సబ్ ఫీచర్

జ్ఞానప్రదాయని శారదాదేవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీపంచమి సందర్భంగా ..
*
సరస్వతీ నమస్త్భ్యుం వందే కామరూపిణీ
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా
మాఘ శుద్ధ పంచమిని శ్రీపంచమి, సరస్వతి జయంతి, మదన పంచమి, వసంత పంచమి అంటారు. జ్ఞానానికి అధిదేవత సరస్వతి. శాస్త్రం, విజ్ఞానం, చదువు, కళలు, సృజనాత్మకత, వాక్కులకు సంకేతంగా సరస్వతిని పూజిస్తాము.
బ్రహ్మ వైవర్త పురాణములో వాగ్దేవిని సాత్వికమూర్తిగా, అహింసా దేవతగా, ధవళ పద్మంపై శే్వత వస్త్రాలతో ఆసీనురాలై మందస్మితై దర్శనమిస్తుందని చెప్పబడింది. సరస్వతి అనగా ప్రవాహమని కూడా అర్థం. సరస్వతీనది గురించి కూడా పురాణాలలో చెప్పబడింది. మకర సంక్రమణం తరువాత ఋతుమార్పు సంభవిస్తుంది. ఉత్తేజవంతమైన కిరణాలతో భానుడు ప్రసరిస్తాడు. ప్రాణధార అయిన జలంవల్ల తరువులు చివురిస్తాయి. తద్వారా చైతన్యవంతమైన జీవశక్తి మేలుకుంటుంది. జ్ఞాపకశక్తి, జ్ఞానం కలిగివుంటే సంపదలు కలిగివున్నట్టే.
సరస్వతి జయంతి రోజున ఉదయత్పూర్వమే నిద్రలేచి శుచియై తెల్లని వస్త్రాలు ధరించి, సరస్వతీదేవికి తెల్లని కమలాలుగానీ, తెల్లని మరే విధమైన పూలతోగాని అర్చించి, పాయసాన్నం నివేదించాలి. అలాగే సరస్వతీ కవచం పఠించటంవల్ల పాండిత్యం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం.
పరాశక్తి తొలి ఐదు రూపాల్లో సరస్వతి రూపం ఒకటి. కేవలం విద్య మాత్రమే కాకుండా సర్వశక్తి సామర్థ్యాలనూ భక్తులకు ప్రసాదించి అనుగ్రహిస్తుందని దేవీ భాగవతం వివరిస్తుంది. నవరాత్రి మరియు వసంత పంచమి ఉత్సవాలలో సరస్వతీ ఆరాధన ప్రముఖంగా ఉంటుంది.
ఆదిలాబాద్ జిల్లాలోని బాసర నిర్మల్ పట్టణానికి 35 కి.మీల దూరంలో గోదావరి ఒడ్డున వుంది. బాసరలో జ్ఞాన సరస్వతిగా కొలువై వున్న మాతకు భారతి, శారద, వాణి మున్నగు అనేక పేర్లతో అర్చించటం జరుగుతుంది. పిల్లల విద్యాభ్యాసం ఇక్కడ చేయిస్తారు. అన్ని సరస్వతీదేవి ఆలయాల్లోనూ ఈ వేడుక ఘనంగా జరుగుతుంది. అలాగే సస్యదేవత అయిన వసంతుని, ప్రేమ దేవతగా కాముని, అనురాగ దేవతగా రతీదేవిని కూడా పూజించటం కొన్ని ప్రాంతాలలో జరుగుతుంది. శివపార్వతుల ప్రేమానురాగాలను ఇనుమడింపజేసిన వసంతునికి ఉత్తర భారతంలో ప్రత్యేక స్థానం వుంది. ఆ రోజు పసుపు రంగు వస్త్రాలు ధరించి, పసుపు రంగు ధాన్యంతో తయారుచేసిన నైవేద్యాన్ని సమర్పించి పూజిస్తారు. వసంతాగమనాన్ని తేజోవంతమైన ప్రకృతితో మమేకవౌతూ బుద్ధికుశలతను కూడా కలిగి జనులు ఆనందోత్సాహాలతో జరుపుకోవడం సంప్రదాయంగా ఆచరింపబడుతోంది.

- డేగల అనితాసూరి