సబ్ ఫీచర్

రచనల ద్వారా వైజ్ఞానిక పురోగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన పూర్వీకులు చాలా గొప్ప వారని మనం అనేక సందర్భాల్లో చెబుతూ వుంటాం. సాక్ష్యాలు ఆధారాలు చూపవలసి వస్తే అటువంటివి అందుబాటులో లేనప్పుడు మనం చెప్పిన దానికి పెద్దగా విలువ లభించదు. అందువల్ల భారతీయులు వివిధ రంగాల్లో ముఖ్యంగా వైజ్ఞానికంగా సాధించిన ప్రగతి అంతటినీ ప్రాచీన గ్రంథాల ఆధారంగా వొకచోట సంకలనం చేసి భావితరాలకు అందించవలసి వుంది. ప్రతి వైజ్ఞానిక విషయం పాశ్చాత్యులు చెబితేనే మనకు తెలిసిందన్నట్లుగా మన పాఠ్యగ్రంథాలు రూపొందించారు. వాటి ఆధారంగా విద్యాబోధన జరుగుతోంది. మనకంటూ వొక గొప్ప విజ్ఞానపరంపర వైజ్ఞానిక దృష్టి వున్నదని తెలియనట్లు మనవాళ్లు ప్రవర్తిస్తున్నారు.

