సబ్ ఫీచర్

మోసపోకండీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాంక్ నుండి డబ్బు తీసుకొని వచ్చేవారిని గమనించి వారి ముందు వంద రూపాయల నోట్లను వేసి, వాటి కోసం వంగి తీసుకొనే సమయంలో వారిని ఏమార్చి డబ్బు సంచిని మాయం చేసినట్లు, సాతాను మన ముందు కూడా ఏదో ఒక చిన్న ఎరను వేసి మన అమూల్యమైన రక్షణను, సంతోషాన్నీ, సమాధానాన్నీ, దేవుడితో మనకున్న సత్సంబంధాన్ని కూడా చెడగొడుతున్నాడు.
ఈ మోసపు వలయం నుండి మనల్ని తప్పించడానికే ప్రభువు ఈ లోకానికి వచ్చాడు.
యేసు వారితో ఇట్లనెను - ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. (మత్తయి 24:4)
‘నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. (యాకోబు 1:16)
‘దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును’ (యాకోబు 1:15)
‘చిన్నపిల్లలారా, యెవడును మిమ్మును మోసపరచనీయకుడి’ (1 యోహాను 3:7)
సాతానుడు బహు మోసకారి. మొట్టమొదటిగా ఈ ‘మోసం’ అన్న మాటను మనం చూసినట్లయితే ‘అవ్వ’ మోసపోయింది. అది కూడా చిన్న పండు కోసం! వాస్తవానికి ఏదేను తోట అంతా ఆదాము, అవ్వలదే. సాతాను ‘అవ్వ’ని మభ్యపెట్టి పండుని తినేట్టు చేయటంతో ఏదేను తోటని పోగొట్టుకుంది. తండ్రి సహాయాన్ని పోగొట్టుకున్నారు వారిద్దరూ. ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకున్నారు.
ఇక ఏశావు విషయానికి వస్తే - చిక్కుడుకాయ కూర కోసం ఏశావు మోసపోయాడు. తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. సంసోను డెలీలా విషయంలో మోసపోయి తన మహాబలాన్ని పోగొట్టుకున్నాడు. గెహాజీ సంగతి తీసుకుంటే - యజమానుడు వద్దన్న వాటికి ఆశపడి కుష్ఠురోగాన్ని తెచ్చుకొన్నాడు గెహాజీ. సమూయేలు కుమారుల విషయానికి వస్తే- ధనాపేక్షులై లంచాలు పుచ్చుకొని న్యాయాన్ని తిప్పివేసి వారి ఉన్నత పదవులను పోగొట్టుకున్నారు. దీనికి కారణం మోసపూరితమైన మనస్తత్వమే. ప్రవర్తనే.
ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ధనాపేక్ష. ఒకరిపై ఒకరికి మోసపూరిత ఆలోచనలు. వెయ్యి రూపాయలు కడితే నెలకు రెండు వేలు ఇస్తామని మొదటి నెల రెండింతలు పొందుకుని, అత్యాశకు పోయి పదివేల నుండి యాభై వేల వరకు అప్పులు చేసి చిట్టీలు కట్టిన వారి గురించి మనకు తెలుసు. ఆ తర్వాత వారెంతగా మోసపోయారో వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అత్యాశకు ఫలితం ఇది.
మరో ఉదాహరణ చూద్దాం. ‘మీరు కోటి రూపాయలు గెల్చుకున్నారు. టాక్స్‌లు కట్టాల్సి ఉన్న కారణంగా మీరు మాకు 5 లక్షలు డిపాజిట్ చేస్తే ఆ కోటి రూపాయలు మీ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తామంటే.. ఆ మాటలను నమ్మిన ఓ పోలీస్ ఆఫీసర్ ఐదు లక్షలు ఇచ్చి మోసపోయిన విషయం ఇటీవల పత్రికల్లో చూశాం. సాధారణ పౌరులైతే పోలీసులను ఆశ్రయిస్తారు. మరి ఆ పోలీస్ ఆఫీసర్ ఎక్కడికి వెళ్లాలో ఎవరికి చెప్పుకోవాలో తెలీని అయోమయ స్థితి.
‘మోసం చేసేవాడిది తప్పుకాదు. మోసపోయే వారిదే తప్పు’ అన్న విషయం తెలిసిందే.
యేసు ప్రభువును సైతం సాతాను మోసం చెయ్యటానికి ప్రయత్నించాడు. ఎన్నో పన్నాగాలు పన్నాడు. శరీరాశ, నేత్రావ, జీవపు డంబం అనే మూడు విధాలుగా ప్రయత్నించాడు. విఫలమయ్యాడు. 40 దినాలు ఉపవాసం ఉండి కూడా శోధకుని వలలో పడకుండా వాక్యంతో సాతానుని ఎదిరించాడు.
సాతానుడి మోసపు వలలో నుండి మనలను తప్పించడానికే ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఆయనే మనకు మాదిరి.
ఆశ, దురాశలలో పడకుండా ఉండటానికే ప్రభువు వచ్చి మనకు మాదిరిని చూపించి, ఆయన రక్తంలో మన పాపాలను కడిగి దేవునికి, మనకు మధ్య కోల్పోయిన బంధాన్ని కలిపి మనల్ని తన కుమారులుగా, కుమార్తెలుగా చేశాడు. కాబట్టి - మోసపు వలలో చిక్కుకొనకుండా మనల్ని మనం రక్షించుకొనేందుకు దేవుని వైపు తిరగాలి. ఆయన్ని హత్తుకోవాలి.
*

-మద్దు పీటర్