సబ్ ఫీచర్

రహదారి భద్రతానిధిని పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రమాదం చెప్పిరాదన్నది నగ్న సత్యం. అయితే రహదారి ప్రమాదాల దుర్ఘటనలు రోజురోజుకు పెచ్చుపెరిగిపోతున్నాయి. నిర్జీవ దేహాలు, నెత్తురోడుతున్న రహదారులు, క్షతగాత్రుల హాహాకారాలు మానవత్వమున్న గుండెల్ని పిండేస్తున్న దృశ్యాలు నిత్యకృత్యమయ్యాయ. అతివేగం, ఆపై వాహనాలు నడిపేవారు మద్యం సేవించి వాహనాలను నడపడం రెప్పపాటులో ప్రమాదం జరిగి మృత్యువుపాలవుతుండడం ఈనాటి సంఘటనలు. ప్రమాదం జరిగినా వాహనంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు, వాహన చోదకుడు ప్రాణాపాయస్థితిలో ఉన్నా, తక్షణం బాధితుల్ని ఆసుపత్రికి తీసుకువెళ్ళాలని ఆ ప్రాంత ప్రజలు, సంఘటనా స్థలానికి చేరుకొన్నవారికి ఎంతగా మనసులో ఉన్నా, పోలీసుల ప్రశ్నలు, స్టేషన్‌కు రమ్మని ఆదేశాలు, ఆపై కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుందనే భయంతో వెనకాడు తుండటం ప్రతిచోట జరుగుతున్న విషయమే.
ప్రభుత్వ వైద్యుల అభిప్రాయాల మేరకు ప్రమాదం జరిగిన వెనువెంటనే వాహనాలల్లో క్షతగాత్రులైన బాధితులు గుండె రక్తనాళాలకు, లేదా నాడీ మండలానికి తీవ్ర గాయాలవల్ల తొలి 15 నిముషాల్లోనే ప్రాణాలు కోల్పోవడం జరుగుతోంది. ప్రమాద బాధితుల్ని తొలి గంటలోపు దానే్న వైద్య పరిభాషలో గోల్డెన్ అవర్‌గా భావించి వైద్య సహాయం అందించడం ద్వారా రక్షించుకొనే వీలుంటుందని పలు అధ్యయనాలు చాటుతున్నాయి. ప్రభుత్వపరమైన నియమ నిబంధనల్ని పక్కకుత్రోసి రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని, దయతో మానవతా దృక్పధంతో వైద్యశాలలకు తరలించే సేవాదృక్పధంగల వారిపై ప్రభుత్వం ఎలాంటి వేధింపులు, విచారణ విషయంలో ఒత్తిడి తీసుకురావడం, పదే పదే పోలీస్‌స్టేషన్‌కు పిలిపించడం వంటి చర్యలు మానుకోవాలని, సేఫ్ లైఫ్ ఫౌండేషన్ లాంటి సంస్థలు కొనే్నళ్ళుగా న్యాయ పోరాటం కొనసాగిస్తూనే ఉన్నాయి. పౌరులకుగల జీవించే హక్కు కిందకే రహదారి ప్రయాణికుల భద్రత హక్కు వస్తోందన్న సర్వోన్నత న్యాయస్థానం మానవత్వానికి ప్రాణంపోసే కీలక ఆదేశాలను తాజాగా వెలువరించింది. కేంద్ర ప్రభుత్వం కూడా గత ఏడాది మేనెల 12న మార్గదర్శకాలు వెలువరించిన మోదీ ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 21వ తేదీన అందుకు సంబంధించిన నోటిఫికేషన్ జారీచేయడం, అందుకు అత్యున్నత న్యాయస్థానం ఆమోదించడం మానవతామూర్తులకు కొండంత ధైర్యం చేకూరింది. ఇక మన రాష్ట్రాల రోడ్డురవాణా వ్యవస్థను వాహనాల రాకపోకల్ని, తుప్పుపట్టి రవాణా వ్యవస్థకు ఏమాత్రం పనికిరాని వాహనాల్ని లంచాల వ్యవస్థకు బానిసలైన సంబంధిత అధికారులపై ప్రభుత్వ నిఘావేసి కఠినతరమైన ఆంక్షలు విధించడమేకాకుండా అలాంటి అధికారుల్ని ప్రభుత్వం వెంటనే విధులనుండి తొలగించి, న్యాయపరమైన విధానాలను సత్వరం చేపట్టాలి.
అభివృద్ధిచెందిన దేశాల్లో రోడ్డుప్రమాదాలు జరిగిన వెనువెంటనే ఆపద్బాంధవుల్లా సేవలందించే అంబులెన్స్ సేవల్ని భారత్‌లోకూడా విస్తృత పరిధిలో కొనసాగించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అదో అత్యయిక స్థితిగా భావించి సేవలందించే వ్యవస్థను సమకూర్చాలి. మానవతా దృక్పధంతో బాధితులను వైద్యశాలలకు తరలించిన మానవతామూర్తులను పోలీసువ్యవస్థ దర్యాప్తుపేరిట వారిని నిర్బంధించి అనుచితంగా ప్రవర్తించరాదని, కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ళ క్రితమే రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించింది. రహదారి భద్రతకోసం సమగ్ర చట్టం తీసుకొస్తున్నామని ప్రకటించిన యూపీఏ ప్రభుత్వం తర్వాత చేతులెత్తేసింది. రోడ్డు ప్రమాదాలవల్ల స్థూల దేశీయోత్పత్తి పరంగా నాలుగు లక్షల కోట్లు నష్టపోవడమే కాకుండా, ఏటా లక్షన్నర మందిని రహదారులు బలిగొంటున్నట్లు అధికారిక గణాంకాలే తేటతెల్లం చేస్తున్నాయి. ప్రమాదాల్లో క్షతగాత్రులైన వారికి సుప్రీంకోర్టు మార్గదర్శాలమేరకు వైద్యసేవల వ్యయాన్ని ప్రమాద బాధితులు వాయిదాల పద్ధతిలో చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నట్లు భారతీయ వైద్య సంఘం పేర్కొంది. ప్రమాద బాధితులకు ఆర్థికపరమైన స్థితిలేని పక్షంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే ప్రమాద బాధితులకు పాతికవేల రూపాయలు భరించాలి. ఈమేరకు ఇటీవలే కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా రహదారి ప్రమాద క్షతగాత్రులకు రహదారి భద్రతా నిధిని మరింతగా పెంచాలి.

- దాసరి కృష్ణారెడ్డి