సబ్ ఫీచర్

పదమే కల్పవృక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీదేవియే శ్రీచక్రము. శ్రీమాత, శ్రీవిద్య శ్రీచక్రములు వేరువేరు కాదనియు, ఈ మూడున్నూ ఒకే పరబ్రహ్మ స్వరూపమని శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము మనకు తెలియేచేస్తోంది. పరబ్రహ్మ స్వరూపము, మాటలలో చెప్పలేనిది, ఊహల కందనిది, వాక్కెలెంతటి అర్థవంతమైనను, ఊహలెంతటి తార్కికములైనను అవి పరబ్రహ్మము యొక్క నిజ స్వరూప స్వభావములను వ్యక్తము చేయలేదు. అందుకే పరమాత్మ సద్గురు రూపములో జిజ్ఞాసువులైన తన శిష్యులకు సాధనములుగా కొన్ని మార్గములనస సూచించాడు. అవి (1) పదము, 2) బీజము, (3)సంఖ్య, 4)రేఖ యనబడుచున్నవి.
ఇందులో ‘‘పదము’’ జ్ఞానసముపార్జనకు, లేక భగవస్సాన్నిధ్యమునకు ఫల, పుష్ప, పత్ర, శాఖా సహితమైన కల్పవృక్షముగా చెప్పిరి. ఈ కల్పవృక్షానికి వేదములు శాఖలైతే, స్మృతులుపశాఖలు, పురాణేతిహాసములు, పత్ర పుష్పములుగాను దర్శనములు ఫలితములుగా చెప్పిరి. బీజమనగా పైన చెప్పిన జ్ఞానమనే మహా వృక్షము వ్యక్తమగుటకు మూల కారణమైన మంత్రమునకు ఉపాధేయమగుచున్నది.
ఇక సంఖ్య యనగా బ్రహ్మమును నిర్దేశించుటకు ప్రాతినిధ్యం వహించు పవిత్రమైన అంకెయని చెప్పిరి. ఇక రేఖ యనగా బ్రహ్మజ్ఞానమునకు సంబంధించిన ఆలోచనా విధానమును సక్రమముగా రేఖా చిత్రముగా సూచించు పటము. దీనినే పారిభాషిక పదముగా చెప్పినచో ‘‘చక్రము’’ లేక ‘‘యంత్రము’’. దీనిని కేవల వ్యవహారికముగానేకాక, అర్చనకు, పూజకు, అర్చామూర్తి ప్రతినిధిగా స్వీకరించి పూజ చేస్తారు. బీజము, సంఖ్య అను రెండు వేర్వేరుగా చెప్పినను, అవి ప్రయోగ, ప్రయోజన వ్యవహారములలో పరస్పరానుబంధములుగా వినియోగింపబడుతున్నా. నిజమైన సాధకునికి, లేక బ్రహ్మజ్ఞానానే్వషికి పైన చెప్పిన పద, జ్ఞాన, సంఖ్య, రేఖలనే నాలుగు జ్ఞాన కుంజికలుగా చెప్పారు. బీజ సంఖ్యలు రెండూ మంత్ర భాగములోకి వస్తాయి. పద, మంత్ర, రేఖా రహస్యములను విశదపరచే విధంగా మూడు శాస్తమ్రులు ప్రకటితములైనవి. బ్రహ్మ ఋషులచే బోధింపబడినవి. పదశాస్తమ్రు లేక శబ్ద శాస్తమ్రు ‘‘పాణినీయ వ్యాకరణమునకు మూలమై నిలిచినది.మంత్ర, సంఖ్యా శాస్తమ్రులు రెండును పద శాస్తమ్రునకు సంబంధములైన అంక గణిత శాస్తమ్రు, బీజ గణితములకు రేఖాశాస్తమ్రు లేక యంత్ర శాస్తమ్రు, క్షేత్రగణితము, శంకుచ్చేద క్షేత్ర గణితము, త్రికోణమితి శాస్తమ్రులకు జన్మనిచ్చినవి. పై మూడు శాస్తమ్రులొకే కాంతిపుంజము నుండి వెలువడి ఒకే కేంద్రమందు లీనమగుచున్న తేజో కిరణములని భావించవచ్చును. ఇట్టి విషయము శ్రీశృంగేరీ విరూపాక్ష పీఠాధిపతి (42) జగద్గురు శ్రీశ్రీశ్రీ కళ్యాణానంద భారతీ మాంతాచార్య మహాస్వామి వారిచే రచింపబడిన ‘‘పూర్ణమీమాంసాదర్శన’’ మను గ్రంథమునందు బహు విస్తారముగా, సుబోధకముగా వివరింపబడినది. ఆసక్తిగల పాఠకులు పరిశీలించవచ్చు. దీని యందు 54 సూత్రములు కలవు.
(ఇంకా ఉంది)

-డా. గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ సెల్: 9490947590