సబ్ ఫీచర్

జుట్టును కాపాడుకోవడమిలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తలపైన జుట్టు అందరికీ కావాలని ఉన్నా ఆడపిల్లలు మాత్రం కేశసౌందర్యం పట్ల జాగ్రత్త వహిస్తుంటారు. కాని నేటికాలంలో మధ్యవయస్సు స్ర్తిలనే కాక చిన్న పిల్లల్లో కూడా జుట్టు రాలడం పరిపాటి అయింది. వయస్సు భేదం లేకుండానే జుట్టు రాలిపోతుంది. సుమారు ఒక లక్షమిలియన్ల వరకు తలమీద వెంట్రుకలుఉంటాయి. ప్రతిరోజూ మనం తల దువ్వుకునేటప్పుడుగానీ, తలస్నానం చేసేట్పుడుగానీ, తలకు నూనెను రాసుకునేటప్పుడుగానీ సుమారు 50 వెంట్రుకల వరకు రాలే అవకాశం ఉంటుంది. ఇది సహజమే. అయితే ఇంతకుమించిన సంఖ్యలో వెంట్రుకలు రాలుతుంటే మాత్రం శ్రద్ధ వహించాలి. కారణాలమీద దృష్టి పెట్టి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి.
అధిక వేడి వంటి ప్రతికూల పరిస్థితులు జుట్టు కుదుళ్లను కూడా నాశనం చేస్తాయి. పిత్తదోషాన్ని ప్రకోపించేలా చేసే ఆహారాలు, కార్యకలాపాలు జుట్టుమీద తీక్షణ ప్రభావాన్ని చూపిస్తాయి. ఉష్ణతత్వం ఎక్కడున్నా పైకి వెళ్ళే గుణాన్ని కలిగి ఉంటుంది. కోపోద్రేకాల వలనకానీ, శరీరాంతర్గతమైన వేడిని పెంచే నైజం ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం వలన కాని ఉష్ణం ప్రజ్వరిల్లి పిత్తాన్ని పెంచుతుంది. ఇది శరీరంలో ఊర్థ్వముఖంగా వ్యాపించి తలను చేరుతుంది. అక్కడ జుట్టుకు వ్యతిరేకంగా పనిచేసి వెంట్రుకలు తెల్లబడటానికికాని లేదా రాలిపోవడానికిగాని కారణమవుతుంది.
వెంట్రుకల పెరుగుదలను పరిశీలిస్తే ప్రతి వెంట్రుకకూ ఎనాజెన్, కెటాజెన్, టీలోజెన్ అనే మూడు దశలు ఉంటాయని ఆయుర్వేదం చెబుతుంది. మొదటి దశలో వెంట్రుక పొడవు పెరుగుతుంది. రెండవ దశ సంధికాలం. మూడవ దశలో పెరుగుదల నిలిచిపోతుంది. అసలుజుట్టు ఎందుకు రాలి పోతుందంటే వెంట్రుక పెరిగే విధానంలో అసాధారణత చేసుకోవటం వల్ల జుట్టు మూడి పోవచ్చు. లేకపోతే వెంట్రుక కుదురు దెబ్బతినటంవల్ల కూడా జుట్టు వూడిపోవచ్చు. జుట్టు వూడి పోయే ముందు తల మీద ఎరుపుదనంతో ఉన్న చర్మం కాని, పొలుసులు, పొక్కులు, బొడిపెలు, ఇన్‌ఫ్లమేషన్ వంటివి ఉన్నాయేమో చూడాలి. ఉంటే చర్మానికి సంబంధించిగాని, వెంట్రుక కుదురుకు సంబంధించిగాని సమస్య ఉన్నట్లు అర్ధం చేసుకోవాలి. ఇంకేదైనా వ్యాధులకు మందులేవన్నా వాడుతున్నారా? అదీ చూడాలి. జుట్టు ఆందోళనకరమైన స్థాయిలో రాలుతోందా లేదా అనేది నిర్ణయించడానికి ఒక తేలిక పాటి పరీక్షా పద్ధతి ఉంది. దాదాపు 60 వెంట్రుకలను బొటనవేలు, చూపుడువేలు, మధ్యవేళ్ళతో ఒడిసి పట్టుకొని స్థిరంగా, సున్నితంగా లాగాలి. వెంట్రుకలు ఆరుకంటే తక్కువ సంఖ్యలో ఊడితే సాధారణ స్థితిగా అర్థం చేసుకోవాలి. ఆరు వెంట్రుకల కంటే ఎక్కువ సంఖ్యలో ఊడితే సమస్య తీవ్ర స్థాయిలో ఉన్నదని భావం. ఈ పరీక్ష నిర్వహణకు 24 గంటల ముందు షాంపు చేసుకోకుండా ఉండటం అవసరం.
కొన్ని ఉపాయాలు
మెంతులు ఒక రోజంతా నానబెట్టి మరుసటి రోజు రుబ్బి ఆ పేస్టును తలకు పట్టించి ఒక గంట సేపు తరువాత షాంపు చేసుకొంటే వెంట్రుకలు మెత్తగా అవుతాయి. పైగా తల చల్లగా అవుతుంది. వేడి శరీరం ఉన్నవారికి ఇది చాలాబాగా పనిచేస్తుంది. వారానికి ఒకసారి ఈ మెంతులు జుట్టుకు పెట్టుకోవడం వల్ల జుట్టు రాలేపోయే సమస్యనుంచి బయటపడవచ్చు.
మందార ఆకులను రుబ్బుకుని ఆ పేస్టును తలకు పట్టించి ఒక గంట సేపు తరువాత కడిగేసుకుంటే తెల్లవెంట్రుకలు త్వరగా రావు. జుట్టు మృదుత్వం వచ్చి త్వరగా ఊడిపోదు. వెంట్రుకల చివర్లు బాగుంటుంది. వారానికి ఒకసారి మందార ఆకులను పెట్టుకోవడం వల్ల జుట్టు పెరుగుతుందని కూడా చెప్తారు.
ఉల్లిరసాన్ని కూడా జుట్టుకు పట్టించి ఒక గంట తరువాత కడిగివేసుకొంటే జుట్టు బాగా పెరుగుతుంది. కాకపోతే శరీర తత్వాన్ని బట్టి వైద్యులను సంప్రదించిన తరువాత ఈ ఉల్లిరసాన్ని జుట్టుకు అప్లయి చేసుకోవాలి. ఒక్కోక్కరి తలకు ఈ గాఢత సరిపోనందున సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులను సంప్రదించిన తరువాత ఈ ఉల్లిరసాన్ని వాడుకోవాలి.
జుట్టుకు రోజు మార్చి రోజు నూనె రాయడం వల్ల కూడా జుట్టును కాపాడుకోవచ్చు. కుంకుడు, శీకాకాయ లాంటివి ఉపయోగించడం జుట్టుకు ఎంతో మంచిది. ఈ కాలంలో వీటి పౌడర్లు, షాంపులుకూడా దొరుకుతున్నాయి కాని వీటిని తెచ్చుకుని మనమే పొడి చేసుకొని జుట్టును శుభ్రం పర్చుకోవడం మంచిదంటారు.

- గౌరి