సబ్ ఫీచర్

సర్వచైతన్య స్వరూపిణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీమద్భాగవతము -శ్రీ దేవీ భాగవతముల రెండింటిని వేదవ్యాస మహర్షి రచించారు. ఒక దానికి శ్రీమత్ అని మరొకదానికి శ్రీదేవి అని చేర్చబడ్డాయి.్భగవతం అన్న పదం రెండింటిలోను ఉంది. శ్రీమద్భాగవతం విష్ణుకథలతో నిండి ఉంటుంది. శ్రీదేవీ భాగవతం శ్రీదేవిని గూర్చిన కథలతో ఉంటుంది. రెండూ భక్తి ప్రధానములే.
భగవంతుడు అని పుంలింగములో చెప్పిన, భగవతి స్ర్తి లింగంలో చెప్పిన ఒకటే. శ్రీ అనగా శుభకరం. శ్రేయొదాయకం అని అర్థం. దేవీ అనే పదం దివ్ ధాతువు నుండి వెలువడినది. అనగా ప్రకాశము లేక చైతన్యము అని అర్థం. వేదాన్ని వేదమాత అని పిలుస్తాం.
అంతటి విశిష్టత గలిగిన అమ్మవారు సృష్టి కార్యంలో ప్రకృతి ప్రకృతిలో ప్ర- సత్వగుణాన్ని కృ - రజోగుణాన్ని తి- తమోగుణాన్ని తెలియజేస్తుంది. కనుక ఆమె త్రిగుణాత్మిక. ఆమె దుర్గ మొదలగు పేర్లతో పిలువబడుతుంది. శివరూప, శివప్రియ, సర్వ చైతన్య రూపిణి అని దేవతలు కీర్తిస్తూంటారు. శరణాగతులను, దీనులను, ఆర్తులను ఆదరించే కరుణామయి శ్రీదేవి, సకల శక్తులు ఈ మహాదేవి యందు అంతర్భూతంగా ఉంటాయి.
అటువంటి దేవిని సూర్యచంద్ర వంశపు రాజులందరూ పూజించారు. మానవుడు శ్రీదేవి నిష్ఠుడు. శ్రీమాతృ పూజా తత్పరుడై యుండవలెనని వేదాంతభేరి మ్రోగుచున్నది. సౌందర్య రూపిణి అయిని అమ్మవారిని శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో ‘‘శివశక్త్యాయుక్తో యదిభవతి శక్తః ప్రభవితుం’’ అని పేర్కొన్నారు. అనగా శక్తి లేనిదే శివుడు చైతన్యవంతుడు కాలేడని తెల్పారు. అలాగే బ్రహ్మ విష్ణువులు కూడా అంటూ అమ్మవారి శక్తిని కీర్తించారు. ఆ తల్లియందు చిత్తము లయము నర్చుటయే భక్తి, ఆరాధన అగును. అట్టివారే పరాశక్తి భక్తులు అగుదురు. శ్రీమాత మనలనంటి పట్టి అనుక్షణం దారిచూపిస్తూ కన్నతల్లి లాగా కాపాడుతూ ఉంటుంది. అటువంటి తల్లిని ఈ విధంగా ఆరాధిద్దాం. ఓం సర్వచైతన్యరూపాం , తాం ఆద్యాం విద్యాంచ ధీమహి, బుద్ధిం యానః ప్రచోదయాత్ .. ఆ దేవి మనందరి బుద్ధి తత్వములను ప్రేరేపించును. ప్రేరణకు మూలము సంకల్పము. అనగా ఇచ్ఛబుద్ధి అనగా జ్ఞానము. అనగా ఇచ్ఛకు సంబంధించిన ఆయా కృత్యములను గూర్చిన పరిజ్ఞానము. ఆ పరిజ్ఞానము వలననుసరించుటయే క్రియలు జరుగుతూ ఉంటాయి. ఆవిధంగా ఇచ్ఛా, జ్ఞాన క్రియలలోని మూడును దేవి యొక్క రూపములే.

- యామిజాల సుబ్రహ్మణ్యశర్మ