సబ్ ఫీచర్

నారును పెంచే స్థలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక శతాబ్దంలో వచ్చిన ఆవిష్కరణలు దానివల్ల తరగతి గదిపై పడిన బాధ్యత వల్ల తరగతి గత శతాబ్దాల కన్నా ఎన్నో రెట్లు ఎదిగింది. విద్యార్థి వ్యక్తపరిచే సృజనాత్మక భావాలకు తరగతి గది వేదికైంది. మానవ కల్యాణానికి ఉపయోగపడే జ్ఞానాన్ని అందించే స్థాయికి తరగతి గది ఎదిగింది. విభిన్నమైన అభిప్రాయాలకు సమన్వయకర్తగా రూపొందింది. విద్యార్థి, ఉపాధ్యాయుడు తరగతి గదిలో జరిగే చర్చకు శాస్ర్తియ రూపం తీసుకువస్తున్నారు. తరగతి గది చర్చ ఎన్నో ఆవిష్కరణలకు మూలవౌతున్నది. మునుపటి మాదిరిగా తరగతి గది- పిల్లలు తెలిసీ తెలియకుండా మాట్లాడే మాటలకే కాదు, సృజనాత్మకమైన భావాలకు కూడా కేంద్రమైంది. ఈనాడు తరగతి గది- ఒక భావనను సృజనాత్మకమైనదా? కాదా? అని నిర్థారణ చేసే స్థాయికి వచ్చింది.
తరగతి గది పరీక్షలకు మాత్రమే పరిమితం కాదు. దేశంలో జరిగే సామాజిక, వైజ్ఞానిక, ఆర్థిక మార్పులకు తొలి అడుగులు పడుతున్నాయి. దేశాలన్నీ కూడా తరగతి గది ప్రమాణాలకు మించి, విద్యార్థులను దేశ ప్రగతిలో భాగస్వాములను చేస్తున్నాయి. ఈనాడు తరగతి గదిలో చర్చ రాబోయే ఆవిష్కరణలకు తొలి అడుగు. ఈ బాధ్యతను విద్యారంగం స్వీకరించి దాని ఎదుగుదలకు తోడ్పడితే దేశాల లక్ష్యాలు నెరవేరడం సులభతరవౌతుంది. తరగతి గదిలో తయారైన మానవ వనరులు దేశాలకు ఎగుమతి చేసే సరుకు కాదు. ప్రగతిలో అది దేశ ప్రగతికి నారు వంటిది. నారు ఎంత పుష్టికరంగా వుంటే పంట అంత శక్తివంతంగా ఉంటుంది. క్రియేటివ్ థింకింగ్ అన్నది సృజనాత్మక భావాలకు నారు. ఆ నారును పెంచే స్థలం తరగతి గది.
లెర్నింగ్‌ను పరీక్షించాలి..
తరగతి గదిలోకి ప్రవేశించగానే ఉపాధ్యాయుడు విద్యార్థులను అంచనా వేస్తాడు. విద్యార్థి మెదడులో వున్న జ్ఞానాన్ని జ్ఞాపకం చేసుకునే పనిచేస్తాడు. రోగిని డాక్టర్ ‘నీ పేరేమిట’ని అడుగుతాడు. అంటే రోగి పేరు చెప్పే స్పృహలో ఉన్నాడని అర్థం. చెప్పలేకపోతే స్పృహలో లేడని వైద్యుడు అర్థం చేసుకుంటాడు. ఇది అన్నింటికన్నా సులభమైనది. ఉపాధ్యాయుడు కూడా పరీక్షలో తను చెప్పిన విషయాన్ని లేదా పుస్తకంలో విషయాన్ని విద్యార్థి చదివాడా? లేదా? అని రికార్డు చేస్తాడు. ఇది జ్ఞానం కాదు. కొలమానాల కన్నా దాని ఉపయోగం ప్రధానం. తరగతి గదిలో ఉపాధ్యాయుడు కొలమానాలు చెప్తాడు. పరీక్షల్లో అడిగేది మాత్రం కొలమానం ఉపయోగం అడుగుతాడు. సమాచారాన్ని ఉపయోగిస్తే అది జ్ఞానం అవుతుంది. పరీక్షల్లో జ్ఞానాన్ని అడగాలి కానీ సమాచారాన్ని కాదు. పరీక్షల్లో జ్ఞానాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. తరగతి గదిలో చెప్పిన విషయాన్ని, సమాచారాన్ని విద్యార్థి వేరే విషయానికి మార్చగలుగుతాడా? లేదా? అని చూస్తారు. విద్యార్థి తన ఆలోచనతో తన రీజనింగ్‌తో సమాచారాన్ని జ్ఞానంగా మార్చుతాడు. ఉపాధ్యాయుడు చెప్పిన విషయాన్ని యథాతథంగానే తీసుకుని సమాజంలో వుండే సాంప్రదాయాలతో విద్యార్థి తన ఆలోచనలతో రెక్టిఫై చేసుకుంటాడు. సమాచారం సమాజం అనుభవంతో జ్ఞానంగా మారుతుంది. తరగతి గదిలో విద్యార్థి దానిని న్యాయ నిబంధన చేయడం, దానిపై విశ్వాసం కల్గించడంతో ఉన్నతమైన ఆలోచనగా మారుతుంది. గ్రంథంలో వున్నది మాత్రమే పరీక్షల్లో అడగాలని అనటం జ్ఞాన సముపార్జనకు సరైన కొలమానం కాదు. తరగతి గది మూఢ విశ్వాసాల ప్రచారం కోసం కాదు. సమాచారాన్ని జ్ఞానంగా మార్చే ఆలయం తరగతి గది. ఉపాధ్యాయుడు తరగతి గదిలో చేసేది సమాచారం ఇవ్వడం మాత్రమే. విద్యార్థి దాన్ని జ్ఞానంగా మార్చుకుంటాడు. 21వ శతాబ్దంలో ఉపాధ్యాయుడు జ్ఞానాన్ని పరిశీలించాలి కానీ సమాచారాన్ని కాదు.

-చుక్కా రామయ్య