సబ్ ఫీచర్

మోదీ లోహపురుషుడే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విళంబి తెలుగు ఉగాది అడుగు పెడుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు డోలాయమానంగా అస్తవ్యస్త, అసందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సొంత ఇంట కుంపటి రాజేసుకొంటున్న రాష్ట్ర ప్రభుత్వం విభజన సమస్యల నుంచి ఎలా గట్టెక్కాలా? అనే అసంగత అసిధారా వ్రతం చేపట్టింది. అన్నిటి కన్నా రాష్ట్ర ప్రజలను నిరంతరం వేధిస్తున్న ఆలోచన- ప్రభుత్వాన్ని విశ్వసించాలా? ప్రతిపక్షాన్ని ఆశ్రయించాలా? నరేంద్ర మోదీ వంటి మహానేత తమ రాష్ట్రానికి అన్యాయం చేస్తారా? ‘సమర్ధ ముఖ్యమంత్రి’ చంద్రబాబు పట్టుతప్పి, తన శక్తిని వెనక్కి కూడదీసుకొనే స్థితిలో వున్నారా? జగన్, పవన్ వంటి యువనేతలు ప్రజాపక్షంగా న్యాయం అందించగలరా? ఇవన్నీ సమాధానం దొరకని ప్రశ్నలే.
అలనాడు మద్రాస్, ఇటీవల హైదరాబాద్ నగరాలను వదిలేసుకొన్న అభాగ్యత ఆంధ్ర రాష్ట్రాన్ని వెంటాడుతూనే వుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఇంతవరకూ పాలించిన ముఖ్యమంత్రులందరికంటే ఎక్కువ కాలం ఏలిన ఘనత వున్న చంద్రబాబు- జాతీయ రాజకీయాల్లో సైతం చక్రం తిప్పగల దీక్షాదక్షుడు. సమర్థుడైన నేతగా ఆయన గుర్తింపు పొందటంతో ఏపీ ప్రజలు ఊపిరి పీల్చుకొన్నారు. నవ్యాంధ్రలో సీఎం పదవి చేపట్టినప్పటి నుంచి చంద్రబాబు ఊపిరి సలపకుండా, విదేశ పెట్టుబడుల వేట ఆరంభించారు. గత మూడున్నరేళ్లలో రాష్ట్రానికి వివిధ రంగాలలో ఉత్పత్తులకు, ఉపాధి కల్పనకు రూ.1,31,200 కోట్ల పెట్టుబడులు పురోగమన దశకు చేరుకొంటున్నాయి. జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రతిష్ఠ సాధించిన పారిశ్రామిక దిగ్గజాలు పెట్టుబడులు పెట్టడానికి తెలుగునేల పైకి స్వయంగా దిగి వచ్చాయి. పారిశ్రామిక ప్రముఖులు చంద్రబాబును ప్రపంచ మేధావిగా ప్రశంసిస్తే, ఆంధ్ర ప్రజలు ఆశ్చర్యంతో తలలూపారు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండగల ప్రాజ్ఞునిగా, పెట్టుబడుల లక్ష్యంతో ఆయనకు దోసిలి ఒగ్గారు. ఆయన ఎన్నడూ తాను మేధావినని ఆధిపత్యం ప్రదర్శించలేదు, ఆర్థికాభివృద్ధికి నూతన జవసత్వాలు అందించే లక్ష్యంతో శ్రమిస్తున్నారు. గత రెండేళ్లుగా రాష్ట్రంలో సగటు జిఎస్‌డిపి వృద్ధిరేటు 11.28 శాతం నమోదు అయింది. తలసరి ఆదాయంలో మెరుగైన వృద్ధి కనపడుతోంది. సుస్థిర కృషి, వినూత్న విధానాల వల్ల గత మూడేళ్ల ఏపి వృద్ధి రేటు సగటున భారత ఆర్థిక వ్యవస్థను మించి పోయింది. కానీ ఆ గణాంకాలు సామాన్య పేదల ఆకలి దప్పులకు అతీతం.
