సబ్ ఫీచర్

అల్పపదాలతో అనల్పమైన భావన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వానకు తడవని వారు వేమన పద్యం విననివారు ఎవరూ ఉండరు. లోకంలో ఉన్నవారందరి గురించి చిన్న చిన్న పద్యాల్లో ఆటవెలదుల్లో తేటగీతుల్లో విడమర్చి చెప్పినవాడు వేమన. వేమన మీద ఎన్నో పరిశోధనలు కూడా జరిగాయి. అల్పపదాలతో అనల్పమైన భావనను కూర్చి చెప్పాడు. వేమన ముందు కాలంలో మహాభోగిగా ఉన్నాడు. తర్వాతి కాలంలో యోగిగా మారాడు. దేశ సంచారిగా ప్రజలకు దగ్గరయ్యాడు. వారి స్థితిగతులను తెలుసుకొన్నాడు. వేమన గురించి సి.పి.బ్రౌను నుంచి వంగూరి సుబ్బారావు, వావిళ్ల వెంకటేశ్వరరావు, బండారు తమ్మయ్య, ఆరుద్ర, రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, వేమూరి విశ్వనాథ శర్మ, కొమరాజువెంకట లక్ష్మణరావు, పంచాగ్నుల ఆదినారాయణ శాస్ర్తీ, కట్టమంచి రామలింగారెడ్డి ఇలా ఎందరెందరో పరిశోధనలు చేసి ఎన్నో విషయాలు జనం ముందుంచారు. ఆత్మ, కుల, ఆర్థిక సంస్కారాలను ప్రబోధించారు. పరుసవేది కోసం వెతుకులాడిన వేమన మానవులకుండవలసిన అసలైన పసిడి పలుకులను అందించాడు.