‘‘జైమిని మహర్షి పైన చెప్పిన 12 తోక చుక్కలను ‘‘చేట సర్వస్వము’’ అను గ్రంథమున, వేరే పేర్లు చెప్పెను అవి.
శ్లో॥ మహాకాళీ, మహాగ్రోసో, మహాజ్వాలా, ముఖస్త్థా, విస్ఫులింగ ముఖోదీర్ఘవాతో ఖజో, మహూర్తిత స్పులింగమునో గండో దీర్ఘజిహ్వో,
దురోణక: సర్వాశ్వశే్చతి, విద్యునే్నత్రోల్కా
ద్వాదశ స్మృతాః
జైమినీ మహర్షి యింకను రుూ తోకచుక్కల ప్రభావము, భూమి మీద ప్రతి సంవత్సరము, ఎప్పుడు, ఏ విధముగా పడుతుందో కూడా చెప్పారు. ఈ తోకచుక్కలలోని విద్యుత్ సంఘర్షణ శరద్‌ఋతువు, వసంత్ ఋతువులలోను జరుగుచుండునని చెప్పారు.
ఈ క్రింది శ్లోకాన్ని చూడండి
శో॥ తేఫాంవిద్యుత్సంమోహస్తు శరద్‌వా
సంతయోఃక్రమాత్‌
భావత్యాదివ్య కిరణేష్పంత ర్భూతాః
స్వభావతః
సహజముగా వాటి స్వభావము చేత, రుూ తోక చుక్కల యొక్కవేడిమి, విద్యుశ్ఛక్తి కూడ ఎప్పుడూ సూర్యకిరణముల యందంతర్భూతముగా నుండు ను. కానీ శరద్‌ఋతువులోనూ, వసంత ఋతువులోనూ మాత్రము వీటియందు విద్యుత్ సంఘర్షణము అధికముగా జరుగుచుండును. ఆ కారణముచేత సూర్యకాంతిలో (ఎండలో) తీక్షణత పెరిగి, మన శరీరముల మీద పడే ఎండ వేడిమీ తక్కువైననూ ఎక్కువ తీక్షణత కలిగివుండి, సూక్ష్మమైన రోమ గ్రంథుల ద్వారా శరీరములోనికి ప్రవేశించి శే్లష్మము మొదలైన ధాతువులపై అనేక మార్పులతో ప్రభావము చూపుచున్నవని జైమిని మహర్షి విపులముగా వివరించెను.
ఈ విషయము ప్రాచీన భారతీయ వైద్య గ్రంథములయందు ముఖ్యముగా చరకుని అగ్నిప్రవేశ తంత్రమును, శ్రుత, వాగ్భటాచార్యుల వారి గ్రంథములయందు కూడ ఋతుచర్యవర్తనమునందు విపులముగా వివరింపబడినది.
మన పూర్వీకులు చాలా గొప్ప వారని మనం అనేక సందర్భాల్లో చెబుతూ వుంటాం. సాక్ష్యాలు ఆధారాలు చూపవలసి వస్తే అటువంటివి అందుబాటులో లేనప్పుడు మనం చెప్పిన దానికి పెద్దగా విలువ లభించదు. అందువల్ల భారతీయులు వివిధ రంగాల్లో ముఖ్యంగా వైజ్ఞానికంగా సాధించిన ప్రగతి అంతటినీ ప్రాచీన గ్రంథాల ఆధారంగా వొకచోట సంకలనం చేసి భావితరాలకు అందించవలసి వుంది. ప్రతి వైజ్ఞానిక విషయం పాశ్చాత్యులు చెబితేనే మనకు తెలిసిందన్నట్లుగా మన పాఠ్యగ్రంథాలు రూపొందించారు. వాటి ఆధారంగా విద్యాబోధన జరుగుతోంది. మనకంటూ వొక గొప్ప విజ్ఞానపరంపర వైజ్ఞానిక దృష్టి వున్నదని తెలియనట్లు మనవాళ్లు ప్రవర్తిస్తున్నారు. దీనివల్ల మన విజ్ఞానశాస్త్ర వారసత్వం గురించి వొక శూన్యత నెలకొంది. అయితే 20వ శతాబ్ది ఆరంభంలో భారతీయ విజ్ఞాన శాస్తవ్రేత్తలు చరిత్రకారులైన కొద్దిమంది ఔత్సాహికులు ముఖ్యంగా ఆచార్య ప్రఫుల్లచంద్రరాయ్, జగదీశ్ చంద్రబోసు, కోట వెంకటాచలం, బ్రజేంద్రనాథ్ సీల్, రాణి శ్రీనివాసశాస్ర్తీ, రావుసాహెబ్ వఝే మొదలైనవారు తమ విస్తృతాధ్యాయనాల ద్వారా ప్రాచీన భారతదేశం సాధించిన శాస్త్ర సాంకేతిక, బహుముఖ వైజ్ఞానిక పురోగతిని తమ రచనల ద్వారా ఋజువుచేశారు. అంతేకాదు మన ప్రాచీనులు వైజ్ఞానిక ఆధ్యాత్మిక రంగాలను సమన్వయించారని తేల్చారు.
ప్రాచీనకాలంలో జగద్గురువుగా, విదేశీయులచే ‘బంగారుపక్షి’గా కీర్తింపబడిన భారతదేశం 1500 సంవత్సరాలపాటు సాగిన విదేశీ దురాక్రమణల నిరంతర ఆర్థిక, సాంఘిక, రాజకీయ దోపిడీలవల్ల, ముఖ్యంగా భారతీయులను పరిపాలించాలంటే వారి వైజ్ఞానిక, సాంస్కృతిక, చారిత్రక పరంపరనుండి వారిని వేరుచేయాలనే ఆంగ్లేయుల పథకం ఈ పథకంలోని ముఖ్యభాగమే. 1835లో ‘‘్థమస్ బాబింగ్టన్ మెకాల్’’ ఇంగ్లీష్ విద్యావిధానాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టడం. ఫలితంగా ప్రాచ్యవిద్యాపాఠశాలలు, కళాశాలలు మూతబడ్డాయి. ఆంగ్ల పాఠశాలలు తప్పనిసరి అయ్యాయి. ఈ పాఠ్యగ్రంథాలలో ఎక్కడా భారతీయ విజ్ఞానపరంపరకు తావులేకుండా చేశారు. దీని ఫలితంగా ఆంగ్లవిద్యాభ్యాసం చేసినవారికి భారతీయ విజ్ఞానపరంపర అందకుండా, అవగాహన లేకుండాపోయింది. ఆంగ్లేయులావిధంగా చేయడానికి కారణం వారిది సామ్రాజ్యవాదం, అదివారి లక్ష్యం. కానీ స్వాతంత్య్ర భారతంలోనూ అదే పరిస్థితి కొనసాగుతోంది. పాఠ్యగ్రంథాలలో పాశ్చాత్య (యూరప్) దేశాల గొప్పతనాన్ని చాటిచెప్పే విషయాలే కొనసాగుతున్నాయి. గత 180 సంవత్సరాలుగా అమలవుతూ వస్తున్న విద్యావిధానంలో పరంపరగా భారతీయ శాస్త్ర విజ్ఞానం, పరిశోధనలు కనుమరుగైనాయి. అనుకరణ ప్రవృత్తి, దాస్య మనోవృత్తి బలపడినాయి. ఈ సందర్భంలో భారతీయ గణిత శాస్తవ్రేత్త శ్రీ సి.వి.రామన్ 1941లో ప్రయాగ విశ్వవిద్యాలయంలో విద్యార్థులనుద్దేశించి చెప్పిన మాటలు గుర్తుంచుకోవలసినది.
"Boys when we import, we not only pay for our ignorance. But we also pay for our in completence.''
గ్రీకు దేశస్థుడైన ‘‘ఆర్కిమెడీస్’’ తులాదండాన్ని గురించి చెప్పేవరకు భారతీయులకు తూనికల గురించి విజ్ఞానంలేదట.

డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ 9490947590