సబ్ ఫీచర్

గురువుతో చెలిమి జన్మజన్మల కలిమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గురువు ఉపదేశాలు, బోధలు, గుంభంగా, గంభీరంగా అన్యాపదేశంగా, నారికేళ పాకంలా క్లిష్టంగా కష్టంగా ఉంటాయి. గోదావరి నీళ్లలా స్వచ్ఛంగా ఉంటాయి. తెలుగింటి ఇడపడచుల్లా పవిత్రంగా ఉంటాయి. పల్లెటూళ్లల్లోని మలయ మారుతాల్లా పరిమళభరితంగా ఉంటాయి.
గురువు ప్రబోధ ఉపనిద్వాహినిలా ఉంటుంది. ఒక్కొకక పదం ఒక్కో బ్రస్మసూత్రమవుతుంది. అపతిమాటా ఒక మంగళ గీతంలా మార్మోగుతుంది. ప్రతివాక్యం ఓ సత్యకావ్యమవుతుంది.
గురువు ఓ అనంత శక్తి, తేజోమయ దీప్తి!!
గురువు పలికే ప్రతి పలుకు భావికి ఓ పిలుపు అవుతుంది. జీవితానికో మలుపు అవుతుంది. మనకున్న బలహీనతల పాలీట పిడుగవుతుంది. మనలో ఉండే మలిన భావ తరంగాలపైన ఓ ఉరుము అవుతుంది. గురువు నోట బయటపడేది పదాలు, పదాయల వరదలుకావు. మరకత మాణిక్యాల రాసులు. గురువు ఇచ్చే వాక్యాల విభూతులు. మనలో దివ్యమైన తరంగాలిన సృష్టిస్తుంది. సందేశ తరంగిణిలో తానమాడిస్తుంది.
గురువుబోధ ఎడారుల వంటి గుండెల గుడారాల్లో అమృత బిందువుల్ని కురిపిస్తుంది. ఆనంద సింధువుల్ని ఒలికిస్తుంది. విశ్వప్రేమ విత్తుల్ని నాటుతుంది.
గురువు అనురాగంలో హింసకి, క్రౌర్యానికి కుఠిలత్వానికి ఆలవాలమైన మనసులలో కారుణ్య వాహినుల్ని ఉత్పన్నం చేస్తుంది. తప్పు చేసిన సొంత బిడ్డని, తల్లి లాలించి, సవరించి, సంస్కరించి , మంచిగా మారుస్తుంది. నవజీవంగా, హృద్యంగా మనల్ని ముస్తాబు చేస్తుంది. గురువులో ఓ నవ్యత, ఓ ప్రత్యేకత , ఓ విశిష్టత ఉంటుంది.
గురువుతో చెలిమి జన్మజన్మల కలిమి గరువు ప్రేమ అనే జలధిలో మనల్ని ఓలలాడిస్తాడు. అనిర్వచనీయమైన అనంతలోకాలలో, పసందైన విందు భోజనాలందిస్తాడు.
గురువులో చెక్కిలిగిలి పెట్టే ఛలోక్తులుంటాయి. ‘చమక్కు’లను అందించే చతురోక్తులుంటాయి. లాస్యాన్ని పండించే హాస్యోక్తులుంటాయి. గురువు వ్యంగ్యం బాణంలా మనసులో గుచ్చుకోదు. శిష్యుడి హృదయాన్ని తుక్కునియలు చేయదు. హృదయాన్ని హత్తుకుంటుంది. గంధాన్ని పూయిస్తుంది. సుగంధాన్ని వెల్లివిరిసేలా చేస్తుంది. మనందరి దృష్టి గురువు సృష్టించిన సృష్టిమీద ఉంటే, అతని దృష్టి మనమీద ఉంటుంది. మన ప్రవృత్తుల్ని నివృత్తి చేసే దిశలో ఉంటుంది. ఆయన దృష్టి- మనలో పరివర్తన కోవసం పరితపిస్తుంది. ప్రయత్నిస్తుంది. పరిశీలన చేస్తుంది. పరిశీలన చేస్తూ ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. మనల్ని జ్ఞానమూర్లుగ, సుజ్నా స్ఫూర్తులుగా మార్చేందుకు అనుక్షణం ఆరాటపడుతూ ఉంటుంది.
మొత్తంగా గురువు దారి తప్పి ప్పటడుగులు వేసే మనల్ని పశ్చాత్తాపంతో పవిత్రుల్ని చేస్తాడు పునీతుల్ని చేస్తాడు. జీవిత గమ్యం వైపు నడిపిస్తాడు. అంతిమ లక్ష్యాలను దర్శింపజేస్తాడు దివ్యత్వంతో అలరిస్తాడు. మనలో పరివర్తననకి తెప్పిస్తాడు. కర్తవ్యం బోధిస్తాడు. మనల్ని ‘పర’తత్త్వం వైపు పయనించేలా చేస్తాడు.
జీవితాలకు గురువు ఓ అర్థాన్ని, పరమార్థాన్ని, పర అర్థాన్ని, చరితార్థాన్ని ఆపాదింపజేసి మనల్ని తరింపజేస్తాడు. పూర్ణత్వాన్ని ప్రసాదిస్తాడు. పరిపూర్ణత్వాన్ని అనుగ్రహిస్తాడు.
అతడు- గురువు సద్గురువు జగద్గురువు.
అతడు గీతాకారుడు కావచ్చును. ఆదిశంకరులు కావచ్చు. మరొకరు కావచ్చు. రూపాలే వేరు స్వరూంప మాత్రం ఒక్కటే!

- రమాప్రసాద్ ఆదిభట్ల 9348006669