సబ్ ఫీచర్

తరగతి గది.. బుద్ధిజీవుల సమూహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమాజాన్ని అన్ని కాలాల్లో కూడా తీర్చిదిద్దేది ‘ప్రశే్న’. అందుకే యక్షప్రశ్నలు అడుగుతూ.. మనసును నియంత్రించేది ఎట్లా? అని కొందరు అడుగుతారు. చిన్న పిల్లలు కూడా ప్రతి అడుగునా ప్రశ్నిస్తారు. ‘బడికి ఎందుకు పోవాలమ్మా?’- అని ప్రశ్నిస్తారు. ఇలా పిల్లలు తల్లిని యక్షప్రశ్నలడుగుతారు. తల్లులు సమాధానం చెప్పలేక ఉక్కిరిబిక్కిరై పోతారు. తరగతి గదిలో కూడా విద్యార్థికి ఎన్నో ప్రశ్నలు అడగాలని ఉత్సుకత ఉంటుంది. రీజనింగ్ (హేతుబద్ధత)ను పెంచటానికి పిల్లలు వేసే ప్రశ్నలను ఉపాధ్యాయుడు దాటవేయకూడదు. ‘సరుకులు దగ్గర ఉన్న దుకాణం నుంచి కాకుండా దూరంగా ఉన్న దుకాణం నుంచి తెమ్మని అంటావెందుక’ని పిల్లవాడు ప్రశ్నిస్తాడు. ‘అక్కడైతే కల్తీలేని వస్తువులు దొరుకుతాయి నాయనా’ అని తల్లి సమాధానం చెబుతుంది. వెంటనే- పిల్లవాడు ‘కల్తీ అంటే ఏమిట’ని అడుగుతాడు. బియ్యంలో రాళ్లు కలపటం కల్తీ అని తల్లి చెబుతుంది. ఈ రాళ్లు ఏ చెట్టుకు కాస్తాయని కొడుకు అడుగుతాడు. ఇవి చెట్లకు కాయవు. దీన్ని మనుషులే కలుపుతారని ఆమె సమాధానం చెబుతుంది.
‘అమ్మా.. నాన్నగారు ఇంటికి వచ్చేసరికి కోపంగా ఎందుకు ఉంటార’ని పిల్లవాడు అడుగుతాడు. ‘‘ఆయన స్వభావం అంతే’’ అని తల్లి దాటవేస్తుంది. ‘స్వభావం’ అంటే ఏమిటి? అని అడుగుతాడు. ఈ మాదిరిగా చిక్కు ప్రశ్నలు అడగటమే అలావాటైన పిల్లవాడిని- బడి గడప తొక్కగానే ‘సైలెన్స్’ అని టీచర్ అంటాడు. ‘నేనేమీ ప్రశ్న అడగకూడదా?’ అని విద్యార్థి అనుకుంటాడు. అదే మన తరగతికి కళంకం తెచ్చే వైఖరి అవుతుంది. చిన్న పిల్లలు ఎన్నో ప్రశ్నలు అడుగుతుంటే వాటికి తర్కబద్ధంగా జవాబులు చెప్పాలి. 2,3 అనే అంకెలను కలిపితే 5 వస్తుంది అంటాడు. ఇద్దరు మగవాళ్లు, ముగ్గురు ఆడవాళ్లు కలిస్తే ఆ ఐదు ఎవరు? మగనా? ఆడనా? అని పిల్లలు అడుగుతారు. 2 లేక 3 సంఖ్యను చెప్పటం కంటే- ఈ మగ, ఆడ కూడా ఒకే జాతికి చెందినట్లు చెప్పాలి. బిస్కెట్లను నారింజపండ్లను కలపం కదా? మగవాళ్లకు, ఆడవాళ్లను కలపం కదా? అని చెప్పాలి. తరగతి లక్ష్యం పిల్లల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమే. ప్రశ్నకు ఆలోచన ఉంది. దాన్ని బుద్ధిజీవులు ప్రశ్నిస్తారు. తరగతి గది బుద్ధిజీవుల సమూహం.
