సబ్ ఫీచర్

సుఖదుఃఖాలకు వంగనిదే ఆత్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకసారి దేవదానవులు ఆత్మ స్వరూపం గురించి తెలుసుకోవాలని నిశ్చయించుకున్నారు. అందుకుగాను దేవతలు తమ తరఫున ఇంద్రుడిని, దానవులు తమ నుంచి విరేచనుణ్ణి ప్రతినిధులుగా ఎన్నుకొని వారిని బ్రహ్మదేవుని దగ్గరకు పంపారు. వెంటనే ఇంద్ర, విరేచనులు బ్రహ్మ కోసం కఠోరమైన తపస్సు ప్రారంభించారు... అలా కొంతకాలం తపస్సు చేశాక బ్రహ్మదేవుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు.
అప్పుడు ఇంద్ర, విరేచనులు ఆయనకు నమస్కరించి తమ సందేహాన్ని విన్నవించుకున్నారు. బ్రహ్మ క్షణకాలం తటపటాయించి, ‘కళ్ళల్లో, జలాల్లో కనిపించే దేహమే ఆత్మ’ అని చెప్పాడు. ఆ సమాధానానికి విరేచనుడు సంతుష్టి చెందాడు. అతడు దానినే ఆత్మగా భావించాడు.
అయితే ఇంద్రుడు అందుకెంత మాత్రం సంతృప్తి చెందలేకపోయాడు. ‘దేహమే ఆత్మ కాదని ఖండించాడు. ఆ తరువాత బ్రహ్మ ‘స్వప్న చైతన్యమే ఆత్మ!’ అన్నాడు. ఆత్మలో దుఃఖ సంపర్కం ఉండదు కదా మరి స్వప్నం ఆత్మ కాదు ఇంద్రుడు.
తిరిగి బ్రహ్మ సుషుప్తి చైతన్యాన్ని ఆత్మగా చెప్పాడు. అయినా ఇంద్రుని సందేహం దూరం కాలేదు. ఇక
బ్రహ్మ ‘మహేంద్రా! ఆత్మ శరీర రూప రథానికి అధిష్టాత. దీనికి బుద్ధి సారథి, మనస్సు కళ్ళెం, ఇంద్రియాలే అశ్వాలు. వీటి అన్నింటి అస్తిత్వం ఆత్మరూపమైన రథికి సహాయం చేయడానికే. ఈ రీతిగా ఆత్మయే శరీర రథానికి స్వామి. ఆత్మ ప్రేరణతోనే ఈ రథం నడుస్తోంది. ఇది వికార రహితమై, శక్తి స్వచ్ఛంగా ప్రకాశిస్తోంది. ఆత్మను నేత్రాలతో ఎవరూ చూడలేరు. అనే్యంద్రియాలతో గ్రహించలేరు. దాని చిహ్నం ఏదీ కనిపించదు. ఏ నామంలోను దానిని పిలవలేం. శాంతమై, అద్వైతమై అది సదా భాసిల్లుతూ ఉంటుంది!’ అంటూ ఆత్మయొక్క స్థితిని సంక్షిప్తంగా తెలిపి ఇంద్రుణ్ణి సంతృప్తి పరిచాడు.

- జి. కల్యాణి