‌తో పాటు ఎర్రటి బూట్లు ధరించి యువతకు కిరాక్ పుట్టిస్తుంది. శీతాకాలంలో ఈ దుస్తులు ఎవరికైనా బాగానే ఉంటాయి. మన బాడీ లాంగ్వేజ్‌కు సెట్ అవుతుంది.

కంగనా రానౌత్ : ఎరుపు లేస్ గౌనులో యువతుల మనసు దోచేసింది. కనుబొమ్మలను బంగారు వనె్నలో తీర్చిదిద్దుకుని, మృదువైన కర్ల్స్‌తో క్లాసిక్ లుక్‌లో కనిపించింది.

శిల్పాశెట్టి: బాడీ ఫిట్ కోసం యోగాసనాలతో చైతన్యం తీసుకువస్తున్న ఈ పొడుగు కాళ్ల సుందరి శిల్పాశెట్టి కూడా ఎరుపు రంగుకే ఓటేసింది. సాంప్రదాయ దుస్తులనే సరికొత్త సొగసుగా, సౌకర్యవంతంగా ఉండేలా ధరించింది. డ్రెస్స్‌కు సరిపడే షూస్‌ను సైతం ఎంపికచేసుకుంది.

తాప్సీ: తాప్సీ రెండు రకాల ఫ్యాషన్ దుస్తులను ఎంచుకుంది. సన్నటి పూల డిజైన్ వున్న డ్రెస్స్‌తో పాటు గ్లాడియేటర్స్‌కు చిన్న పోనీటైల్ జతచేసుకుంది. బ్లూకలర్ ఫ్యాంట్‌లో పోల్కా చుక్కల చొక్కాలో ఫ్యాషన్ డిజైనర్ల మనసు గెలుచుకుంది.