తరగతి గది విశ్వరూపి..
సమాచార రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులు తరగతి గదిపై ఎంతగా పడినాయంటే దాని అంగాలను కూడా విస్తీర్ణం చేశాయి. తరగతి గది సంఖ్య 30 నుంచి 2000 వరకు పెరిగిపోయింది. స్టాన్‌ఫర్డ్‌లో ఒక ప్రొఫెసర్ తన తరగతిలో 3000 మందికి పాఠం చెప్పాడు. ఈనాడు అందరు విద్యార్థులూ తరగతి గదిలో కూర్చోవలసిన అవసరం లేదు. టెలికాన్ఫరెన్స్ మాదిరిగా టెలిక్లాస్‌లు వచ్చాయి. తరగతి గది గోడలు పడగొట్టారు. ప్రపంచం మొత్తానే్న ఒకే తరగతి గదిగా గ్లోబల్ క్లాసులు వచ్చినాయి. వెనకట లైబ్రెరీ పుస్తకాలు పెట్టడానికి స్థలం, బిల్డింగ్‌లు కట్టవలసి వచ్చింది. వెయ్యిపేజీల పుస్తకాన్ని అరచేతిలోపల తయారు చేయవచ్చును. విద్యార్థి తానున్న స్థలానికే ఏ ఘడియలో కావాలనుకుంటే ఆ క్షణంలో అరచేతిలోకి వచ్చేస్తుంది.
తరగతి గదిలో అందరూ కలిసి ఒకే సమస్యపై ఒకే సమయంలో చర్చించవచ్చును. అందులో మేధస్సును కలవరపరిచే ప్రశ్నలు వస్తాయి. అందులో ప్రతి ఒక్కరూ పాత్రధారే. తన అభిప్రాయాన్ని చెప్పవ్చును, వినవచ్చును. ఒకే ప్రదేశంలో నిర్ధిష్టంగా ఉండవలసిన అవసరం లేదు. ఒక పుస్తకాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావచ్చును. గత చరిత్ర ఎంత ఉన్నా ఒక్క క్షణంలో విద్యార్థి ముందుకు వస్తుంది. వైజ్ఞానిక రంగం తరగతి గదిని ఎంతైనా సాగదీయవచ్చును. వైజ్ఞానిక రంగం తెచ్చిన విప్లవాత్మకమైన మార్పువల్ల అందరూ కలిసి ఒక విషయంపై సామూహికంగా చర్చించవచ్చును. మార్కెట్ సమాజం అవలంబించే పద్ధతులన్నీ తరగతి గదిని తాకుతున్నాయి. 21వ శతాబ్దం తరగతి గదిని గ్లోబల్ స్థాయికి తీసుకువచ్చింది. మనిషి ఎదగడానికి ఎంతగా కోరికలు ఉంటే అంతగా అవకాశాలు కల్పించబడ్డాయి. సంకల్పం ఉంటే చాలు, విజ్ఞానానికి అవధులు లేనట్లే తరగతి గదికీ అవధులు లేవు. బోధనా పద్ధతులకు, లెర్నింగ్‌కు కూడా హద్దులు లేవు. ఆలోచనకు హద్దులు లేనప్పుడు లెర్నింగ్‌కు కూడా హద్దులుండవు. ఒకనాడు ఒక గురువు, ఒక శిష్యుడు మాత్రమే. ఒకే గురువు ఉండవచ్చును కానీ- నేర్చుకునే వారు విశ్వం అంతా వ్యాపించి ఉండవచ్చును. 21వ శతాబ్దంలో తరగతి గది స్వరూపాన్ని ఊహించటమే కష్టం. సాంకేతికతో తరగతి గది విశ్వరూపం దాల్చింది.

- చుక్కా రామయ్య