సబ్ ఫీచర్

ఆచారాల పాలనతోనే సంస్కృతికి రక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూర్వకాలంలో యజ్ఞాలు, యాగాలు చేసేవారు. తత్ఫలితంగా ప్రకృతికి మేలు జరిగి ఋతువులు వాటి ధర్మాన్ని క్రమం తప్పకుండా ఉండేవి. దానివలన వానలు కురవాల్సిన సమయంలో వానలు, ఎండలు ఉండాల్సిన సమయంలో ఎండలు వచ్చేవి. ప్రజలంతా కూడా ఎవరి కర్తవ్యాన్ని వారు నిర్వహించేవారు. ఆకాలంలో అంతగా క్షామ పరిస్థితులు ఉండేవి కావు. ఎందుకంటే వారు కాలుష్యాన్ని పెంచేవారు కాదు. సోమరులుగా ఎవరూ ఉండేవారు కూడా కాదు.
అహింసావాదం పట్ల ఆసక్తి కూడా వారికి ఉండేది సత్యం, ధర్మం, దానం, శాంతి మొదలగు గుణాలు ప్రతివారిలో ఉండేవి. స్వార్థరహితులుగా ఉండేవాళ్లు. ఎక్కడా హింస, అతివృష్టి, అనావృష్టి క్షామం కనిపించేవి కావు. ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించేవారు.
కానీ నేడు సోమరులు అతివాదులు ఎక్కువ అయ్యారు. మానవత్వాన్ని మరిచి అరాచకాలను సృష్టిస్తున్నారు. ఒకరి సొమ్మును మరొకరు లాక్కొని తినాలని చూస్తున్నారు. వీరికి యజ్ఞాలు యాగాల పట్ల ఆలోచనలేదు. కర్తవ్యనిష్ఠ లేదు. స్వార్థపూరులుగా ఉండేవారు ఎక్కువ అవుతున్నారు. నాడు ధర్మో రక్షితి రక్షతః అని, సత్యం పలకాలని, పరుల సొమ్ము పాముతో సమానమని, కష్టించి వాడే సుఖపడుతాడని నమ్మేవారు. దైవం మనకు కనబడుతుందా అని ప్రశ్నిస్తారు ఇపుడు. దైవం అంటే ఎక్కడో ఏ గుళ్లోనో ఉంటుందనుకొనేవారు ఇపుడు పెరుగుతున్నారు.
కాని భగవంతుడు అంటే ఎదుటి మనిషే. మనం ఎదుటివారిని కొట్టి తినాలంటే అది ఎన్నాళ్లు సాగుతుంది. తలను కొట్టేవాడుంటే తాటిని కొట్టే వాడుంటాడు. ఆ తాడు చిన్న కత్తెరకు తెగిపోతుంది కదా.ఒకరిని మనం కాపాడితే దైవం మనలను కాపాడుతుంది కాని మనం ఒకరికి నష్టం కలిగిస్తే దైవం ఆ నష్టాన్ని మనకూ కలిగిస్తాడు. ధర్మం మరిస్తే వారు ఎంత పెద్దవారైనా ఎన్ని త్యాగాలు చేసినా, ఎంత ధ్యానం చేసినా భగవంతుని మెప్పించినా సరే అధర్మపరులను మట్టు పెట్డడమే స్వామి ధర్మం అని ఒక మంచి పని చేసి పదిమందిని హింసించడం మొదలు పెడితే వారిని వెంటనే దేవుడు శిక్షిస్తాడు.
అందుకే తెలిసీ ఎవరికీ ద్రోహం చేయకూడదు. ఒకవేళ పొరపాటున ఎవరికైనా అన్యాయం చేస్తే వారి దగ్గరకు వెళ్లి నేను చేసింది అన్యాయమే. ఇక ఎపుడూ ఇట్లా చేయను అనిచెప్పి నిజంగా ఇక ఎపుడూ అన్యాయం చేయకపోతే వారిని మంచివారుగా తలువచ్చు. శాంతి, ప్రేమ, కరుణ అందరూ కలిగి ఉండాలి. మన ఆచారాలను, సంప్రదాయాలను పాటించాలి. అందరికీ ప్రేమనే పంచాలి. క్షమించేగుణాన్ని కలిగి ఉండాలి.్భగవంతుని నామజపాన్ని చేసినా మంచిఫలితాన్ని భగవంతుడు ఇస్తాడు. పరులకు మేలుకొంచెం అయనా చేయాలి. అపుడే మనుషులుగా పుట్టినందుకు సార్థకత లభిస్తుంది. ప్రతీవారు మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకునేందుకు కృషిచేయాలి. భావి తరాలకు దాన్ని జాగ్రత్తగా అందించాలి. అప్పుడే మనమూ మనతోపాటు మన సమాజమూ సుఖ సంతోషాలతో వర్థిల్లుతుంది.
*

-ఆర్.పురంధర్