సబ్ ఫీచర్

బోధన సరియైనదేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీస్తు పూర్వం 287 నుంచి 212 మధ్య జీవించిన ‘‘ఆర్కెమిడీస్’’అనే ఆయన ‘త్రాసును కనుగొన్నాడట. అప్పటివరకూ పాశ్చాత్యులకు తూనికల గురించి తెలియదుగానీ, కోట్లాది సంవత్సరాలుగా అత్యల్ప తూనిక సాధనముగా ‘‘త్రసరేణువు’’ను వుంచి, తూచి చూపించిన మాన్వాదిస్మృతులుగల భారత్ జాతికి తూనిక సాధనముల గురించి త్రాసు గురించి తెలియదని ఎట్లనుకొందుము. భారత భాగవతాది గ్రంథములతో శ్రీకృష్ణ తులాభారము వంటి గొప్పతూనికల ప్రస్తావన, శిబిచక్రవర్తి తన మాంసమును పావురము బరువుకు తగునట్లు డేగకిచ్చుట వంటి ప్రశస్త సంఘటనలు, జ్యోతిష శాస్తమ్రులలోని రాశులలో ‘‘తులారాశి’’గురించి కోట్ల సంవత్సరాలుగా తెలిసియున్న భారతీయులకు త్రాసు గురించి, తూకముల గురించి ‘‘అర్కెమిడీస్’’కు పూర్వము తెలియదని ఎట్లు భావించాలి. ఇట్టి తప్పుడు సిద్ధాంతాలను భారతీయ విద్యార్థులకు బోధించుట ఎంత అవమానకరమో చూడండి. స్వాభిమానము కొరవడుట కాదా!
196 కోట్ల సంవత్సరాల క్రితం పుట్టిన ‘స్వాయంభువ మనువు’’ తన మనుస్మృతిలో ఎంతో సునిశితముగా తూకముల గురించి, అంగళ్ళలో వ్యాపారస్థులు మోసము చేయకుండగా తూనికల గురించి త్రాసుల గురించిన పర్యవేక్షణ గురించి చెప్పిన విషయాలను చూడండి.
శ్లో॥ తులామానం ప్రతీ మానం సర్వం చస్వాత్సు లక్షితం!
షట్సు, షట్సు, చమాసేషు, పునరేవ, పరీక్షయేత్ (403)
‘‘లోకస్య వ్యవహారార్థం! యాస్సంజ్ఞాః ప్రతిధాభివి’’
తామ్రరూప్య, సువర్ణానాంతేః ప్రవక్ష్యామ్య, శేషతః (131)
‘‘జాలాంతర్గతే భానౌ, యత్సూష్మంద్రశ్వతేరజః
పరమంతత్ప్రమాణానాం, త్రసరేణుం ప్రచక్షతే (132)
(ఇతిమనుస్మృతిః 8వ అధ్యాయం. శ్లోకార్థం:- అంగళ్ళలో వ్యాపారస్థులు మోసముచేయకుండ తప్పుడు తూకములు తూచకుండగా, తూనికలు, కొలతలు సరిగా వుండునట్లు చూచుటకు, తూకపు రాళ్ళు, త్రాసులను ఆరుమాసముల కొకసారి, రాజోద్యోగులు తనిఖీలు చేయుచుండవలెనని మనుస్మృతి ఏనాడో చెప్పింది.
లోక వ్యవహారముకొరకు, ఆయా గుర్తులుగల తూకపురాళ్ళను, రాగి, వెండి, బంగారము వంటి లోహములనుపయోగించి తూకమునకనువగు తూకపురాళ్లను తయారుచేసి వుపయోగించెడివారు.
ఈ లోహములతో తయారుచేసిన అనేక పరిమాణములుగల లోకమందు ప్రసిద్ధిచెందినవాటి గురించి కూడ వివరింపబడెను.
భారతదేశపు తూనికలలో మొదటిది (అతి చిన్నది) త్రసరేణువనగా కిటికీలు, యింటి పైకప్పులగుండా యింట్లోకి ప్రసరించే సూర్యకిరణములలో కనబడే ధూళికణము ఇది భారతీయ తూకపు రాళ్లలో కనిష్టమైన విశ్వకర్మ విరచిత వాస్తుశాస్తమ్రులో 7వ అధ్యాయములో తూనికలకు సంబంధించి, త్రసరేణువులు, పరమాణువులను కూడ చెప్పియున్నాడు, కానీ తూనికల మానము, మానవుల వూహకందని దనియు అది దేవలోకమునందు వాడుకలోనున్నదని చెప్పాడు విశ్వకర్మ రుూ క్రింది శ్లోకంలో
శ్లో॥ పరమాణ్వాది మానంత ప్రసిద్ధం సురసంసది,
నగ్రాహ్యం నాపివిజ్ఞేయం మానవైస్తుకదాచన (72)
తస్మాన్మానవ మానంతు ప్రోచ్యతే ఫలదాయితత్
శాలివ్రీహిస్తు సర్వత్ర సిద్ధమానోదమోతతః (73)
శ్లోకార్థం:- పరమాణువులతో తూచే విధానము దేవలోకమందు ప్రసిద్ధమైనది. మనుషులకు తెలియనిది, సాధ్యముకానిది. అందువల్ల మనుషులకు అన్ని ప్రాంతములలో అనువగునట్టి, స్థిరమగునట్టి, ధాన్యపు గింజలు, గురివింద గింజలు, యవలు మొదలగు వాటితో స్థిరమైన కొలమానమును చెప్పెను.
యదార్థమిట్లుండగా మనము వేరే విధంగా, ఎవరో తూనికలు కనుగొన్నట్లు బోధిస్తున్నాము.
..........................ఇంకావుంది

డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ 9490947590