సబ్ ఫీచర్

సమస్యల పద్మవ్యూహంలో యువతకు దారేదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశ జనాభా 125 కోట్లకు మించిపోగా, అందులో 35 ఏళ్లలోపు వయసు కలిగిన వారి సంఖ్య 80 కోట్ల పైమాటే. ప్రపంచంలోనే యువత అత్యధికంగా ఉన్న భారత్‌లో పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం, అవినీతి, అకాల మరణాలు వంటి సమస్యలు విలయ తాండవం చేస్తున్నాయి. ఈ సమస్యలను యువత ఎదుర్కొనవలసి వస్తోంది. చిన్నారులను భావి భారత యువతగా తీర్చిదిద్ది, వారి శక్తిసామర్థ్యాలను జాతి కోసం వినియోగించుకోవాలి. కుటుంబం, సమాజం, ప్రభుత్వం కలిసి ఆరోగ్యవంతమైన భవిష్యత్‌ను యువతకు ప్రసాదించాలి.
ప్రస్తుత 21వ శతాబ్దంలో రెండవ దశాబ్దం అంచున వున్న భారతావనిలో జీవన స్థితిగతులు దుర్భరంగా వున్నాయి. అభివృద్ధి, పురోగతి పేరిట సృష్టించబడుతున్న సంపదను కార్పొరేట్ గుత్త్ధాపత్యం మింగేస్తోంది. 70 ఏళ్ళ స్వతంత్ర భారతావనిలో ఏ రాజకీయ పార్టీకి అధికారం అప్పగించినా యువతకు విద్య, ఆరోగ్య, ఉద్యోగ, ఉపాధి రంగాలలో నిరాశా నిస్పృహలు తప్పడం లేదు. అధికారమే పరమావధిగా వ్యవహరిస్తున్న రాజకీయ పార్టీలు యువతను శుష్క వాగ్దానాలతో లోబరుచుకొని తమ స్వార్థప్రయోజనాలకు వినియోగించుకొంటున్నాయి. ఏరు దాటాక తెప్పతగలేసే వ్యవహారాలతో చేతులెత్తేస్తున్నాయి.
జాతీయ పునరుజ్జీవన చైతన్యోద్యమ వైతాళికులు, సంఘ సంస్కర్తలు, స్వాతంత్య్ర సమర యోధులు ఆకాంక్షించిన నవభారతం ఇప్పుడు సాంకేతిక ప్రజ్వలనంతో కొత్తపుంతలు తొక్కుతోంది. అయితే- విద్యా వ్యాపారం వల్ల సంపన్న, పేదవర్గాల మధ్య అగాధం పెరిగింది. దైనందిన జీవన విధానంలో టెక్నాలజీ అరచేతిలోకి అందుబాటు కావటంతో యువత స్వేచ్ఛామార్గాలను వెతుక్కుంటోంది. యువతను నిర్వీర్యం చేసే సెల్‌ఫోన్లు, అశ్లీల వెబ్‌సైటులు, హింసా దౌర్జన్యాలకు ప్రేరేపించే సినీ, టీవీ ఛానల్స్ సంస్కృతి వారిని విచ్చలవిడిగా ఆకట్టుకొంటోంది. లేత మనసులపై మద్యం, మత్తుప్రభావం పడుతోంది. మానవతావిలువలు నశించటంతో నేరప్రవృత్తి పెరుగుతోంది. యాంత్రిక పరిజ్ఞానం నుంచి కృత్రిమ మేధాజ్ఞానం వైపు దూసుకుపోతున్న అత్యాధునిక సమాజంలో యువత బతుకుతెరువు వెతుక్కుంటోంది. శ్రామిక మహిళలు వలస కార్మికులుగా తరలిపోతున్నారు. ఆకర్షణీయమైన సంపాదన కోసం అర్రులు చాసే యువతతోపాటు శ్రమజీవులకు దూరతీరాలు లేవు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించాలని పోటీపడుతున్నాయి. బ్యాంకుల్లోని ప్రజాధనాన్ని మాల్యా, లలిత్ మోదీ, నీరవ్ మోదీ వంటి వారు దోచుకొని విదేశాలకు పలాయనం చిత్తగిస్తుంటే ప్రభుత్వం నిస్సహాయంగా ఉంటూ, ఓట్లవేటలో మునిగితేలుతోంది. అవినీతి విలయ తాండవం చేస్తుంటే రైతుల ఆత్మహత్యలు, విద్యార్థుల బలవన్మరణాలు పెరుగుతున్నాయి.
ప్రధాని మోదీ ఒక సందర్భంలో యువజన శక్తియుక్తులు, వారి ఆశయ స్వప్నవాంఛితాలు, సంస్థాగత నైపుణ్యం భారతదేశ సముజ్వల ఆర్థిక వికాస సాధనలో అత్యంత ప్రధానమని పేర్కొన్నారు. కాని నేటి యువత సామాజిక రంగంలో విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొంటోంది. సున్నిత హృదయాలతో స్వల్ప సమస్యలను పరిష్కరించుకోలేక మానసిక కుంగుబాటుకు లోనవుతోంది. కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల ఆధిపత్య వ్యాపార ధోరణుల కారణంగా విద్యార్థులు ఇంటాబయటా ఒత్తిడి భరించలేక పోతున్నారు. ఒకపక్క ప్రేమోన్మాదం విశృంఖలంగా ఎందరినో బలితీసుకొంటోంది. మద్యం వ్యాపారాన్ని ఆదాయం కోసం ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాధినేతలు మత్తుపదార్థాలను అరికట్టడంలో విఫలం చెందుతున్నారు. మరోవైపుకుల, మత,ప్రాంతీయ వైషమ్యాలు, అసమానతలతో కూడిన అనైతిక జీవన విలువల యువతను పీడిస్తున్నాయి. యువత చేపట్టే ఆగ్రహోద్యమాలను అణచివేయటానికి ప్రభుత్వాలు శాంతి భద్రతల పరిరక్షణ పేరిట పోలీసు యంత్రాంగాన్ని ప్రయోగిస్తున్నాయి. ప్రస్తుత యువజన సంబంధిత సామాజిక చిత్రం ఇంత అస్తవ్యస్తంగా వుండగా- సీబీఎస్‌ఈ పరీక్ష పేపర్‌ల లీక్ ఉదంతం విద్యార్థి లోకానికి మరింత నిర్వేదన, నిరాశ కలిగిస్తోంది. ఇది దేనికి సంకేతం?

- జయసూర్య సెల్: 94406 64610