సబ్ ఫీచర్

పేదల ఇంటికి వంట గ్యాస్ చేరాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐదు కోట్ల గ్యాస్ కనెక్షన్లను ప్రధానమంత్రి ఉజ్వల యోజన పేర పేదలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థిక మంత్రిత్వశాఖ స్పందించి రెండు వేల కోట్లను ప్రస్తుత బడ్జెట్‌లో కేటాయించింది. మరో రెండేళ్ళు ఈ పథకం క్రింద 6వేల కోట్లను ఖర్చుచేయనుంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన డిపాజిట్ లేని వంట గ్యాస్ పథకం. స్టవ్, రెగ్యులేటర్, సిలెండర్లు సొమ్మును విడతలుగా చెల్లించే సదుపాయాన్ని కూడా కల్పించారు. ఇది మహిళాభివృద్ధిని వేగిరపరచే చర్య. వారి ఆరోగ్యం మెరుగుపరచే కార్యక్రమం. పుల్లలు, పేడ, ఆకులు, బొగ్గులతో సంప్రదాయ మట్టి పొయ్యిపై వంట చేస్తే పొగ వెలువడుతుంది. వంట ఇంటి పొగ సంవత్సరానికి 13 లక్షల మంది స్ర్తిలను అకాల మరణాలకు గురిచేస్తున్నది.
పరిశుభ్రమైన వంట ఇంధనం అందుబాటుపై గత ఏడాది ఇంధనం, పర్యావరణ, నీటి కౌన్సిల్ ఐదు రాష్ట్రాల్లో విస్తృతమైన సర్వే జరిపింది. నూటికి 95 మంది గ్రామీణ పేదలు వంట గ్యాస్ కొనే స్థితిలో లేరని ఆ కౌన్సిల్ అంచనాగట్టింది. ఉజ్వల యోజనతో పేదల ఇంట పరిశుభ్రమైన వంట ఇంధనం రానున్న మూడేళ్ళలో అందుబాటులోకి రాగలదు. ఆ రకంగా చూస్తే ఇది మెచ్చదగిన పథకం. వంట గ్యాస్ వాడకానికి పేదలు మరలడానికి డిపాజిట్, ఇతర వెసులుబాటులు మాత్రమే చాలవు. తొలగించాల్సిన మరికొన్ని అడ్డంకులూ వున్నాయి. వాటిపైకి కూడా చూపు సారించాలి. ప్రధానమైంది పేదలు నెల నెలా 14.2 కేజీల గ్యాస్ సిలెండర్‌ని కొనలేకపోవడం.
వంట గ్యాస్ వినియోగ అవసరాన్ని పేదలు గుర్తించేలా చేయాలి. ఆదాయ వనరుల పెరుగుదలపై కూడా ప్రభుత్వం యోచించాలి. వంట గ్యాస్ వినియోగించడం చాలా తేలిక. వంట వేగంగా చేయవచ్చు. సమయం కలిసొస్తుంది. కిటికి తలుపులు తెరచి వంట చేయడం, పని ముగియగానే రెగ్యులేటర్‌ను ఆపుచేయడం వంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఈ ఇంధన వినియోగాన్ని ప్రమాద రహితం కావించుకోవచ్చు. పొగరాదు కనుక ఆరోగ్యకరం. గత సంవత్సరం బహిరంగ మార్కెట్ గ్యాస్ సిలెండర్ సగటు ధర 670 రూపాయలుంది. నలుగురుండే కుటుంబం ఇంధనాన్ని పొదుపుగా వాడితే 40 రోజుల వరకు వస్తుంది. ఒక రోజుకు వంట ఇంధనం ఖర్చు 20రూ. లోపే వుంటుంది. కాని సంవత్సరానికి 7వేల రూపాయల పైచిలుకు గ్యాస్‌కోసం ఖర్చుచేయడం పేదలకు భారమే. 5 కేజీల చిన్న సిలెండర్ ప్రవేశపెడితే ఈ లెక్కన 2వారాల వాడకానికి సరిపోతుంది. నెలకు 2 సిలెండర్లు అవసరవౌతాయి. గ్రామీణ పేదలకు, మురికివాడల్లో బ్రతుకులు దీనంగా వెళ్ళదీస్తున్నవారికి ప్రస్తుతం ఇస్తున్న రాయితీ కంటే ఎక్కువ ఇవ్వడం కూడా మంచిదే. గ్యాస్ సబ్సిడీని నేరుగా లబ్దిదారుని బ్యాంకు ఖాతాకు గత కొన్ని నెలలుగా చెల్లిస్తున్నారు. ఈ విధానం మారుమూల గ్రామస్తులకు, గిరిజనులకు ఇబ్బంది కలిగిస్తుంది. మండల కేంద్రాల్లోనే బ్యాంకులున్నాయి. నెలకు రెండుసార్లు రాయితీకోసం బ్యాంకులకు వారు వెళ్ళలేరు. మొబైల్ ద్వారా మనీట్రాన్స్‌ఫర్ చేస్తే వారికి శ్రమ తగ్గుతుంది. గ్యాస్ డీలర్లు కూడా మండల కేంద్రాల్లోనే వున్నారు. గ్యాస్ పంపిణి దాదాపు పట్టణాలకు, కొన్ని అభివృద్ధిచెందిన ప్రాంతాలకే పరిమితం. గ్రామీణులు అందరూ డీలర్లు దగ్గరకు వచ్చి గ్యాస్ కొనుగోలుచేయడం కష్టం. మండలంలో కనీసం 30 గ్రామాలున్నాయి. మండల కేంద్రానికి 2-12 కిలోమీటర్ల దూరంలో వినియోగదారులుంటారు. గ్రామాల్లో ఎక్కువ మంది డీలర్లను నియమించాలి. ఆటో, సైకిళ్ళపై వినియోగదారుల ఇంటికి సరఫరాచేయించాలి. సరఫరా ద్వారా గ్రామాల్లో కొందరికి ఉపాధి లభిస్తుంది. రవాణా చార్జీలను ప్రభుత్వమే భరించాలి.
గ్యాస్ పొందడానికి ఎలా దరఖాస్తుచేసుకోవాలో సామాన్యులకు తెలియదు. దరఖాస్తు పద్ధతిని ప్రచారం చేయాలి. పేదలకోసం తాత్కాలిక సహాయ కేంద్రాల ఏర్పాటు అవసరమే. పెట్రోలు పంపుల దగ్గర, కిరాణా షాపుల్లో 5 కేజీల సిలెండర్ల అమ్మకంపై గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయతే చిన్న సిలెండర్లు అమ్మే కొత్త డీలర్లను గ్రామాల్లో నియమించడం ద్వారా గ్రామీణులకు గ్యాస్ త్వరగా చేరుతుంది. స్థానిక ప్రభుత్వ యంత్రాంగం సరఫరాపై కన్నువేసి వుంచితే పేదలకు వంట ఇంధన చిక్కులు తీరుతాయి.

- వి.వరదరాజు