సబ్ ఫీచర్

మీరు చెప్పేది మంచేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అమ్మా అమ్మా నేను గెలిచాను’ ఆనందంగా పరుగెత్తివచ్చి చెప్పింది చందన.
‘వెరీగుడ్. వెరీగుడ్ . నువ్వుగెలుస్తావని నాకు ముందే తెలుసు.’అంది హరిణి.
అక్కడే ఉన్న నాకు ఆశ్చర్యమూ ఆనందమూ కలిగాయి. ‘ఏమిటో విశేషం’అని అడిగాను.
అప్పుడు చెప్పుకొచ్చింది హరిణి. ఈ మధ్య మా అమ్మాయి అన్నింటిలోను వెనుకబడిపోతోంది. మార్కులు తెచ్చుకోవడంలోను అట్లానే ఆటల్లోపాటల్లో అన్నింటిలోను వెనుకబడిపోతోంది. అందుకే నేను ఇలా చేసాను అంది హరిణి.
ఎలా అన్నాను నేను
నేను వాళ్ల స్కూల్‌కు వెళ్లాను. వాళ్ల టీచర్‌తో ఈ విషయం అడిగాను. తను పూర్తిగా చదవడం లేదు. ఇంపార్టెంట్ చెప్పండి అంటుంది. పూర్తిగా పాఠాలు చదివాలి కదా అంది ఆమె.
నిజమే కదా అనబోయాను అంతలో హరిణి
మనం ఇంత డబ్బు కట్టేది పాఠాలు అన్నీ చదవడానికా? ఫస్ట్ తెప్పిస్తాం అంటేనే కదా వాళ్లస్కూల్‌లో చేర్పించింది. అందుకే గట్టిగా కోపడ్డాను. అంతగా అయితే మా అమ్మాయిని వేరే స్కూల్‌లో చేర్పిస్తాను అని అన్నాను. దెబ్బకి దయ్యం దిగింది వాళ్ల ప్రిన్సిపాల్ వచ్చేశారు. నన్ను బతిమిలాడి మీ అమ్మాయి ఫస్టు రావడానికి ఒక ఉపాయం చెప్తాను. సాయంత్రం పూట ఎక్‌ట్రా క్లాసులు పెడతాము. అందులో చదివించినవి మాత్రమే చదవమని చెప్పండి. అవే పరీక్షల్లో వస్తాయి. అపుడు మీరు అనుకొన్నట్టు జరుగుతుంది అన్నాడు.
సరే అని వచ్చాను. ఎక్స్‌ట్రా క్లాసులకు పంపుతున్నాను. అందుకే అటు మార్కులు ఆటల్లోను అంతే దీని చేత ఎక్కువ ప్రాక్టీసు చేయిస్తున్నారు. ఫస్టు వస్తోంది. మనం డబ్బు లు సంపాదించి వీరికి ఇచ్చేది మన పిల్లల బాగుకోసమే కదా. తన ధోరణిలో హరిణి చె ప్పుకుపోతుంది.
ఒక్కసారి హరిణి ఆత్మ పరిశీలన చేసుకొంటే... ఒక్క హరిణేకాదు చాలామంది తల్లిదండ్రులిలానే ఆలోచిస్తున్నారు. వారంతా ఒక్కసారి...
మీ అమ్మాయినైనా అబ్బాయినైనా ఫస్టు రావాలంటే మీరు పక్కదోవకు వెళ్లడమే మార్గమా? వారిని నిజంగా కూర్చుని మరింత సేపు చదివిస్తే వారిలో పట్టుదల పెరుగుతుంది. పైగా పాఠం మొత్తం అర్థమయి అనుకోని ప్రశ్న ఎదురైతే కూడాదానికి వారు జవాబు చెప్పగలిగే నేర్పును పొందుతారు కదా.
అంతేకాదు ఎపుడూ ఫస్టు రావాలనుకోవడం సబబా. గెలుపోటములు జయాపజయాలు ఒక్కరి సొత్తుగా ఉంటాయా? గెలుపును, ఓటమి కూడా సమానంగా భావించాలని నేర్పించే సమయం ఇదేకదా. రేపొద్దున జీవితంలోఅనుకోని పరిస్థితులు వస్తే వారు దానికి తట్టుకొని నిలబడే శక్తిని ఈ పరీక్షలు వీరిని సమాయత్తం చేస్తున్నాయని అనుకోవచ్చు కదా.
తిరిగి వారే చదివిన పాఠమే చదివితే పరీక్షల్లో మంచి మార్కలుతెచ్చుకుంటే లోపం ఎక్కడుందో వారికే తెలుస్తుంది. అపుడు పరిష్కారమూ వారికే తెలుస్తుంది. ఇట్లా చేయడం పద్ధతే కదా. అంతే కాదు ఆత్మవిశ్వాసాన్ని చిన్నప్పటి నుంచి నేర్పించాలి. ఏ పరిస్థితులనైనా ఎదుర్కొనే శక్తిని బాల్యంలోనే నూరిపోయాలి. అంతేకాని సులువైన మార్గాలు అంటూ పక్కదోవలకు మార్గం చూపించకూడదు.
మనం సంపాదించేది పిల్లలకోసమే కాని వారి భవిష్యత్తును రాణింపచేయడానికి పనికి రావాలి కాని వారిని బొమ్మలను చేసి ఆడించడానికి కాదుకదా. పిల్లలతో మనం నిజం మాట్లాడడం, సత్యానే్న ఎప్పుడూ చెప్పాలని చెప్పడం లాంటివి నేర్పించడమూ పెద్దలదే బాధ్యత. రేపటి విజయం కావాలంటే ఈరోజు పూనిక కావాలి. శ్రమ కావాలి. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు కదా. చిన్నప్పటినుంచి కష్టపడడం, నిజం మాట్లాడడం, ఎదుటివారికి సాయం చేయడం నేర్చుకొంటే వారు పెద్దైన తర్వాత ఏ పరిస్థితులనైనా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు. విజయాన్ని పొందుతారు. అప్పుడు తల్లిదండ్రులుగా మీరు పొందే ఆనందానికి కూడా హద్దులుండవు.

- గౌరి