సబ్ ఫీచర్

శ్రుతి మించితే అంతా నష్టమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’’ అన్నారు మహాత్ములు. ఇది అక్షరాల నిజం. మనిషి జీవించాలంటే ‘‘కూడు గూడు బట్ట’’ అవసరం. ‘‘కూటి కొరకు కోటి విద్యలు’’ అన్నది నిజం. పేదవాడైనా, ధనికుడైనా.. అందరికీ ‘ఆకలి’ ఒకటే. ఉన్నవాడు అరవై రకాలు తినవచ్చు. లేనివాడు అన్నం, పప్పుతో సంతృప్తిగా తింటాడు. ఆనందంగా జీవిస్తాడు.
నాడు మనకు భగవంతుడు ప్రసాదించిన పంచ భూతాల సాక్షిగా ఆరోగ్యకరమైన పుష్టికరమైన ఆహారం మనకు లభించేది. రైతు రసాయనిక ఎరువులు వాడకుండా స్వచ్ఛమైన సేంద్రియ ఎరువులతో పంటలు పండించేవాడు. అవి తిన్న మనం ఆరోగ్యంగా జీవించే వాళ్లం. కాలం మారింది. ఎటు చూసినా కాలుష్యమే. ఏమి తినాలన్నా కల్తీయే. పండించే పంటలు నేడు అన్నీ హానికరమే. వర్షాధారం పంటలు లేవు. అంతా వాణిజ్య పంటలే. అంతా రసాయనిక ఎరువులమయమే. రైతుల కష్టాలు ఎన్నని చెప్పగలము. అయితే అతివృష్టి లేదా అనావృష్టి. భూమాతను నమ్మిన రైతు పంట పండిస్తే.. దళారుల చేతిలో మోసపోయి పంటకు తగిన గిట్టుబాటు ధర లభించక.. చేసిన అప్పులు తీర్చలేక అసువులు బాస్తున్నాడు. ఎంత దారుణమిది!? మనకు అన్నం పెట్టే రైతన్నలు కరువైతే.. ముందు ముందు దేశం దుస్థితి ఏమిటి!?
‘‘దేశానికి వెనె్నముక రైతు’’ అన్నారు. ‘‘పల్లెటూళ్లే మన దేశానికి పట్టుగొమ్మలు’’
పైగా ఎక్కడ చూసినా కల్తీలు. ఇంతకు ముందు కాలంలో అతిథిదేవో భవ అని ఇతరులకు పెట్టందే తినేవారు కాదు. మరి ఇపుడు ఎవరికైనా పెట్టడానికన్నా ముందు తాను తినడానికే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ తిన్నా అది ఏ అసహజ పరిస్థితులు కల్పిస్తోంది. దీనికి కారణం మనుషుల్లో పెరిగిన స్వార్థఆలోచనలు. స్వార్థ మనే పెనుభూతానికి చిక్కిన వారు ఇతరులకు ఎంత నష్టం కలిగిస్తున్నామో చూడరు. ఎంత పాపాన్ని మూటకట్టుకుంటున్నారో కూడా చూడరు. దీనివల్ల ఈ జన్మలో అనారోగ్యాలు వచ్చే జన్మలో పాపరాశి భరించాల్సి ఉంటుంది. అందుకేఏ పని చేసే ముందు అయనా కాస్త ఆగి ఆలోచించాలి.
కొందరు అడుగు తీసి అడుగు వేయలేని భారీకాయాలు, మరికొందరు బక్క పల్చని శరీరాలు... మన జీవనం ముందు నుయ్యి- వెనుక గొయ్యిలా మారిందన్నది సత్యం. కొంతమంది తిన్నది అరగక తిరుగుతారు. మరికొంతమంది తినడానికి లేకబాధపడుతుంటారు. ఏమో అంతా దైవలీల. మనిషిగా పుట్టినందుకు కాస్త విచక్షణతో ఆలోచించి మనిషిగా మానవత్వంతో మెలగాలి.

-కురువ శ్రీనివాసులు