భారతావనిలో ఆంధ్ర రాష్ట్రం అంతర్భాగం. స్వాతంత్య్రం సాధించిన తొలి దశాబ్దాలలో అన్నపూర్ణగా, విదేశీ గోధుమలు దిగుబడిపై అమెరికాను అర్థిస్తున్న పార్లమెంటును ఆదుకొన్న ధాన్యాగారం ఇదే. అప్పటి ప్రధాని శాస్ర్తిజీ ‘జై కిసాన్’ నినాదాన్నిచ్చి జాతి ప్రగతికి స్ఫూర్తి ఇవ్వటానికి నాటి ఆంధ్రదేశం కారణం. ఒక రాష్ట్రం సాధించిన ప్రగతి, జాతి మొత్తం సౌభాగ్య, సుభిక్షవంతం చేస్తుంది. ఆ ప్రధానాంశం కేంద్రాధిపత్యం వహిస్తున్న మోదీ లేదా జైట్లీ లేదా ఇతర మంత్రులకు తెలియదా? విభజన చట్టాన్ని అమలు చేయవలసిన కేంద్ర నాయకత్వం- తన బాధ్యతను పారదర్శకంగా నిర్వర్తించలేని దుస్థితికి ఎందుకు దిగజారింది? భాజపా తమకు న్యాయం చేస్తుందన్న నమ్మకంతోనే ఏపీ ప్రజలు కాంగ్రెస్‌ను మట్టికరపించారు. టీడీపీ-్భజపా కూటమిని ఆదరించారు.
ఇక- ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆధిపత్యం కోసం భాజపా అర్రులు చాచటంలో తప్పు లేదు. కాని ఎన్‌డిఏ కూటమిలో ఉన్న టీడీపీ, బీజేపీల మధ్య శత్రుత్వ ధోరణి స్పష్టమవుతోంది. చంద్రబాబులా ప్రధాని మోదీ కూడా ఒకప్పుడు ముఖ్యమంత్రే. సిద్ధాంత వైరుధ్యాలు, రాజకీయ విభేదాలు తలఎత్తి ఉండవచ్చు. ఆ పరిస్థితులలో గత్యంతరం లేకపోవచ్చు. ఈర్ష్యాద్వేషాలకు ఎంతటి రాజకీయ నేత అయినా అతీతుడు కాదనే అభిప్రాయం- బాబు, మోదీల నేపథ్యం పరిశీలించిన వారికి అవగతమవుతుంది. రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాకపోవచ్చు. రికార్డు స్థాయిలో రు.1.91 లక్షల కోట్ల బడ్జెట్‌ను ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టింది. కేంద్రం మద్దతు వుంటేనే ఆర్థిక వనరుల సమీకరణ సాధ్యం. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ రూపంలో ఆశిస్తున్న నిధులు రాష్ట్రానికి అందేటట్టు కేంద్రం సహకరిస్తుందా? అనేది సందేహమే. 2019 అంతానికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలంటే ఇంకా 40 వేల కోట్ల నిధులివ్వాలి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రు.58 వేల కోట్ల మేర సవరించిన అంచనాలను కేంద్రం ఆమోదించవలసి వుంది. అటు అమరావతి నిర్మాణం, ఇటు పోలవరం ప్రాజెక్టు ఏపీ ప్రభుత్వానికి ప్రతిష్ఠాత్మకమే.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ ఇపుడు కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్నారు. చంద్రబాబుకు సంబంధించిన కారణాలు ఏమైనా ‘విళంబి’ వచ్చేవరకూ అత్యధిక సహనంతో విలంబనాన్ని సహించి ఎదుర్కొన్నారు. అందుకు విరుద్ధంగా కేసీఆర్ సాహసంతో కేంద్రం ఆధిపత్యాన్ని తోసిరాజన్నారు. ఈ పరిస్థితుల్లోనూ ప్రధాని మోదీ దేనికీ చలించని లోహపురుష మహానేతే. ఆయన అచంచలుడు.

-జయసూర్య సెల్: 94406 64610