సబ్ ఫీచర్

ఆలయాల నియమ అతిక్రమణ ఆనాడే జరిగిందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య టీవీ మాధ్యమాలలో, పత్రికలలో శని శింగనాపూర్ గ్రామం పేరు ప్రస్ఫుటంగా కనబడుతోంది, వినబడుతోంది. ఆ ఊరిలోని శనీశ్వరాలయంలోకి మహిళలకు ప్రవేశం లేదు. అయినా రేణుదేశాయ్ అనే మహిళ, భూమి సేన వ్యవస్థాపకురాలు నేతృత్వంలో ఆలయంల్ఘో ప్రవేశించడానికి ప్రయత్నించడం, అక్కడి గ్రామస్థులు ఆ ప్రయత్నాన్ని వమ్ము చేయడం జరిగింది. దీనిపై భూమిసేన కోర్టుకు వెళ్లగా హైకోర్టు ఆలయ ప్రవేశం ఆడవారికి నిషేధించరాదని తీర్పు ఇచ్చింది. కోర్టులో విజయాన్ని ఆధారం చేసుకుని రేణుదేశాయ్ బృందం తిరిగి శని సింగనాపూర్ ఆలయ ప్రవేశ ప్రయత్నం చేయడం, గ్రామస్థులు మళ్లీ అడ్డుకోవడం జరిగిం ది. మహారాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని సరిగా అమలు చేయనందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి మీద కోర్టు ధిక్కరణ నేరం కింద కేసు నమోదు చేయాలని దేశాయ్ ఆందోళన మొదలుపెట్టారు. ఈ వ్యవహారం అంతా గమనించే కాబోలు, నాసిక్‌లోని త్రయంబకేశ్వరాయంలో పురుషులకు సైతం ప్రవేశం నిషేధించారు.
శబరగిరీశుని దర్శన విషయంలోనూ, పది సంవత్సరాల నుంచి యాభై ఏళ్ళదాకా వయసున్న స్ర్తిలకున్న నిషేధం గురించి ప్రస్తుతం ఉద్యమాలు, న్యాయస్థానాలలో వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో మెజారిటీ మహిళల అభిప్రాయాలకు ఎవరూ విలువ ఇస్తున్నట్లుగా లేదు. సంప్రదాయాలను గౌరవించే పాత తరం స్ర్తిలు నిబంధనలను వ్యతిరేకించడానికి ఇష్టపడరు. ఉద్యోగాలకు అం దంగా అలంకరించుకుని వెళ్ళే ఆధునిక యువతులు నలభై రోజులు నల్లబట్టలు ధరించి చెప్పులు లేకుండా ఉండడానికి ఇష్టపడతారు. ఇక ఈ ఉద్యమం ఎవరికోసం అన్నది ప్రశ్న. ఎవరు చేయిస్తన్నారన్నది అంతకన్నా ముఖ్యమైన ప్రశ్న. ఇక్కడ గత శతాబ్దంలో జరిగిన రెండు సంఘటనలను అందరూ తెలుసుకోవలసిన అవరముంది.
1949లో భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన కొత్తలో శబరిమల ఆలయానికి, మరికొన్ని ఆలయాలకూ క్రైస్తవులు ధ్వంస రచన చేశారు. రవాణా సౌకర్యాలు అంతగా లేని కాలంలో శబర గిరీశుని దర్శనానికి వెళ్ళే భక్తుల సంఖ్య వేలలోనే ఉండేది. పంపా తీరం నంచి శబరిమల దాకా ఉన్న దారి పక్కన అడవులలో చెట్లు కొట్టడం, గంజాయి పండించడం కొందరు కైస్తవ వ్యాపారులకు అలవాటు. తీర్థయాత్రలు చేసే భక్తులవల్ల ఆటంకం ఏర్పడకుండా ఆలయాన్ని ధ్వంసం చేశారు. అయ్యప్ప దర్శన భక్తుల సంఖ్య 1950ల తర్వాత బాగా పెరిగింది. తమ మత ప్రచారం ఆగకుండా ఫాదరీలు రెండు మూడుసార్లు ఆలయంలపై దాడి చేశారు. ఎన్ని ప్రయత్నాలు జరిగినా శబరి గిరీశుని భక్తుల సంఖ్య తగ్గలేదు. ‘విభజించి పాలించు’ సూత్రానికి అనుకూలంగా స్ర్తిలను అంతఃశత్రువులుగా చేసే ప్రయత్నం జరుగుతోందా అని ఆలోచించాలి. కేరళలో మిగిలిన భారతదేశమంతటికన్నా ఆచారాలూ, సంప్రదాయాలూ మొదలైన వాటిలో పట్టుదల ఎక్కువ. చొక్కా ధరించి మగవారు ఆలయంలో అడుగుపెట్టడానికి వీలులేదు. 1930లలో జవహర్‌లాల్ నెహ్రూ తిరువనంతపురం వెళ్లినపుడు, మైనర్ కుమారుని తరఫున రాజ్య వ్యవహారాలు చూస్తున్న పురాడణ్ ఇరునాళ సేతు లక్ష్మీబాయి మహారాణి తన ఆస్థానానికి వచ్చి ఉన్న నెహ్రూని పద్మనాభ స్వామి దర్శనానికి అనుమతించలేము. సముద్ర యానం పాపమన్నది హిందువుల నమ్మకం. తప్పని పరిస్థితులలో సముద్రయానం చేసిన వారు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి.
నెహ్రూగారికి అలాంటి నమ్మకాలు లేవన్నది జగద్విదితం. పద్మనాభ దాసులు రాజులు రాజ్యమేలే తిరువనంతపుర పాలకులు ఆలయాన్ని పవిత్రంగా ఉంచడానికే ప్రయత్నిస్తారు. రాణి అనుమతి అనవసరమనుకున్నారేమో కాని భావి భారత ప్రధాని ఆవిడకు చెప్పకుండా ఆలయ ప్రవేశం చేశారు. 1950లలో మళ్లీ నెహ్రూ వెళ్లారు. అప్పటికి రాజ్యాలు లేవు. నెహ్రూ ప్రధాని. ఇక అనుమతి ప్రసక్తి ఎక్కడిది? నాస్తికుడో, బౌద్ధుడో, సెక్యులరిస్టో, ఎవరో తెలియని నెహ్రూకి ఆలయ నిబంధన విషయంలో గౌరవం లేకపోవడంలో ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం స్ర్తిల ప్రవేశం గురించిన ఉద్యమాల్ని ఎవరు నడిపిస్తున్నరో తెలియదు కానీ సంప్రదాయం పైన నమ్మకమున్న ప్రతి స్ర్తి కోర్టు తీర్పు ఏమైనప్పటికీ, తాము 10-50 ఏళ్ల మధ్య వయసులో ఆలయ ప్రవేశం చెయ్యబోమని పత్రికా ముఖంగా, టీవీ చానెళ్ల ద్వారా, ఇంటర్నెట్‌లో తెలియజేయాల్సిన అవసరం వుంది. ఎవరో, ఎక్కడో వందమంది ఆడవాళ్లు కోరుకున్నంత మాత్రాన మెజారిటీ మహిళల మనోభావాలను విస్మరించరాదు.

- పాలంకి సత్య