సబ్ ఫీచర్

మెరిసే అందానికి గాజుల మెరుపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్ర్తిలకు సౌందర్యంతో విడదీయలేని సంబంధం ఉంది. నేటి ఆధునిక కాలంలో సైతం మహిళలు సౌందర్యం పట్ల ఆసక్తి చూపుతున్నారు. మహిళల సౌందర్యాన్ని ఇనుమడింపజేసేవాటిలో గాజుల పాత్ర అత్యంత కీలకమైనది. గాజులు ధరించడం అనేది భారతీయ సంప్రదాయంలో ఒక భాగం. ప్రస్తుతం పాశ్చాత్య దేశాలలో సైతం మహిళలు గాజులు ధరించడానికి ఆసక్తి చూపుతున్నారు.
గాజులు వివిధ పదార్థాలతో తయారుచేస్తారు. అందరికీ అందుబాటులో ఉండే గాజులు గ్లాసుతో తయారుచేసినవి. లక్క, పూసలతో కూడా అత్యంత ఆకర్షణీయంగా గాజులు తయారుచేస్తారు. ప్రస్తుతం వైర్, బోన్స్ (ఎముకలు లేదా దంతాలు), చెక్క, ప్లాస్టిక్ తదితరాలతో గాజులను రూపొందిస్తున్నారు. ధనవంతులు బంగారం, వెండి, ప్లాటినమ్ వంటి ఖరీదైన లోహాలతో గాజులు తయారుచేయించుకొని, అందులో వజ్రాలు, కెంపులు, పచ్చలు, నీలం, తదితర రాళ్ళను ఏర్పాటుచేయిస్తారు.
ఉత్తరభారతదేశంలో వివాహ సమయంలో గాజులు వేయడం (పెళ్లికుమార్తెకు) ఒక ప్రత్యేక కార్యక్రమంగా నిర్వహిస్తారు. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా కొందరు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పంజాబు రాష్ట్రంలో వివాహ సమయంలో పెళ్లి కుమార్తెకు ఎరుపు రంగు డిజైన్ గాజులు ధరింపజేస్తారు. రాజస్థాన్‌లో మహిళలు చేతినిండుగా గాజులు ధరించడం సంప్రదాయం. పశ్చిమ బెంగాల్‌లో మహిళలు తెలుపు, ఎరుపు రంగువి, లక్క, సముద్రపు గవ్వలతో తయారుచేసిన గాజులు వేసుకొంటారు. మహారాష్ట్ర, గోవాలలో మహిళలు ఆకుపచ్చ గాజులు ధరించడం శుభసూచకంగా భావిస్తారు. గర్భిణీలకు నిర్వహించే శ్రీమంతం కార్యక్రమంలో గాజులదే కీలకపాత్ర.
ఐదు వేల సంవత్సరాల క్రితమే మన దేశంలో మహిళలు గాజులు ధరించడం ప్రారంభం అయింది. సింధు నాగరికతలో ప్రజలకు నగలు, గాజులు తయారీలో ప్రత్యేక నైపుణ్యం వుంది. మన దేశంలోని ఫిరోజాబాదు గాజుల తయారీకి ప్రసిద్ధి. ఇక్కడ వెయిట్‌లెస్ బ్యాంగిల్స్ (బరువు లేని గాజులు) కూడా తయారుచేస్తారు. హైదరాబాద్‌లోని లాడ్‌బజార్ రాళ్ళు పొదిగిన గాజుల తయారీ కేంద్రంగా విరాజిల్లుతుంది. ఇక్కడ 20 రూపాయల నుండి ఐదు వేల రూపాయలు ఆపైన ధరలకు గాజులు లభిస్తాయి. పెయింటింగ్స్ వేసిన గాజులకు కాశ్మీర్ ప్రసిద్ధి. మొగల్ రాజుల కాలంనుంచి లక్నో, ఢిల్లీ నగరాలు వజ్రాలు పొదిగిన బంగారం గాజులకు ప్రసిద్ధి. రాజస్థాన్‌లోని జైపూర్‌లో గాజులు విక్రయించడానికి ప్రత్యేకంగా ఒక మార్కెట్ ఉంది. మగువుల మనస్సులను దోచుకొన్న గాజుల కథ ఇది.

- పి.హైమావతి