సబ్ ఫీచర్

వివేకుని వివేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆళ్వారు మహారాజు: బాబూజీ మహారాజ్! నాకు విగ్రహారాధన యందు విశ్వాసము లేదు. నా గతి యేమగును? అని నవ్వెను.
వివేకానంద స్వామి: మీరు హాస్యమునకు మాట్లాడుచున్నట్లున్నారు.
ఆళ్వారు మహారాజు: లేదు, స్వామీజీ! అనేకులు రాళ్లకు కొయ్యకు, మట్టికి, లోహములకు మ్రొక్కుదురు. నేను అట్లెన్నడు చేయ జాలను. ముందు గతి నాకు దుర్గతి అగునా? అనగా వివేకానంద స్వామి సరే ఎవరెవరి విశ్వాసమునకు తగినట్లు వారి వారికి గతులు కల్గుచుండును అనగ గోపాల కృష్ణుని విగ్రహము ఎదుట సాష్టాంగ నమస్కారమొనర్చి కన్నుల వెంట ఏకధారగా నీరుగార్చి ఆనంద మయుడైన వివేకానంద స్వామి వారే ఇట్టి ప్రత్యుత్తరమిచ్చి నందుకు దగ్గర నున్న వారి మనస్సులకు అలజడి కలిగెను. అంతలో స్వామి వారు అచ్చటనే గోడపై అమర్చబడి యున్న చిత్తరువు నొకటి తీయించి ఇది యెవ్వరి దని ప్రశ్నించగా అది మహారాజుగారిదని దివాను ప్రత్యుత్తరమిచ్చెను.
వివేకానంద స్వామి వారు ‘‘దానిపై ఉమ్మి వేయుము’’ అని దివానును హెచ్చరించుటయే గాక, అక్కడ ఉన్న వారిని చూచి ‘‘మీ రెవరైనను దీనిపై ఉమ్మ వచ్చును ఏమున్న దిందులో? ఇది ఒక కాగితపు ముక్కయే కదా? మీకేమి ఆటంకమున్నది? అభ్యంతరమేమియు లేదు ఉమ్మి వేయుడు’’ అని హెచ్చరించగా అందరును దిగ్బ్రాంతులై వణుకుచు, భయమొందుచు అటు ఇటు చూచు చుండిరి. వివేకానందస్వామి వారు మరల దివానును చూచి ‘‘నేను చెప్పుచున్నాను కదా! ఉమ్మి వేయుడు’’ అని బలవంత పెట్టగా
దివాను: స్వామి వారిని చూచి ‘‘స్వామీజీ! మీరేమి చేయమనుచున్నారు? ఇది మా మహారాజుగారి చిత్తరువు, నేనటువంటి నీచ కార్యము ఎట్లు చేయగలను? అని ప్రత్యుత్తర మిచ్చెను.
వివేకానంద స్వామి: ‘‘అటులైన మీ మహారాజు ప్రత్యక్షముగా దేహము ధరించి లేరు కదా! అది ఒక కాగితపు ముక్క మాత్రమే. ఆయన ఎముకలు గాని, రక్తముకాని, మాంసము గాని ఇందులో ఏమియు లేవు, మాట్లాడదు, నడువదు,కదలదు, ఐనను మీరు ఉమ్మి వేయుటకు భయపడుచున్నారు. ఎందువలన? మహారాజుగారి ఆకారమందులో ఉండుట చేతనే! నిజమునకు దానిపై ఉమ్మినచో మీ మహారాజును అగౌరవ పరచినట్లు తలంచుచున్నారు’’ అని పలికిన తోడనే అందరి గుండెలు కొంచెము కుదుట పడెను.
వివేకానంద స్వామి:
మహారాజా! చూడుడు ఒక విధముగా మీరే కాగితము కాకపోయినను ఒక విధముగా మీరే యగుదురు. కావుననే మీ సేవకులు భయము నొందిరి. ఆ పటము నొకసారి చూడగనే మీరే వారలకు జ్ఞాపకమునకు వత్తురు. కావుననే వారు దానిని మిమ్ముగానే భావించుచున్నారు. రాతి విగ్రహాలకు గాని, లోహపు విగ్రహములకు గాని, మ్రొక్కు వారు కూడా ఇట్లే ఉందురు. విగ్రహము వారి యొక్క ఇష్ట దైవమును మనస్సులకు జ్ఞప్తికి తెచ్చును. అది ఏకాగ్రతకు సాధనమగును. నేను చాలా చోట్ల సంచారము చేసితిని గాని, ఎక్కడను ‘‘ఓ రాయి! ఓ కర్రా! ఓ లోహమా! నా యందు దయ యుంచుము. నా కోర్కెలను తీర్చుము’’ అని ధ్యానించిన వాని నొక్కరి నైనను చూడలేదు. ఒక్క భగవత్ శక్తియే వారివారి మనఃపరిశుద్ధతను బట్టి వారు కోరిన రూపములతో దర్శన మిచ్చుచుండును. కావున విగ్రహారాధన చితె్తైకాగ్రతకు తోడ్పడును.
ఆళ్వారు మహారాజు: ‘‘జనకా! విగ్రహారాధనము గురించి నాకింత చక్కగా బోధపరచిన వారెవ్వరును లేరు. దాని భావము నాకిన్నాళ్లును బోధ పడలేదు. నేడు నాకు జ్ఞాననేత్ర మిచ్చితిరి’’ అని చేతులు జోడించి నిలబడెను.అన్ని మతముల వారును నిర్గుణారాధనము పేరుతో సగుణారాధనయే చేయుచున్నారు. సూక్ష్మ దృష్టితో మతానుష్టానుములు గమనించినవారికిది తెలియకపోదు.

-వడ్డూరి రామకృష్ణ 9959117167